వెళ్ళండి బాబుగారూ 1 226

డాక్టరు రాసిచ్చిన ఇంజెక్షన్లు ఊర్లో ఉన్న ఇంజెక్షన్ వెయ్యడం తెలిసిన వొకే వొక్కడు ఆచర్లు చేత
రోజూ చేయించుకునే వాడు తను. అదైనా అందరిలా తనే ఆచార్లు దగ్గరకెల్లి చేయించుకుని ఉంటే ఏ సమస్యా ఉండేది కాదు. ఊర్లో పెద్దమనిషిగా చెలామని అయ్యే తను రొజూ డాక్టరింటికి వెలితే నామోషీగా ఉంటుందని దర్జా వెలగబెట్టడం కోసం ఆచార్లునే తనింటికి వచ్చి సూది మందు వెయ్యమనడంతో ముప్పు తనకే వచ్చింది.
ఆచార్లు ఏం చదివాడో ఎవరికీ తెలియదు గాని తనకు అన్నీ తెలుసు అంటాడు.అభ్యంతరం లేదంటే పురుడు కూడా పోస్తానంటాడు. గాలి ధూళి, గ్రహ శాంతిలతో పాటు మంత్రాలు, చేతబడికి చెయ్యడం విప్పడం వచ్చంటాడు. అతనికి అపరిమితమైన విలువ ఇస్తారు ఆ వూరి ప్రజలు. అంత ఉచ్చ స్తితిలో ఉన్న ఆచార్లుకి రవ్వంతైన అహంభావమేమి లేదు చాలా కలుపు గోలుగా ఉంటాడు. అతని వయసు ముప్పై, ముప్పై రెండు ఉంటాయి . సన్నగ పొడవుగా ఉండి కళకళలాడే మొహం తో ఉంటాడు. తన మాటకారితనంతో, నమ్రతతో ఆకట్టుకో గల నేర్పు అతనిలో ఓ ప్రత్యేకత.
ఆచార్లు ఆ వూరి మనిషి కాడు. కట్టుబట్టలతో వచ్చాడు. ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య కన్ను మూయడంతో, అక్కడా ఇక్కడా తిరిగి చివరకు ఇక్కడ స్టిరపడ్డాడు. అనతికాలంలోనే పంచాయితి ప్రెసిడెంటుకు కుడి భుజమైపోయాడు. ఆ వూరివారు అమ్మవారు ఆచార్లు పిలిస్తే పలుకుందనేవారు. అతనుండే ఇల్లే ఓ గుడి అనేవారు.

తన ఇంజెక్షన్ల కోర్స్ అయిపొయే సమయానికి తనకూ నీరసంగా ఉందని ఆచార్లు చేత పరీక్ష చేయించుకుంది తాయరమ్మ.
నాడి, నాలుకా, వొళ్ళు, చివరికి హార్టూ స్టెతస్కోపుతో పరీక్ష చేసి, మరేం పర్లేదు, ఓ పది రోజులు బి కాంప్లెక్స్ ఇంజెక్షన్లు చేయించుకుంటే సరి అన్నాడు. ఆ ఇంజక్షన్లేవొ నువ్వే తెప్పించి వెయ్యమన్నాడు సాంబయ్య.
రోజూ సాయంత్రం బాగ పొద్దుపోయాక తను పొలమ్నుంచి తిరిగి వచ్చే వేళళ్ళో రెండు మూడు సార్లు తటస్టపడ్డాడు… ఇదివరకు చావిట్లొ ఇంజక్షన్ చేసి పది నిమిషాల్లో వెళ్ళిపోయేవాడు ఇప్పుడు గదిలో కెందుకు వెళుతున్నాడు చెప్మా అన్న ధర్మ సందేహం పట్టుకుంది తనకి.
ఆచార్లు సంగతి తనకు తెల్సు.. అతనలాంటి వాడు కాక పోతే.. ప్రెసిడెంటు ఇంట్లోను మునసబు ఇంట్లోను తిరగగలడా.. నిజానికి అతనికి మగవాళ్ళకంటే ఆడవాల్ల వల్లనే ఎక్కువ పని పడుతుది. దాని వల్లనే వూళ్ళో బాగా పేరొచ్చింది కూడా.
“అతనెంత మంచోడైతే మాత్రం గదిలోకి తీసుకెళ్ళి కూచ్చోబెట్టి మరీ ఇంజెక్షన్ చేయించుకోడం ఏం బావుంటుందీ.. చావిట్లో చేయించుకోవచ్చు కదా” ఉక్రోషం పట్టలేక పెళ్ళాన్ని నిలదీసి అడిగేసాడు తను.
అపర కాళి లాగ విరుచుకు పడిందామాటకి తాయారమ్మ.
“చేతకానోడికన్నిటికీ అనుమానమే! ఆ ఇంజెక్షను చేతి మీద చేయించుకుంటే ఓ పట్టాన చెయ్యి లేవడం లేదు. అందుకని తుంటి మీద చేస్తున్నాడు. చీరకట్టు క్రిందికి లాక్కుని చావిటిలో పడుకుంటే.. రోడ్డు మీద వచ్చే పొయ్యెవాళ్ళు ఎవరు చూసినా .. ఉమ్మేస్తారు.. అయిన దానికి కాని దానికి ఇలాంటి వెధవ అనుమానాలు పెట్టుకుంటే నేనింక కాపురం చేసినట్టే.. చీ..చీ.. మొహం మీద వూసినంత పని చేసి హడావిడి చేసింది.
ఎవరైనా వింటే తనకే పరువు తక్కువ అని మరింక కిక్కురు మనలేదు తను.
ఆ రెండో రోజున చిన్న పని తగిలి రోజు కంటే ఓ పావు గంట ముందుగా పొలం నుంచి తిరిగి వచ్చేశాడు తను. బయట కనిపించిన సైకిలు చూడగానే ఆచార్లు లోపలున్నాడని అర్ధమైంది తనకు. లోపలకెళ్ళడానికి జారేసిన తలుపు తీస్తుండగ అయిన అలికిడికి “ఎవరదీ” అంటూ లోపల్నుంచి కేకేసిన తాయారమ్మ గొంతులో ఏదో తొట్రుపాటు తొంగి చూసింది తనకి… లోపల ఏదొ జరగ కూడనిది జరుగుతోందని ఆ ప్రశ్నను బట్టి గ్రహించాడు తను. అది తన బ్రమ కావచ్చు, లేదా నిజం కావచ్చు. దేవుదికెరుక .. అనుకుంటూ.. ” ఎవరూ కాదు .. నేనే!అంటూ కాళ్ళు కడుక్కోడానికెళ్ళాడు. ఆ సమయంలో ఎందుకో గాని పడక గది దగ్గరకెళ్ళి చూడ బుద్ది కాలేదు. అసలా విషయం గురించి ఎక్కువగా ఆలోచించకూడదని వొట్టుపెట్టుకున్నాడు కూడాను. తన అపనమ్మకమంతా తన బంగారం మీదనే!.
అమ్మక్రమశిక్షణ