వెళ్ళండి బాబుగారూ 1 226

“రండయ్యగారు … మనం తొరగా వెళ్ళక పోతే అక్కడ కొంప మునుగుద్ది.. జోరుగా అడుగెయ్యండి…” సుమారు పది గజాలు ముందుకెళ్ళిపోయిన ఎంకడు తొందరపెడుతు గాబరాగా అన్నాడు.
“అదికాదురా వెనక్కెళ్ళి మన వాళ్ళని నలుగుర్ని పిలుచుకొద్దాం.. .. కామినీ పిశాచం దానినెందుకు పట్టుకుందిరా?”
బాగుందండీ మీ ప్రశ్నా? అదెందుకొచ్చిందో ఊళ్ళో ఇంకెవరూ లెనట్టు మనమ్మగారినే ఎందుకు పట్టుకుందో నాకెట్టా తెలుస్తుందండీ”
“పోనీ..ఆ రచ్చ బండ దగ్గరకెల్లి ఎవర్నైన పంపి ఆచార్లుని కేకేసుకుని రమ్మని చెప్పుదాం… ఇలాంటప్పుడు మనిషికి మనిషి సాయముంటే మంచిది … మనిద్దరం చేయగలిగేదేముందిరా అక్కడ”!
“అట్టయితే తమరు కొంప ముంచే లాగున్నారు”
ఆదరా బాదరాగా వెనక్కొచ్చి సాంబయ్య చెయ్యిపట్టుకుని లక్కుపోవడం మొదలెట్టాడు ఎంకడు…ఇలా కంగారు పడిపోతారనే ఆ రచ్చ బండ దగ్గర ఈ సంగతి అందుకే చెప్పలేదండీ … మమూలు దయ్యాలకైతే భూత వైద్యం పని సేత్తాదిగాని కామిని పిశాచి సంగతండీ ఇదీ.
అయినా ఇప్పుడు నలుగురికీ ఈ సంగతి ఎల్లడి చేసుకుంటే మనకే నామర్దాయిపోద్ది…. కొంచం ఉషారుగా ఎయ్యండడుగు…”
“ఇంతకీ అమ్మగారిదగ్గర ఎవరైన ఉన్నారా?”
“భలే ఓరండీ దగ్గరకి రానియ్యడం లేదు .. ఎవర్నీ కేకెయ్యకూడదంటున్నాను”

“మీరు కూడా లోపలకెళ్ళంగానే ఊరికే కంగారు పడిపోమాకండి… ఆవిడ అడిగింది చేసెయ్యండి…. అంతే”.