జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 9 62

బస్ వచ్చి ప్రవేశ ద్వారం వద్ద ఆగగా అందరూ కిందకు దిగి నోరు తెరిచి ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా నా ఫ్రెండ్స్ వెళ్లి అందర్నీ లోపలికి తీసుకొని వెళ్లగా వర్శినిని స్టేజి పక్కనే ఉన్న రూమ్ కు పిలుచుకొని వెళ్లగా మిగిలిన వారందరు ఎదురుగా కూర్చోగా అమ్మ ,అంటీ , అత్తయ్యలు స్టేజి మీదా తాము తెచ్చిన అన్ని వస్తువులను అలంకరించి, లోపలికి వెళ్ళి వర్శినిని మహి పిలుచుకొని రాగా సోఫా లో కూర్చోబెట్టగా పట్టు చీర మరియు నగలు అన్ని అలంకరించుకొని కుందనపు బొమ్మలా ఉండటంతో అందరూ తన వైపే అందరూ చూస్తుండగా, వర్షిని ముఖం దీనంగా పెట్టి ఎవరికోసమొ అన్నట్లు అటు ఇటు చూస్తూ నన్ను చూసేసరికి లేచి వస్తుండగా నేనే వస్తాను తరువాత అని సైగ చెయ్యగా నన్ను చూసినందుకు సంతోషంగా నవ్వుతూ కూర్చినసాగింది, తన ఫ్రెండ్స్ అంతా వాళ్ళ అమ్మలతో వచ్చినందుకు వర్షిని ఆనందానికి అవధులు లేవు.

ముత్తైదువులంతా ఆశీర్వదించిన తరువాత కింద ఉన్న అందరిని నా ఫ్రెండ్స్ ఒక్కొక్కరనే పైకి పిలుచుకొని వెళ్లి వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ ఇస్తూ పక్కనే నిలబడి ఫోటోలు దిగి కిందకు వచ్చి కూర్చుంటుండగా , పక్కనే నిలక్బడిన మహి చెవిలో వర్షిని ఏదో చెప్పగా మహి నా దగ్గరికి వచ్చి నా చెయ్యి పట్టుకొని స్టేజి పైకి పిలుచుకొని వెళుతుండగా అప్పటివరకు సంతోషంగా నవ్వుతున్న అత్తయ్య నేను రావడం చూసి ముభావంగా ఉండిపోగా మహి తరువాత వెళ్దాములే అని చెప్పగా వినకుండా లాక్కొని వర్షిని పక్కకు వెళ్లగా ఒక్కసారిగా వర్షిని లేచి నన్ను ఒక పక్క నుండి హత్తుకొని గుండెలపై తల వాల్చి thank you మావయ్య అని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకోగా పిచ్చిపిల్ల అని చేతితో ప్రేమగా కన్నీళ్లు తుడిచి నెమ్మదిగా కూర్చోబెట్టి ఆశీర్వదించి కిందకు దిగుతుండగా మహి ఆపి ఇద్దరు చెరొకవైపు నిలబడి ఫోటోలు దిగి కిందకు వచ్చి అమితమైన సంతోషంతో వంట ఏర్పాట్లు చూసుకోసాగాము.

ఒక గంట తరువాత వర్షిని కి మరొక చీర కట్టించి పిలుచుకొని రాగా వర్షిని ఫ్రెండ్స్ అందర్నీ పిలిపించి వాళ్ళతో పాటు నవ్వులు చిందిస్తూ ఫోటోలు దిగసాగింది 7 గంటల వరకు ఫంక్షన్ జరుపుతూ కింద కూర్చున్న వాళ్ళు ఫంక్షన్ గురించి ఎంత ఘనంగా జరుపుతున్నారు అని గుసగుసలాడుకొంటుండగా భోజనాలు కూడా రెడి అవ్వగా కొంత కొంత మంది గ్రూపులుగా వెళ్లగా రకరకాల వంటకాలు వడ్డించగా సంతోషంగా తింటూ ఇక వెళ్ళడానికి అన్నట్లు బయటకు వస్తుండగా నా ఫ్రెండ్స్ ఎక్సిట్ దగ్గర టేబుల్ పై రంగుల ప్రకారం పట్టు చీరలు వరుసగా పేర్చి మొదటి చీరను అత్తయ్యను పిలిచి ,మొదటగా బయటకు వెళ్తున్న మహిళకు అత్తయ్యకు చీరను దాని మీద ఆకు, వక్క మరియు పసుపు కుంకుమ పెట్టి ఇప్పించసాగారు.

1 Comment

Comments are closed.