జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 9 62

నాకు అత్తయ్య మీద ఉన్న ప్రేమను ఆమెకు నా మీద ఉన్న కోపాన్ని వాళ్లకు చెప్పి ఇప్పుడు అత్తయ్య ఉన్న పరిస్థితులు వివరించి నేను చెయ్యాల్సిన పనులు మీరు చెయ్యాలని చెప్పి నాకు అత్తయ్య ఇంటిలోకి ప్రవేశం లేదు అని చెప్పి భాధపడుతుండగా అందరూ ఒక్కొక్కరుగా కౌగిలించుకొని ఓదార్చగా కృష్ణ గాడు ఓర కంటితో చూస్తూ నమ్మక ద్రోహి అని తనలో తాను తిట్టుకుంటూ ఉండగా నాకు నవ్వు ఆగలేదు.

ఇక మిగిలిందంతా వెల్తూ మాట్లాడదామని అందరూ వాహనం లో వెనుక ఎక్కగా కృష్ణ నా రీబ్స్ మీద గుద్దుతూ డ్రైవింగ్ సీట్ లో కూర్చొనగా అటువైపు వెళ్లి కూర్చొనగా ,ఇంటి వైపు కదలగా వెనుక ఆటో మా వాహనాన్ని ఫాలో కాసాగగా, మన ప్లాన్ ఏంటంటే మీరంతా college స్టూడెంట్స్ లాగా అత్తయ్య దగ్గరికి వెళ్లి మన సాంప్రదాయాన్ని ప్రతిబింభించే ఫంక్షన్ ప్రాజెక్ట్ వర్క్ గా తీసుకున్నాము , అదృష్టవశాత్తు వెంటనే మీ ఫంక్షన్ ఉందని తెలిసింది మీరు అనుమతిస్తే మొత్తం ఫంక్షన్ అంతా మా డబ్బులతో జరిపించి డాక్యుమెంటరీ తీసి college లో సబ్మిట్ చేస్తే ఒక్కొక్కరికి 50 మార్కులు వస్తాయని చెప్పి ఎలాగైనా ఒప్పించాలి అని వివరిస్తాడు.

అంతలోనే ఇంటికి దగ్గరకు చేరుకోగా కొద్దిగా దూరంగా వాహనాన్ని నిలపమని చెప్పి ఇక మీ యాక్టింగ్ మీద ఆధారపడి ఉంది అని జాగ్రత్త అని చెబుతుండగా ,అందరూ వాహనం లోనుండి దిగి మహేష్ మేము చూసుకుంటాము అని ధైర్యం ఇచ్చి లోపలికి వెళతారు. మహికి ఫోన్ చేసి నేను బయటే ఉన్నాను నా స్నేహితులు వస్తారు వాళ్ళు చెప్పేదానికి వంత పాడమని చెప్పి కాల్ కట్ చేస్తాడు.

ఒక అర గంట ముందు ,వచ్చిన బంధువులను చూసి అత్తయ్య ఇప్పుడెలా అని గుండెల్లో గుబులు పడుతుండగా బస్ అత్తయ్య ఇంటి ముందు నిలబడగా కొద్ది మంది బంధువులు వచ్చి ఇల్లంతా కలకళలాడుతుండగా అమ్మ వాళ్ళు మరియు అత్తయ్య స్నేహితులు కిందకు దిగి లోపలికి వెళ్లగా అత్తయ్య అమ్మను వాళ్ళ స్నేహితులను చూసి చాలా సంవత్సరాల తరువాత కలవడం వల్ల నవ్వుతూ సంతోషంతో అందర్నీ కౌగిలించుకొని , అమ్మ దగ్గరికి వచ్చి టెన్షన్ పడుతుండగా అమ్మ అత్తయ్య చేతులు పట్టుకొని అంతా సవ్యంగా జరుగుతుంది అని హామీ ఇచ్చి వెళ్లి స్నానం చేసి రా పో అని పంపిస్తుంది.

1 Comment

Comments are closed.