జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 9 61

పనులు వేగంగా జరుగుతుండగా మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి , అక్కడినుండి ఫోటో స్టూడియో కి వెళ్లి ఫోటో లకు మరియు వీడియో కవరేజ్ వాళ్ళను వెంటబెట్టుకొని ఇంటి దగ్గర నుండి మొత్తం తీయాలని చెప్పి ఇంటి దగ్గరకు వెళ్లగా ,చాలా మంది బంధువులు వచ్చి ఇల్లంతా సందడి సందడిగా ఉండటంతో, మహికి ఫోన్ చేసి బయటకు పిలిచి వర్షిని బట్టలను ఇచ్చి అమ్మకు ఇవ్వమని చెప్పి ఫోటో లు తీసేవాళ్లను తీసుకెళ్లమని చెప్పి పంపించివేయగా కృష్ణ వెళ్లి రెండు ప్లేట్ లలో భోజనం తీసుకు రాగా అక్కడే తినేసాము.

4 గంటల వరకు అమ్మ ఫోన్ చేసి చిన్న చిన్న పనులు లోపలి నుండే చెబుతుండగా ఇద్దరమూ వెంటవెంటనే చెయ్యసాగాము. సమయం 4 గంటలు అవుతుండగా నా ఫ్రెండ్స్ కు కాల్ చేసి వాళ్ళ పనులను చెప్పి బస్ లో ఫంక్షన్ హాల్ కి పంపించి , అమ్మకు కాల్ చేసి రెడి గా ఉన్న వాళ్ళను బస్ లో ఫంక్షన్ హాల్ కి పంపిచ్చేద్దాము అని చెప్పగా లోపల అమ్మా రెడి గా ఉన్నవాళ్లకు బస్ లో పంపించసాగింది.

అక్కడ ఫంక్షన్ హాల్ ప్రవేశంలో నా స్నేహితులు పూలు ఇచ్చి అందర్నీ సాదరంగా ఆహ్వానిస్తున్నారు. వాహనం పక్కనే నీళ్లతో ముఖం కడుక్కొని వెనక్కు వెళ్లి లోపల ఇద్దరు కొత్త బట్టలు వేసుకొని ఫంక్షన్ హాల్ కు చేరుకొనగా బయట అలంకరణ చూస్తేనే మతిపోసాగింది. లోపలికి వెళ్ళి చూడగా చుట్టూ గులాబీ పూలతో అలంకరించి స్టేజి మీద బంగారు మరియు ఎరుపు రంగు కలిగిన పెద్ద సోఫా మాదిరి ఉన్న కుర్చీని మధ్యలో ఉంచి వెనుక అద్భుతంగా decorate చేశారు.

అంతా చూసి కృష్ణ అరే మామా సూపర్ రా అని చెప్పగా నాకు కూడా అలాగే అనిపించి అన్ని సక్రమంగా జరిగేలాగా చూసుకొనసాగాము. అమ్మ , అంటీ కలిసి 5 గంటల లోపల వర్శిని కి పట్టు చీర కట్టించి సుందరంగా అలంకరించి , ఇంటిలో మిగిలిన అందరూ రెడి అవ్వగా అమ్మ తెచ్చిన అన్ని పిండి పదార్థాలను బస్ లో పెట్టి ఇంటికి తాళం వేసి వర్శినిని బస్ లో పిలుచుకొని ఫంక్షన్ హాల్ కి చేరుకుంటారు.

1 Comment

Comments are closed.