జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 9 62

వొళ్ళంతా చెమటలతో బయటకు వచ్చి బయటి నుండి తలుపులు వేసి , కాంపౌండ్ గేట్ బయటకు వచ్చి గేట్ వేసి చిలుక పెట్టి జేబులో ఉన్న తాళాలు తీసి వాహనం స్టార్ట్ చేసి అమ్మకు జరిగినదంతా చెబుదామని ఫోన్ తియ్యగా సమయం 10 గంటలు అవుతుండగా , మళ్ళీ నా గురుంచి రాత్రంతా టెన్సన్ పడుతుందని ఆగిపోతూ ఉదయం చెబుదామని అనుకోని మధ్యాహ్నాం వస్తూ దారిలో చూసిన S R రెసిడెన్సీ కి వెళ్లి ఒక రూమ్ తీసుకొని బ్యాగును బెడ్ పై ఉంచి బాత్రూం వైపు వెళ్లి శుభ్రన్గా స్నానం చేసి వేరే బట్టలు వేసుకొని ఫోన్ అందుకొని కృష్ణ కు కాల్ చేసి అరే మామా నేను ఇప్పుడే మన క్లోజ్ స్నేహితుల్లో అమ్మాయిలకు కాల్ చేస్తాను , రేపు నువ్వే దగ్గరుండి అందర్నీ ఒక పెద్ద వాహనం బుక్ పిలుచుకొని 10 గంటలకల్లా ఇక్కడ ఉండాలి అని చెప్పగా ఇప్పుడే మీ అమ్మ గారు ఒక A C బస్ బుక్ చెయ్యమనగా మధ్యాహ్నం బుక్ చేసాను అంటీ ని అడిగి అందులో ఇంకా సీట్ లు ఖాళీగా ఉంటే అందులోనే అందరం వచ్చేస్తాము అని చెప్పగా సరే అని చెప్పి కట్ చేసి , ఒక్కొక్కరికి కాల్ చేసి వాళ్ళ ఇళ్లల్లో నాకు మంచి పేరు ఉన్నందున వాళ్ళ అమ్మాయిలు ఇక్కడికి రావడానికి వారిని ఒప్పించి, వాళ్ళు ఇక్కడ ఏమేమి చెయ్యాలో చెప్పి మిగతాదంతా కృష్ణ చూసుకుంటాడాని చెప్పి , కృష్ణ కు కాల్ చేసి నువ్వు కూడా ఒకసారి కాల్ చేసి అందర్నీ మీ ఇంటి దగ్గరికి రమ్మనమని చెప్పి, ఉదయం త్వరగా లేవాలి అని 6 గంటలకు అలారం పెట్టి A C on చేసి బెడ్ పై వాలిపోతూ నేను ఎంతో ఆరాధించే అత్తయ్యకు దగ్గరవ్వాలన్న ఎంతో కొద్దిగా ఉన్న కోరిక కూడా ఈరోజుతో మొత్తం కూలిపోయి, అత్తయ్యకు మరియు నాకు మధ్య దూరం ఈ రోజుతో ఇంకా పెరిగిపోయింది అని పదే పదే ఆలోచిస్తూ బాధ ఎక్కువ అవుతుండగా గోవా కు ఫోన్ చేసి అమ్మ తియ్యని మాటలు వినగానే హాయిగా అనిపిస్తుండగా ఇద్దరు సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడుతూ ఎప్పుడు పడుకున్నానో తెలీకుండా పడుకున్నాను.

ఉదయం 5:30 కు మహి లేచి బావకు కాఫీ పెడదామని వంటింట్లోకి వెళుతుండగా పక్కనే ఉన్న చిన్నా రూమ్ లో బావ లేకపోయేసరికి, హాల్ లో ఏమైనా ఉన్నాడేమోనని చూడగా అక్కడ కూడా లేకపోవడంతో బయటకు వెళ్ళాడేమోనని బయటకు వెళుతుండగా తలుపుకు లోపల నుండి తాళాలు వేసి ఉండటంతో రాత్రి అమ్మ బావను ఏమైనా అని ఉంటుందా అని గుండెల్లో గుబులు కాసాగింది.

అమ్మ రూమ్ దగ్గరికి వెళ్లి లేపి బావ ఎక్కడ అని అడుగగా మౌనంగా పడుకొని పోగా , వెంటనే తన రూం లోకి వెళ్లి మొబైల్ అందుకొని బావ నెంబర్ కు కాల్ చెయ్యగా , మొబైల్ రింగ్ కు మెలకువ రాగా బావ ఎక్కడ 7న్నావు అని అడుగగా మహి చిన్నా రూమ్ లో A C లేకపోవడం వల్ల నిద్ర పట్టలేదు అందుకే A C హోటల్ లో రూమ్ తీసుకోవడం వల్ల బాగా నిద్ర పట్టింది అని చెప్పగా బావ అపద్ద0 చెబుతున్నాడని గ్రహించి స్నానం చేసి రెడి అయ్యి బావ ఉన్న హోటల్ కు భయలుదేరాడానికి తలుపు తెరువగా బంధువులు ఒక్కొక్కరుగా ఆటో లలో దిగుతున్నందువల్ల అమ్మను లేపి వచ్చిన వాళ్లను లోపలికి ఆహ్వానించి మర్యాదలు చెయ్యసాగింది.

1 Comment

Comments are closed.