జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 9 62

అమ్మ తన కన్నీళ్లు తుడిచి మామయ్య ఏదో పనిలో ఉన్నట్లు ఉన్నాడు తరువాత వస్తాడులే అని చెప్పి కిందకు పిలుచుకొని వచ్చి హాల్ లో సోఫా లో కూర్చోబెట్టగా , బంగారు నగలతో అలంకరించిన తన కూతుర్ని చూసుకొని అత్తయ్య సంతోషంతో కళ్ళు నీళ్లు కారగా అమ్మను గట్టిగా కౌగిలించుకుంటుంది.

మా ఫ్రెండ్ కాల్ చేసి సక్సెస్ అని చెప్పగా అందరూ tiffen తినేసి ఇద్దరిద్దరు మహితో, అమ్మతో మరియు అత్తయ్యతో కలిసి వెళ్లి చుట్టుపక్కల ఉన్న వారిని ఒక్కరినీ కూడా వదలకుండా విషయం చెప్పి ఫంక్షన్ ఎక్కడో చెప్పి కచ్చితంగా రావాలని ఆహ్వానించమని చెప్పి బస్ కూడా ఉంటుంది అని చెప్పి రావాలని చెప్పి కాల్ కట్ చెయ్యగా , వెంటనే అన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తుండగా కాల్ ఎత్తగా మేము వైజాగ్ “శాంతి “ఆశ్రమం నుండి కాల్ చేస్తున్నాము , ఎవరో తాగుడుకు బానిస అయిన వ్యక్తి ఉన్నారు అని అడుగగా , yes yes yes అని ఆత్రంగా అంటూ అడ్రస్ చెప్పగా 10 నిమిషాలలో ఇంటి దగ్గరికి రాగా ,వాళ్ళను కలిసి మొత్తం వివరించి మహికి ఫోన్ చేసి అత్తయ్యకు బయటకు రాకుండా చూసుకోమని చెప్పగా , అత్తయ్యను ఏదో పని ఉందని పైన ఉన్న రూమ్ లోకి పిలుచుకొని పోగా హమ్మయ్య అనుకోని వాళ్ళను మూలలో కూర్చొని తాగుడు వల్ల ఊగిపోతున్న మామయ్య దగ్గరికి పిలుచుకొని పోయి బయటకి ఎంత పిలిచినా రాకపోవడంతో నాతో పాటు వచ్చిన వ్యక్తి ఇలా కాదు అని తమ వాహనం లో నుండి ఒక మందు బాటిల్ తీసుకొని వచ్చి చూపించగా దానిని అందుకోవడానికి అన్నట్లు పైకి లేచి ముందుకు వస్తుండగా అతడు వెనుకకు వెల్తూ వాహనం లోనికి ఎక్కగా మామయ్య కూడా ఎక్కగా ఒక మత్తు ఇంజుక్షన్ వెయ్యగా మత్తుగా పడుకొని పోగా , సంతకం పెట్టమని పేపర్ చూపించగా పూర్తిగా చదివి జాగ్రత్త అని చెప్పి నోట్ల కట్టను ఇస్తుండగా , పైనున్న రూమ్ లోనుండి అత్తయ్య అదంతా చూస్తూ మహిని పిలిచి చూపించి చూడు మీ నాన్నను ఇంకా ఎక్కువ తాగుబోతు చేస్తున్నాడని మామయ్యను తిడుతుండగా అలా బావ ఎప్పటికి చెయ్యడు అమ్మ అని నమ్మకంగా చెబుతుంది.

కింద పూరీ కుర్మా అయ్యిందని చెప్పగా అమ్మ , అత్తయ్య మరియు మహి , చిన్నా బంధువులందరిని పిలిచి tiffen తినేటట్లు చేసి అందరూ తింటుండగా అమ్మ ఒక ప్లేట్ లో పూరీలను పెట్టుకొని వెళ్లి వర్షిని కి ప్రేమగా తినిపించసాగింది. మహి ఒక ప్లేట్ లో 10 పైన పూరీలను పెట్టుకొని మరొక ప్లేట్ దానిపైన ఉంచి నేను ఉన్న వ్Aసహనం దగ్గరికి తీసుకొని రాగా కృష్ణ అది చూసి tiffen చెయ్యడానికి ఇంటి దగ్గరికి వెళ్లగా బావ తిందువు గాని రమ్మని వాహన వెనుక ఎక్కగా , తనతో పాటు లోపలికి వెళ్లగా ఆ పూరీలను చూసి అమ్మో ఇన్ని తింటే అంతే ఇక అని నోరు తెరిచి చూస్తుండగా , పూరీని విరిచి కుర్మా తీసుకొని నోటిలోకి పెట్టగా తినసాగాను.

1 Comment

Comments are closed.