జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 9 62

మహి వచ్చి అమ్మ కాళ్ళు మొక్కి అత్తయ్య బావ అని అడుగగా ఏమి భయపడకు బావ మొత్తం సెట్ చేసాడు అని చెప్పి నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టగా , అత్తయ్య 5 నిమిషాలు టీ చేసుకొని వస్తాను అని వంటింట్లోకి వెళ్లగా కృష్ణ తల్లి కూడా సహాయం చెత్తానని తోడుగా వెల్లసాగింది , నా ముద్దుల చిన్న కోడలు ఎక్కడ అని పైకి వెళ్లగా వర్షిని ఇంకా పడుకొని ఉండటంతో అమ్మ పక్కనే కిర్చోని తలను నిమురుతూ ఉండగా వర్షిని లేచి అత్తయ్య అని కౌగిలించుకోగా ,నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి ఇంకా పడుకొంటే ఎలా నా ముద్దుల కోడలా పద స్నానం చేయిస్తానని బాత్రూం కు తీసుకొనివెళ్తుంది.

అత్తయ్య రెడి అయ్యి హాల్ లోకి రాగా అమ్మ ఎవరో నీకోసం రాగా ఇక్కడ అంతా గలాటాగా ఉండటంతో పైన మిద్దెమీదకు పంపించాను అని అత్తయ్యకు మేడ మీదకు తీసుకొని వెళ్లగా నా స్నేహితులు మొత్తం వివరించగా నమ్మనట్లుగా అనుమానంతో చూస్తుండగా చివర వెనుక ఉన్న అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ లో నుండి ఒక పేపర్ చూపించి ఇది చూసైనా నమ్మండి అని దూరం నుండి చూపిస్తుండగా మిగిలిన అందరూ వెనక్కు తిరిగి ఏదో రాసి ఉన్న పేపర్ ను వింతగా చూస్తుండగా అత్తయ్య చూడదానికన్నట్లు ముందుకు కదులుతుండగా మహి అందుకొని చిసి అవునమ్మ అని చెప్పగా అందరూ ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటారు. ఇష్టం లేకపోయినా కింద అంతా బంధువులు వచ్చి ఉండేసరికి ఏమి చెయ్యాలో తోచక ఒప్పుకొంటుంది. అందరూ కిందకు వచ్చి నాకు కాల్ చెయ్యగా వెనుక ఆటో దగ్గరికి వెళ్లి త్వరగా అంతా రెడి చేసి tiffen తయారు చెయ్యండి అని లోపలికి పంపించగా అన్ని దించుకొని ఎవరి పనులు వాళ్ళు చెయ్యసాగారు. ఆటో నా దగ్గరికి రాగా డబ్బులు ఇచ్చి పంపించివేశాను.

లోపల అమ్మ వర్షిని కి తలంటు పోసి శుభ్రన్గా స్నానం చేయించి నిన్న తన కొడుకు తెచ్చిన కొత్త బట్టలను తొడిగి ఇంటి నుండి తెచ్చిన 7 వారాల నగలలో కొన్నింటిని నుదుటి పై భుట్టో గొలుసు , ముక్కు పడక, చెవులలో పెద్ద రింగులు, మెడలో కొన్ని సరాలు, నడుముపై సన్నటి వడ్డానము , చేతులకు గాజులు మరియు కాళ్లకు పట్టీలు అలా అన్ని అలంకరించి అద్దం లో తన కోడలిని తనకే చూపించగా ఒంటిపై ఉన్న బంగారు నగలు ధగధగా లాగుతుంటే సంతోషం పట్టలేక అమ్మను గట్టిగా కౌగిలించుకొనగా ఇవన్నీ మీ మావయ్య నీకోసమే తెచ్చాడు , ఇవి కొన్ని మాత్రమే సాయంత్రం బంగారు నగలతోనే మునిగిపోదువు అని తలపై నిమురుతూ నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి నా దిష్టి తగిలేలా ఉంది నా బంగారానికి అని కళ్లకున్న కాటుకను చెంపపై మరియు కాళ్ళ కింద పెట్టి నెమ్మదిగా కిందకు పిలుచుకొని వస్తుండగా అత్తయ్య ముందు నన్ను మావయ్యే చూడాలి అని చెప్పగా , అయ్యో మామయ్య ఇక్కడ లేదుగా అని చెప్పగా లేడా అయితే నేను కిందకు అస్సలు రాను అని బెడ్ పై కూర్చొని అలిగినట్లు ముఖం పెట్టగా , ఇప్పుడెలా అని ఆలోచించగా హ్యాండ్ బ్యాగ్ లోనుండి మొబైల్ తీసి నాకు వీడియో కాల్ చెయ్యగా ఎత్తి అమ్మ అని ముఖం చూసి మాట్లాడుతుండగా , వర్శినిని నువ్వు చెప్పినట్లుగానే నగలతో అలంకరించాను , తను ముందు నీకే చూపించాలని బుంగమూతి పెట్టుకొని కూర్చుంది అని కెమెరా తన వైపు తిప్పి పైనుండి కింద వరకు చూపించి వర్షిని ఫోన్ ఇవ్వగా , వర్షిని చాలా అందంగా ఉన్నావు నా దిష్టి తగిలేటట్లుగా ఉంది అని డైరెక్ట్ గా చూసుకోలేకపోతున్నందుకు బాధతో కళ్ళల్లో నీళ్ళు రాగా అది చూసి వర్షిని కళ్ళల్లో నీళ్లు వస్తూ మామయ్య ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ మామయ్య ఇప్పుడే నువ్వు నా దగ్గరికి రావాలి అని చెప్పగా , ఏడుపు కాదు నా బంగారు కొండ ఆనంద భాస్ఫాలు అని చెప్పి నుదుటిపై ముద్దు పెట్టినట్లు పెట్టి కాల్ కట్ చేస్తాడు.

1 Comment

Comments are closed.