జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 9 62

నువ్వు కూడా తిను మహి అని చెప్పగా నువ్వు తిన్నాక తింటానులే బావ అని ప్రేమగా తినిపిస్తుండగా , మీ నాన్న ఒక 6 నెలలలో మందు , జూదం పై విరక్తితో ఆరోగ్యమైన మనిషిగా తిరిగి వస్తాడని చెప్పి , ఆ ఆశ్రమం గిరించి మొత్తం వివరించగా ప్లేట్ ను పక్కకు తోసి కన్నీళ్లు కారుస్తూ నన్ను గట్టిగా కౌగిలించుకొని మా సంతోషం కోసం ఎంత కష్టపడుతున్నావు బావ అని ఏడుస్తుండగా తన ముఖాన్ని రెండు చేతులతో నా ముఖం ముందు ఉంచుకొని నుదుటిపై ప్రేమగా ముద్దుపెడుతూ అత్తయ్య, నువ్వు, వర్షిని మరియు చిన్న అంటే నాకు ప్రాణం , మీకు ఏ చిన్న హాని కలిగినా ఈ గుండె అసలు తట్టుకోలేదు అని చెప్పగా నా నుదుటిపై ఎనలేని ప్రేమతో ముద్దులు పెడుతుండగా మహి ఆకలి వేస్తోంది అని దీనంగా చెప్పగా , క్షమించు బావ అని ఆత్రంగా కళ్ళల్లో నీళ్ళు తుడుచుకుని పూరీలను ప్రేమగా నోటిలోకి పెట్టసాగింది.

మొత్తం పూరీలను తినగా ఇంకా నోరు తెరుస్తుండగా బావ అయిపోయాయి ఉండు ఒక్క నిమిషం లో తీసుకొని వస్తాను అని చెప్పగా కడుపు పూర్తిగా నిండింది ,ఒక పక్క మాత్రమే ఖాళీగా ఉంది అని మహి నుదుటిపై గట్టిగా ముద్దు పెట్టి అది కూడా నిండిపోయింది అని నవ్వుతూ చెప్పగా పో బావ అని గుండెలపై చిన్నగా కొట్టసాగింది.

అమ్మ , అత్తయ్య మరియు నువ్వు తిన్న తరువాత చుట్టుపక్కల మీకు ఎహెలిసిన వారినందరిని మా స్నేహాతులను తోడుగా పిలుచుకొని వెళ్లి ఫంక్షన్ కు పిలవమని చెప్పి , వర్షిని ఫ్రెండ్స్ ఇళ్లల్లో కచ్చితంగా పిలవమని పంపగా , అమ్మ నుండి కాల్ రాగా కన్నా వర్శినిని ఫంక్షన్ లో కూర్చోబెట్టడానికి మంచి రెండు పట్టు చీరలు కావాలి అని చెబుతూ నీకు నచ్చినవే వర్షిని కట్టుకుంటుంది అంట అని చెప్పగా , నాకు చీరాల గురించి తెలియదు కాని తన కోసం తెలుసుకొని తీసుకొని వస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి , కృష్ణ కు కాల్ చేసి దొబ్బి తినింది చాలు రాబే పని ఉంది అని పిలువగా ఒక్క నిమిషం మామ అని చివరి పూరీని నోటిలోకి కుక్కుకొని ఒక గ్లాస్ లో నీళ్లు తీసుకొని నములుతూ వాహనం దగ్గరికి వచ్చి నీళ్లు తాగగా నిన్న చీరలు ఆర్డర్ ఇచ్చిన షోరూం కి వెల్లసాగాము.

1 Comment

Comments are closed.