జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 9 62

ఇక్కడ మహేష్ కు నిద్ర మత్తు ఎగిరిపోగా కళ్ళు తుడుచుకుని పైకి లేచి టవల్ అందుకొని బాత్రూం కు వెళ్లబోతుండగా అమ్మ నుండి కాల్ వస్తుండగా తీసుకొని ఎత్తగా కన్నా ఇంకో అర గంటలో నా స్నేహితురాలు, నీ స్నేహితులు, అత్తయ్య స్నేహితులు మరియు మన బంధువులతో అక్కడికి చేరుకుంటాము అని చెప్పగా , చాలా మంచి పని చేశావమ్మా అని లవ్ యు అమ్మ అని, నిన్న రాత్రి జరిగినదంతా చెప్పి నేను ఇంటికి రావడం కుదరదు కానీ మొత్తం చూసుకుంటానులే అని చెప్పగా అమ్మ బాధపడుతున్నట్లు మౌనంగా ఉండగా అమ్మ ఇప్పటికి అత్తయ్య అంటే నాకు ఇష్టమే అని చెప్పి , నువ్వు నా గురించి భాధపడకుండా అత్తయ్య దగ్గర సంతోషంగా ఉండి ఫంక్షన్ బాగా జరిపించు అని చెప్పి ధైర్యం చెబుతాడు .

వెంటనే కృష్ణ కు కాల్ చేసి బస్ ను డైరెక్ట్ గా రెసిడెన్సీ దగ్గరకు తీసుకొని రమ్మని మన స్నేహితులను ఇక్కడే దింపి మిగతావాళ్ళందరిని ఇంటి దగ్గరకు తీసుకొని వెళ్లేలా ప్లాన్ వివరించి వాళ్ళు వచ్చేలోపు స్నానం చేసి అవే బట్టలు వేసుకొని కిందకు వచ్చి మరో 10 రూమ్ లు బుక్ చేసి తాళాలు తీసుకొని అక్కడే హోటల్ లో టీ తాగుతుండగా బస్ శబ్దం వినిపించగా డబ్బు ఇచ్చి బయటకు వెళ్లగా తన ముందు బస్ ఆగగా లోపలికి వెళ్ళి ప్లాన్ మొత్తం అమ్మకు వివరించి కొద్దిసేపటి తరువాత అత్తయ్య ఇంటికి వస్తాను అని చెబుతుండగా కృష్ణ తో పాటు నా స్నేహితులంతా 8 మంది కిందకు దిగగా బస్ ను అత్తయ్య ఇంటికి పంపించి వెనుకకు తిరగగా అందరూ జీన్స్ మరియు టీ షర్ట్ లి వేసుకొని ఉండగా అందరికి hi చెప్పి మీరేమైన ఫాషన్ షో కి వచ్చారా అని జోక్ వెయ్యగా ఒక్క అర గంట సమయం ఇచ్చి చూడు అని చెప్పగా రూమ్ కీస్ ఇచ్చి త్వరగా రెడి అవ్వండి అని చెప్పగా తమ తమ బ్యాగులు అందుకొని రెసిడెన్సీ లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వసాగారు.

కృష్ణ తో పాటు వాహనంలో ఫంక్షన్ హాల్ కు చేరుకొని క్యాటరింగ్ వాళ్ళను కలిసి ఇంటి దగ్గర బంధువులు చాలా మంది దిగడం వల్ల వాళ్లకు tiffen మరియు భోజనాలు తయారు చేయడానికి వంట వాళ్ళను మరియు వంట సామానులను , కొన్ని కుర్చీలను మరియు షామియానా లను మరియు ఇంటిని లైట్స్ తో అలంకరించేందుకు సమ్మానులతోపాటు మనుషులను ఒక లగేజీ ఆటో లో ఎక్కించి మమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పి రెసిడెన్సీ కి చేరుకొని లోపల ఉన్నవాళ్లకు కాల్ చేసి బయట వేచి చూస్తున్నామని చెప్పగా 5 నిమిషాల తరువాత ఇద్దరిద్దరు పక్కపక్కనే పట్టు చీరలు కట్టుకొని నడుచుకొని వస్తుండగా వాళ్ళను చూడటానికి రెండు కాళ్ళు చాలడం లేదు.

నేను కృష్ణ వాళ్ళను మా నోళ్లు తెరుచుకొని చూస్తూ జోళ్ళు కారుస్తున్నట్లు కదలకుండా నిలబడిపోగా అందరూ మా ముందుకు వచ్చి భుజాలను కదిలించగా కరెంట్ షాక్ కొట్టినట్లు కదిలి మూతిని తుడుచుకొంటుండగా అందరూ మమ్మల్ని చూసి పగలబడి నవ్వుతూ ఇప్పుడు చెప్పమ్మా ఎలా ఉన్నామో అని వయ్యారంగా అడుగగా వాళ్ళను చూస్తూ ముఖం వెలిగిపోతూ అమితమైన సంతోషంతో నోటిలో నుండి మాటలు కష్ఠంగా వస్తుండగా మూసివేసి చేతితో వేళ్ళను సున్నాలా చుడుతూ సూపర్ అని చూపిస్తాడు.

1 Comment

Comments are closed.