జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 9 61

ఇక్కడ అందరూ tiffen మరియు టీ తాగిన తరువాత మధ్యాహ్నం వంట చెయ్యడానికి సరుకులు బయటకు తీస్తుండగా బంధువులంతా విశ్రాంతి తీసుకుంటుండగా అమ్మ , అంటీ , మహి మరియు అత్తయ్య ,నా ఫ్రెండ్స్ ను తోడు తీసుకొని నాలుగు వైపులా ఒక్కొక్క ఇంటికే వెళ్లి వాళ్ళను ఆహ్వానిస్తూ వెల్లసాగారు.

నేను కృష్ణ షోరూం చేరుకొనగా manager ఎదురుగా వచ్చి మీరు చెప్పినట్లే అన్ని బయటకు కలర్ కనబడేటట్లు ట్రాన్స్పరెంట్ కవర్లు లో పెట్టి రెడీగా ఉన్నాయని చెప్పగా , అలాగే ఇంకో రెండు పట్టు చీరలు ఎలా ఉండాలంటే చూడగానే అద్భుతం అనాలి, ఎంత రేట్ అయినా పర్లేదు అని చెప్పగా స్వయంగా అతడే దగ్గరుండి కొత్తగా వచ్చిన ఖరీదైన పట్టు చీరలను చూపించగా అర గంటసేపు అన్ని చూసి ఎరుపు మరియు నీలం రంగు వాటిపై అద్భుతంగా డిసైన్ ఉండటంతో వాటిని ప్యాక్ చెయ్యమని వాటికి కావలసిన జాకెట్ లంగా వయసు చెప్పగా ఆల్టరషన్ చేసి ఇచ్చి , నాకు కృష్ణ కు కొత్త బట్టలు తీసుకొని, మొత్తం బిల్ వెయ్యమనగా బిల్ చూసి ఏమాత్రం ఆలోచించకుండా స్వైప్ చెయ్యగా , manager వచ్చి ఎక్కడ డెలివరీ చెయ్యాలి అని అడుగగా , ఇప్పుడు తీసుకొన్న చీరలను నా చేతిలోకి తీసుకొని, ఫంక్షన్ హాల్ పేరు చెప్పగా అన్నింటిని షోరూం వాహనంలో ఒక 5 మంది సర్ధేశి వాళ్ళు కూడా ఎక్కి తమ వాహనం వెంట ఫాలో అవ్వసాగారు.

ఫంక్షన్ హాల్ కు చేరుకోగా అప్పటికే అలంకరణ పనులు చక చక ఒక వైపు పూలతో , స్టేజి మీద సగం పూర్తి అవుతుండగా అదే చూడటానికి అద్భుతంగా ఉండగా వారి పనిని గౌరవిస్తూ కొనసాగించండి అని చెప్పి, ప్రవేశ ద్వారం లో ఉన్న రూమ్ తలుపు తెరిపించి అందులో చేరాలని పెట్టెయ్యమని చెప్పగా వాళ్ళు పెడుతుండగా, లోపలికి వెళ్లగా కేటరింగ్ వాళ్ళు అన్ని రెడి చేసుకొని ఉండటంతో అన్ని సక్రమంగా జరుగుతున్నాయి అని సంతోషిస్తూ బయటకు రాగా అన్ని లోపల పెట్టేసి వెళ్లిపోతుండగా వారి దగ్గరికి వెళ్లి డబ్బు ఇవ్వగా థాంక్స్ చెప్పి వెళ్లిపోయారు.

1 Comment

Comments are closed.