జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 9 62

ఫంక్షన్ కు వచ్చిన వాళ్ళందరూ సంతృప్తితో ఇంటికి వెల్లసాగారు. చివరి పంక్తి 10 గంటల వరకు జరుగగా ఇంటికి వచ్చిన బంధువులకు చీరలు ఇవ్వగా అందరికి సరిపోగా మరియు ఇంటి తాళాలు ఇచ్చి బస్ లో ఇంటికి పంపించగా ఇక చివరగా నా ఫ్రెండ్స్ , అత్తయ్య కుటుంబం మరియు అమ్మ , అంటీ , కృష్ణ మిగలగా , అమ్మ వర్శినిని పిలుచుకొని భోజనశాలకు రాగా ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటూ అన్ని వంటకాలను ఆరగించి , వచ్చిన గిఫ్ట్స్ లను మరియు తాము తెచ్చిన వస్తువులను అక్కడి పనివాళ్ళ సహాయంతో బస్ లో పెట్టి నేను కృష్ణ మా వాహనంలో మిగతావారంతా బస్ లో ఇంటికి చేరుకుని , బస్ లో ఉన్నవన్నీ కిందకు అందించగా మిగిలిన వారందరు లోపల పెట్టగా అందరూ అలసిపోయి ఉండటంతో మా ఫ్రెండ్స్ తప్ప అందరూ లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోగా , బస్ ను ఇంటి పక్కనే పెట్టించి ఉదయం వైజాగ్ కు భయలుదేరాడానికి సిద్ధంగా ఉండమని చెప్పి మా వాహనం లో హోటల్ కు చేరుకోగా అందరూ అలసిపోయి ఉండటం వల్ల ఎవరు ఇష్టప్రకారం వాళ్ళు రూమ్ లలోకి వెళ్లి పడుకుండిపోతారు.

అమ్మకు ఒక సారి కాల్ చేసి అక్కడ అంతా ok కదా అని అడుగగా , ఫంక్షన్ అద్భుతంగా జరిగినందున అత్తయ్య చాలా సంతోషంగా ఉంది, వర్షిని అయితే ఆనందంలో ఏమేమో మాట్లాడుతూ పడుకుండిపోయింది , అందరూ ఎక్కడికక్కడే పడుకొని పోయారు. మీకు , అంటీ కి పడుకోవడానికి ఉందా అని అడుగగా , ఫంక్షన్ కి వచ్చేటప్పుడు మిగిలిన బంగారు నగలను మహి రూమ్ లో పెట్టి తాళం వేసినందువల్ల ఆ రూమ్ లో ఎవరు పోలేదు కావున మా నలుగురూ సులభంగా పడుకోవచ్చు అని చెప్పగా లవ్ యు అమ్మ అని చెప్పి నేను కృష్ణ ఒక రూమ్ లో పుడుకుండిపోయాము.

ఉదయం 7 గంటలకళ్ల హోటల్ లో లేచి రెడి అయ్యి బయటకు వస్తుండగా అమ్మ కాల్ చేసి అప్పుడే వైజాగ్ వెళ్ళేవాళ్ళందరు , అత్తయ్య ఫ్రెండ్స్, అంటీ అందరూ వెళ్ళడానికి రెడి గా ఉండటంతో బస్ ను మెయిన్ రోడ్ దగ్గరకు పంపించమనగా వెల్లతప్పటికి మా కోసం వేచి చూస్తుండటంతో నా ఫ్రెండ్స్ బస్ ఎక్కుతూ మరి మా ట్రీట్ అని అడుగగా రేపు వైజాగ్ వస్తాను మీరు ఏది అడిగితే అది అని చెప్పి మీరు చేసిన సహాయాన్ని జీవితాంతం మరిచిపోను అని చెప్పగా ఆనందంగా నవ్వుతూ ఎక్కగా బస్ కు డబ్బులను కృష్ణ కు ఇవ్వగా రేపు కలుద్దాము రా మామా అని చెప్పి బస్ ఎక్కగా భయలుదేరుతుంది. ఇంటికి వచ్చిన బంధువులు కూడా ఒక్కొక్కరుగా సంతోషంగా భయలుదేరసాగారు.

1 Comment

Comments are closed.