జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 9 62

పోలీస్ జీప్ వెనుక ఇద్దరు ఎక్కి లోపలికి వెళ్ళి కూర్చోగా మహి నా చేతి చుట్టూ తన రెండు చేతులను వేసి దగ్గరగా అతుక్కుని నన్నే ఆరాధనగా ఏదో కొత్త వ్యక్తిని, తన అభిమాన హీరో ని ఎలా చూస్తారో అలా చూస్తూ ఉండగా , ఏదోలా అనిపించి తన ముఖాన్ని ముందుకు తిప్పగా గట్టిగా చేతిని పట్టుకొని మళ్ళీ అలాగే చూస్తూ ఉండగా , మొబైల్ తీసి విక్రమ్ సర్ కి కాల్ చేసి మొత్తం చెప్పి తరువాత కాల్ చేస్తాను అని చెబుతుండగా, వాహనం దగ్గరికి రాగా నా చేతిని వదలకుండా ఉండటంతో అలాగే అతుక్కుని దిగి థాంక్స్ సర్ అని చెప్పి నవ్వుతుండగా బావ నువ్వు నవ్వుతుంటే నా హృదయం ఆనందంతో పొంగిపోతోంది బావ నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి బావ అని నా చేతిని ఇంకా గట్టిగా పట్టుకొని వాహనం వరకు నడవసాగింది.

వాహనం డోర్ తెరిచి మహిని ఎక్కమని సమయం చూడగా 12 దాటుతుండగా నేను అటువైపు వచ్చి ఎక్కగా నా పక్కకు వచ్చి గట్టిగా ఒక పక్కకు హత్తుకొని బావ నువ్వు గోవా కూడా వెళ్ళావ , నాకు కూడా వెళ్లాలని ఆశగా ఉంది బావ అని తన తలని నా భుజం పై వాల్చగా ప్రేమగా తన తలను నిమరుతూ నీకు ఎప్పుడు వీలు కుదురుతుందో చెప్పు అప్పుడు వెళదాము , మనకు అక్కడ చాలా మంది బంధువులు ఉన్నానులే అని చెప్పగా సంతోషంతో గట్టిగా భుజం పై ముద్దు పెట్టి, బావ ఉదయం నుండి ఏమి తినలేదు ఆకలిగా ఉంది అని చెప్పగా ,ఇప్పటికైనా నోరు తెరిచి ఆడిగావు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని మహి చెంపలపై రెండు చేతులు వేసి సున్నితంగా పట్టుకొని ఏ చిన్న సమస్య ఉన్నా నాకు ఇలాగే చెప్పాలి అని ప్రేమగా నుదుటిపై ముద్దు పెట్టి , నువ్వే చెప్పు ఈ ఊరిలో ఏది మంచి హోటల్ అని అడుగగా , నువ్వు ఇప్పుడు స్టే చేస్తున్న హోటల్ లో ఫుడ్ బాగుంటుందని మా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు అని చెప్పగా అయితే అక్కడికే వెళదాము అని అమ్మకు ఫోన్ తిన్నావా అని అడుగగా , బంధువులు అంతా tiffen చేసి వెళ్లిపోయారు , ఇల్లు మొత్తం శుభ్రం చేసాము ఇప్పుడు వండుకోవాలి అని చెప్పగా, పని చేసి అలసిపోయి ఉంటారు ఏమి వండుకోవద్దు వొంటి గంట లోపు హోటల్ నుండి పంపిస్తాను అని చెప్పి , హోటల్ కు వెళ్లగా మెనూ ఇవ్వగా తనకు ఏవేవి కావాలో కుమ్మేద్దాము ఇద్దరికి ఆర్డర్ చెయ్యమనగా మొత్తం ఒకసారి చూసి తనకు ఇష్టమైనవి వెజ్ మరియు నాన్ వెజ్ చాలా చెప్పగా , ఇద్దరు మాట్లాడుకుంటుండగా 15 నిమిషాలలో రాగా ఆకలిగా ఉండటం వల్ల సిగ్గులేకుండా ఎవ్వరిని పట్టించుకోకుండా తినసాగాము .

తనకు ఇంకా ఆకలి తీరకపోవడంతో మరొక ప్లేట్ ఆర్డర్ చెయ్యగా దానితోపాటు ఇంటిలో ఉన్న నలుగురికి కుండ బిరియాని, చిల్లి చికెన్, చికెన్ కబాబ్, మంచురియా , పరోటాలు, ……… వెజ్ లో కొన్ని ఐటమ్స్ అన్ని రెండు రెండు పార్సెల్ చెయ్యమని చెప్పగా మహి తినేలోపు మొత్తం పార్సెల్ చేసి కవర్లలో కౌంటర్ దగ్గరికి తీసుకొని రాగా మొత్తం బిల్ పే చేసేసి అన్ని వాహనం వెనుక పెట్టి మహిని లోపల కూర్చోబెట్టి రెసిడెన్సీ లోపలికి వెళ్ళి నా బ్యాగ్ తీసుకొని వచ్చి రూమ్స్ అమౌంట్ పే చేసి ఇంటికి వెల్లసాగాము.

1 Comment

Comments are closed.