జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 9 62

ఇంటి దగ్గరికి వచ్చి అమ్మకు కాల్ చెయ్యగా అమ్మ మరియు చిన్న బయటకు రాగా ఫుడ్ మొత్తం ముగ్గురు లోపలికి తీసుకొని వెళ్లగా , అత్తయ్య మరియు పిల్లల సేఫ్టీ గుర్తుకు రాగా , విశ్వ సర్ నెంబర్ కు కాల్ చెయ్యగా నా నెంబర్ ఫీడ్ చేసుకున్నట్లు చెప్పు మహేష్ అని మాట్లాడగా , అత్తయ్య ఇంటి అడ్రస్ చెప్పి 24 గంటలు కాపు కాచేలా ఒక ప్రైవేట్ సెక్యురిటి ని పెడదామనుకుంటున్నాను మీ సలహా కావాలి అని అడుగగా , స్యూర్ మహేష్ ఏవైనా రాజకీయ మీటింగ్స్ జరిగినప్పుడు మా పోలీస్ లు తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళను నియమిస్తుంటాము , వాళ్ళ అడ్రస్ చెబుతాను అక్కడికి వెళ్లి ఫోన్ చెయ్యమనగా అలాగే సర్ అని చెబుతుండగా మహేష్ చెప్పడం మరిచిపోయాను ఈ నా కొడుకుల మనుషులు ఇంటి పత్రాలు తెచ్చి ఇచ్చారు , కానిస్టేబుల్ తో ఇచ్చి పంపిస్తాను అని చెప్పగా thank you so much సర్ అని కాల్ కట్ చేసి ఆ అడ్రస్ కి వెళ్లగా , విషయం చెబుతుండగా , విశ్వ సర్ మొత్తం చెప్పారు 8 గంటలకు ఒకరు చొప్పున ముగ్గురు సెక్యురిటి ఉంటారు , నెలకు అమౌంట్ చెప్పగా 3 నెలల అడ్వాన్స్ ముందే ఇచ్చి వారి అకౌంట్ నెంబర్ తీసుకొనగా ఒక పేపర్ ఇవ్వగా , అడ్రస్ రాసి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పంపించమని చెప్పి , సర్ కు కాల్ చేసి థాంక్స్ చెప్పి అత్తయ్య ఇంటి దగ్గరికి వెల్లసాగాను.

అమ్మకు కాల్ చేసి అమ్మ రేపు చాలా పని ఉంది సాయంత్రం 6 గంటలకు వైజాగ్ వెళదామని చెప్పగా సరే కన్నా నీ ఇష్టం అని చెప్పి కాల్ కట్ చేసి వాహనాన్ని ఇంటి పక్కనే పెట్టి అద్దాలు మరియు అన్ని డోర్ లు వేసి AC వేసుకొని వాహనం వెనుక ఉన్న బెడ్ పై 5 గంటలకు అలారం పెట్టి పడుకొనగా వెంటనే నిద్ర పెట్టెయ్యగా , కొద్దిసేపటి తరువాత లోపల చలి ఎక్కువ అవ్వగా ముడుచుకొనగా నా తలను ఎత్తి దిండు మీద పెట్టి వెంట్రుకలతో వేళ్ళను దూర్చి నిమురుతూ మరొక చేతితో వీపుపై నెమ్మదిగా తడుతుండగా వెచ్చగా అనిపించి రెండు చేతులతో దిండును అనుకొని దేనినో గట్టిగా తన తలకు అదుముకుంటూ ప్రశాంతంగా నిద్రపోసాగాను.

దాదాపు 2 గంటల దాకా నిద్రపోయినా కూడా 10 నిమిషాల్లో అలారం మోగినట్లు అనిపిస్తుండగా వెంటనే శబ్దం ఆగిపోగా ఎలా ఆగింది అని కళ్ళుతెరువగా మహి కనబడగా తన తొడను గట్టిగా పట్టుకొని ఉండగా , తను ప్రేమగా నిమురుతూ నుదుటిపై ఆరాధనగా ముద్దు పెట్టి hi బావ అని నవ్వుతూ ఆనందంగా పలకరించగా , ఆ నవ్వుతున్న మహి ముఖాన్ని సంతోషంతో నిద్రకళ్ళతో అలాగే చూస్తూ ఉండిపోగా , వొంగి వొంగి నా నుదుటిపై ముద్దుల వర్షం కురిపిస్తుండగా తేరుకొని మహి ఎప్పుడు వచ్చావు అని ప్రేమగా అడుగగా , నీకోసం వాహనం దగ్గరికి రాగా నువ్వు చలి వల్ల నిద్రలో ముడుచుకుని పోతున్నప్పుడు బావ అని గట్టిగా నవ్వగా, ఆ నవ్వుతో హృదయం సంతోషంతో నిండిపోగా రెండు చేతులతో మహి తలను సున్నితంగా పట్టుకొని దగ్గరకు తీసుకొని ప్రేమగా నుదుటిపై ముద్దు పెట్టగా మహి కళ్ళల్లో ఒక మెరుపు కనబడుతుండగా అలాగే తన కళ్ళను చూస్తూ ఉండిపోయాను.

1 Comment

Comments are closed.