జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 9 62

అన్ని సక్రమంగా జరిగాయి , ఇక మిగిలిందల్లా నా కోపాన్ని చల్లార్చుకోవడం ఒక్కటే అని పళ్ళు కట కట కొరుకుతూ, అమ్మకు కాల్ చేసి అమ్మ కొద్దిగా పని ఉంది సాయంత్రం వైజాగ్ వెళదాము అని చెప్పి మహికి ఫోన్ ఇవ్వమనగా అమ్మ ఇవ్వగా రోడ్ దగ్గరకు రమ్మనగా , వరుసగా ATM లకు వెళ్లి ఒక 10 లక్షలు డబ్బులు డ్రా చేసుకొని ముందుగా ఫంక్షన్ హాల్ కు వెళ్లి అన్నింటికీ డబ్బు ఇచ్చేసి , మహి ఇప్పుడు చెప్పు ఇంటికి వచ్చి గొడవ చేసిన వాళ్ళు ఎక్కడ ఉంటారో అని కోపంగా అడుగగా , బావ వాళ్ళ వెనుక పోలీస్ లు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పగా , ముందు వాళ్ళు ఎక్కడ ఉంటారో చెప్పమని ఇంకా కోపంగా అడుగగా దారి చూపిస్తుండగా 15 నిమిషాలలో వాళ్ళ ఆఫీస్ దగ్గరికి చేరుకోగా , మహిని వాహనం లోనే ఉండమని చెప్పి లోపలికి వెళ్ళి చూడగా ఇద్దరు మాత్రమే ఉండటంతో మామయ్య పెరు చెప్పి ఎంత భాకి ఉన్నాడు అని అడుగగా , 2 లక్షలు అప్పు దానికి వడ్డీ 50 వేలు అని చెప్పగా , నా కొడకల్లారా అని ఇద్దరికి కొన్ని దెబ్బలు కొట్టి , కేవలం 250000/- కి ఇంటినే కొట్టేయాలని అనుకుంటారురా అని ఇంకో రెద్దు దెబ్బలు వేసి పక్కనే ఉన్న కుర్చీలో కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చోగా కింద పడిన వాడు లేచి కిందనే కూర్చొని అందరికి కాల్ చేసి రమ్మనగా , ఒక 20 నిమిషాల తరువాత వాళ్ళు రాకపోగా పోలీస్ జీప్ వచ్చి నన్ను మాత్రమే పోలీస్ స్టేషన్ కు వాళ్ళ జీప్ లో తీసుకొనిపోగా , అది చూసిన మహి భయపడి తన ఇంటి దగ్గరలో ఉన్న వార్డ్ కౌన్సిలర్ ను పిలుచుకొని వద్దామని ఆటో లో వాళ్ళ ఇంటికి వెళుతుంది.

నన్ను పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళ్లగా అక్కడ ఇద్దరు కానిస్టేబుల్ మాత్రమే ఉండగా నన్ను లోపలికి తీసుకుని వెళ్లి సెల్ లోకి వెయ్యగా , వెంటనే విక్రమ్ సర్ కి ఫోన్ చేసి వైజాగ్ పక్కనే ఉన్న అనకాపల్లిలో నన్ను సెల్ లో ఉంచారని చెప్పగా , పూర్తిగా వినకుండానే కట్ చెయ్యగా మళ్ళీ కాల్ చేస్తుంటే బిజీ అని వస్తుండటంతో ఒక కానిస్టేబుల్ వచ్చి నా చేతిలో నుండి ఫోన్ లాక్కొని స్విచ్ ఆఫ్ చేసేస్తాడు.

ఒక కానిస్టేబుల్ పక్కకు వెళ్లి ఎవరికో కాల్ చెయ్యగా ఒక గంట తరువాత కొంతమంది లోపలికి నా దగ్గరికి వచ్చి మా మనుషులనే కొడతావా నిన్ను సావగొట్టి జైల్ లోనే ఉండేటట్లు చేసి నువ్వు ఎవరి కోసమైతే మా వాళ్ళను కొట్టావో వాళ్ళను నామారుపాల్లేకుండా చేస్తాను అని భేదిరిస్తుండగా ఒక్క సారి ఈ సెల్ తెరవండ్రా ఎవరు ఎవరిని నామరూపాల్లేకుండా చేస్తారో తెలుస్తుంది అని మాటకు మాట ఎదురు చెప్పగా , ఇంత లేవు నాకే ఎదురు చెప్తావా రా అని తన జేబులో ఉన్న గన్ నావైపు పెట్టగా , బయట పోలీస్ హార్న్ శబ్దంతో కొన్ని వాహనాలు లాగినట్లు వినపడి పోలీస్ డ్రెస్ వేసుకొని చాలా మంది లోపలికి రాగా లోపల ఉన్న కానిస్టేబుల్ అందరూ సెల్యూట్ లు పెడుతుండగా సరాసరి నా దగ్గరికి వచ్చి మహేష్ అని అడుగగా , నేనే సర్ అని చెప్పగా కోపంగా కానిస్టేబుల్ వంక చూడగా ఒకడు భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి సెల్ ఓపెన్ చెయ్యగా నా దగ్గరికి వచ్చి నా ఒంటి మీద దెబ్బలు ఏవైనా పడ్డాయేమోనని చూసి , నా పేరు విశ్వ IPS నేను విక్రమ్ ఒకే బ్యాచ్ అని చెయ్యి ఇస్తూ నీకు ఒక్క దెబ్బ తగిలి ఉన్నా వాడు నన్ను చంపేసేవాడు thank god అని ఈ నాకొడుకులు ఎలాగో తొందర పడకుండా భతికిపోయారు అని సంతోషంగా కౌగిలించుకోగా , 1000 ఏనుగుల బలం వచ్చినట్లుగా నవ్వుతూ ఇద్దరు ఫోన్ తీసుకొని స్విచ్ on చెయ్యగా చాలా కాల్స్ విక్రమ్ నుండి మరియు మహి నుండి వచ్చి ఉండగా వెంటనే విక్రమ్ సర్ నుండి కాల్ రాగా ఎత్తగా , నువ్వు ఫోన్ ఎత్తావంటే మా వాడు సరైన సమయానికే దిగాడన్నమాట ఇంకా అనకాపల్లి మొత్తం నీవు ఎలా చెప్తే అలా పని అయ్యాక కాల్ చెయ్యమని చెప్పి కట్ చేస్తాడు.

1 Comment

Comments are closed.