జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 9 62

సమయం అవుతోందని లేచి కూర్చోగా బావ ఉండు టీ తెస్తాను అని వెళుతుండగా చెయ్యి పట్టుకొని ఆపి వొంగి స్టీరింగ్ పక్కనే ఉన్న కవర్ ను ఇవ్వగా లోపల చూడగా బావ ఇంత డబ్బా మాకెందుకు బావ నువ్వుండగా అని అంటుండగా అత్తయ్యకు నేనిచ్చానని చెప్పకుండా అవసరానికి ఉంచమని చెప్పగా 10 నిమిషాలలో ఒక బాటిల్ లో నీళ్లు మరియు టీ తీసుకొని రాగా , నీళ్లతో ముఖం కడుక్కొని టీ తాగుతుండగా సెక్యురిటి జీప్ వచ్చి మా పక్కనే ఆగి అందులో నుండి యూనిఫామ్ వేసుకున్న ఒక వ్యక్తి మరియు బైక్ లో ఒక కానిస్టేబుల్ వచ్చి ఇంటి పత్రాలు ఇచ్చి వెళ్లిపోసాగాడు.

సెక్యురిటి వ్యక్తి నా దగ్గరకు రాగా ఇంటిని చూపించి జాగ్రత్తగా చూసుకోండి గౌరవంగా చెప్పగా , మీరు విశ్వ సర్ స్నేహితులు , మాకు సర్ అంటే చాలా అభిమానం , సర్ అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తాను అని మరి మరి చెప్పారు. మీరు ఏమి భయపడే పనే లేదు చీమ కూడా మాకు తెలియకుండా లోపలికి వెళ్ళలేదు అని హామీ ఇవ్వగా , అతడికి కొంత డబ్బు ఇచ్చి రెపటిలోపు కాంపౌండ్ పక్కనే ఒక రేకుల షెడ్ ఏర్పాటు చేసుకోండి అని చెప్పగా అప్పటికే సూర్యుడు హస్తమిస్తుండటంతో వెళ్లి గోడపై కూర్చుంటాడు.

బావ ఎవరు అతను అని అడుగగా రేపు ఊరిలో పని ఉంది నేను అమ్మ వెళ్తున్నాము అని ఇంటి పత్రాలు ఇచ్చి దాచి పెట్టు అని చెబుతూ , అందుకే సెక్యురిటి ఏర్పాటు చేసాను అని చెప్పగా , నేను వెళ్తున్నానని తెలిసి బాధతో కళ్ళల్లో నీళ్ళు తిరగగా తన చేతిని అందుకొని , నువ్వు ఎప్పుడు రమ్మాన్న గంటలో వచ్చేస్తాను అని హామీ ఇవ్వసాగాను.

1 Comment

Comments are closed.