కసి ! 1716

“ఇప్పుడే వస్తా పిన్ని.. బూట్లు విడిచిపెట్టి వస్తా.. చోటు చూస్తూ ఉండు.. అంటూ క్యూ వదలి పెట్టి బయటకు వెళ్ళాడు లోకనాధం.
బూట్లు షాపులో వదిలిపెట్టి అక్కడే నిలబడి చూశాడు. జనం మధ్య నుంచి తన వంకే చూస్తూ నిలబడి ఉంది దమయంతి. కాస్త మనసుకు ఉపశమనం కలిగినట్లయ్యింది. అక్కడే నిలబడి ఆలోచిస్తూ ఆమె వంకే చూస్తున్నాడు.
దమయంతి కూడా చూపులు మరల్చకుండా జనం మధ్య నుంచి లోకనాధాన్ని చూస్తోంది.
“నాన్సెన్స్.. అక్కా లేదు, తమ్ముడూ లేదు ఎప్పుడో తాతల నాటి సంబంధాలు.. వెధవ వరసలు.. వెధవ సంబంధాలు.. అనుకుంటూ కోపంగా వెళ్ళాడు క్యూ దగ్గరికి.

ఏం చేస్తున్నావురా ఇప్పుడు? ఎక్కడుంటున్నావురా? అంటూ రంగమ్మ అడిగే ప్రశ్నలన్నింటికీ ఓపిగ్గా కధలల్లి చెపుతూ తననో పెద్ద బిజినస్ మాన్ గా చిత్రీకరించుకున్నాడు లోకనాధం.
క్యూ కదులుతోంది. జనం తోసుకుంటున్నారు. చెట్టుకొకడూ, పుట్టకొకడూ కిందులేర్పడిపోతున్నారు. రంగమ్మని తప్పించి దమయంతి వెనక్కి చేరాడు లోకనాధం. వెనక్కి తిరిగి చూసింది దమయంతి. గుండెలు దడదడా కొట్టుకున్నాయి.
“నీకు పదకొండేళ్ళ అమ్మాయుందంటే నేను నమ్మలేకపోతున్నాను” అన్నాడు లోకనాధం.
“ఏం?” అని మాత్రం అంది దమయంతి.
“నీ కెన్నేళ్ళు?”
“యిరవై తొమ్మిది”
“చిన్నప్పుడే చేసేసిందా మీ అమ్మ నీకు పెళ్ళి”
“ఆ”
“వెంటనే పుట్టిందేమో”
“ఊ”
“మరి దాన్ని తీసుకురాలేదేం?”
“పరీక్షల రోజులు , చదువుకుంటోంది”
భుజం మీద చెయ్యి వేశాడు లోకనాధం
“అబ్బబ్బ జనం తెగ తోసేస్తున్నారు” అన్నాడు.
మొదట్లో దమయంతి ఏమీ అనలేదు. లోకనాధం చెయ్యి తీయ్యనూ లేదు. కాని ఓ నిమిషం అయ్యింతర్వాత..
“అమ్మ చూస్తుంది చెయ్యి తీయ్” అంది దమయంతి మెల్లిగా
లోకనాధం గుండెల్లో వెయ్యి గంటలు ఒక్కసారిగా గణగణ మోగాయి.
“అమ్మ చూడకపోతే పరవాలేదా”
దమయంతి మాట్లాడలేదు సరిగ్గా ఆ సమయంలో దూరంగా ఎక్కడి నుంచో జనం మధ్య నుంచి…
“అమ్మాయ్ దమయంతీ జాగ్రత్త.. జనంలో తప్పిపోయేవ్, దర్శనం అయిపోగానే తిన్నగా మనం పొద్దున కాఫీ తాగిన హోటేల్ దగ్గరకి వచ్చేసి నిలబడండి, మీ ఆయనతో కూడా గట్టిగా చెప్పు అసలే వెర్రి మాలోకం” అంటూ అరిచిన రంగమ్మ అరుపులు అందరి చెవుల్లోనూ పడ్డాయి.
“మీ అమ్మ ఏమిటో అరుస్తోంది” అన్నాడు వైకుంఠం.
అంతవరకూ గుడ్డెద్దు చేలో పడ్డట్టు ముక్కుకి సూటిగా పోతున్న వైకుంఠానికి రంగమ్మ అరుపులు లీలగా వినిపించాయి.
“మీ ఆయనకి చెవుడు కూడా వుందా?” అనడిగాడు లోకనాధం చటుక్కున ఆమె భుజం మీద నుంచి తన చేతిని తీసేసుకుంటూ.
“ఆ కాస్తా కూస్తా కాదు. కావాల్సినంత ఉంది. నా ఖర్మ” అని గొణుక్కుంటూ భర్తని చూసి..రంగమ్మ అన్న మాటలు తనకు పెద్దగా చెప్పింది.
“అలాగా అయితే నీ చెయ్యి ఇలా ఇయ్యి తప్పిపోకుండా పట్టుకుంటా” అన్నాడు వైకుంఠం.
“ఏమీ అక్కర్లేదు మీరు పదండి” విసుక్కుంది దమయంతి.

1 Comment

  1. Bhimudu lo srikhna chesina rarhikelu inkoncham varnichi vrasi unte chaala baagundedi

Comments are closed.