కావలెను – Part 1 278

“ఏయ్ అనిమిషా… ఆగు… దిష్టి తీయనీ… నీ అందం చూస్తోంటే నాకే ఇంత టెంప్టింగ్గా ఉంది. ఆ బాత్రూంకెంత టెంప్టింగ్ గా ఉంటుందో! అసలింతకూ బాత్రూం మేల్ జెండరా… ఫిమేల్ జండరా?” అని అడిగింది ద్విముఖ అనిమిషను.

రెండు చేతులూ నడుం మీద పెట్టుకొని టవల్ ని భుజమ్మీద వేసుకొని ద్విముఖ వెన చూస్తూ, “ఇవ్వాళ నన్నసలు స్నానం చేయనిస్తావా? లేదా? అవతల మా బాసాసురుడు కుబుసం వీడిన పాములా ఎదురుచూస్తూ ఉంటాడు” అంది అనిమిష

“అబ్బా… ఇంతందంగా ఎలా పుట్టావే?” అంది అనిమిష నడుము వంక చూస్తూ..

“ఏయ్… నీకు అల్లరెక్కువవుతోంది” తర్జనీ చూపిస్తూ అంది అనిమిష.

“అల్లరి అంటే గుర్తొచ్చింది. ఇవ్వాళ ఆఫీసు నుండి ఎన్ని గంటలకు వస్తావ్?” అడిగింది ద్విముఖ.

“ఆరు గంటలకు… ఏం నాతో ఏమైనా పనా?”

“నాకు రూమ్మేట్…. డైనింగ్ మేట్…. బెడ్ మేట్…. టీవీ మేట్ వి నువ్వే కదా… ఇవ్వాళ ఆరు గంటలకు స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది”

“స్పెషల్ ప్రోగ్రామా… కొంపదీసి ప్రీమారిటల్ సెక్స్ గురించి కాదు కదా… మన రూమ్ ముందు గొడవైతే నేనూరుకోను” అంది అనిమిష

“అనుకుంటాంగానీ… నీలో సెటైర్ బాగానే ఉంది. మొన్న బీచ్లో షూట్ చేసిన ప్రోగ్రాం ఇవ్వాళ టీవీలో వస్తోంది”

“రోజూ నీ ప్రోగ్రామ్ ఏదో ఒకటి వస్తుందిగా… అందులో న్యూసేముంది?”

“నాన్ సెన్స్ గా మాట్లాడకు. సెన్స్తో ఆలోచించిచు… ఇవ్వాళి ప్రోగ్రామ్లో ఓ వివివిఐపి ఉంటాడు”

“మూడు ‘వి’లున్నాయా మీ వివివిఐపిలో?” అడిగింది అనిమిష

“అవును.. అతగాడికి భర్త పోస్ట్ కావాలిట”

“వ్వాట్.. అదిరిపడి అడిగింది అనిమిష

“అందుకేగా… ఆ ఇంటర్వ్యూ మిస్సవ్వద్దు అంటున్నాను. భలే ప్రిన్సిపల్ మేన్.. హీమేన్ కూడా…. సాయంత్రం త్వరగా రావే… వచ్చేటప్పుడు స్నాక్స్ ఏమైనా పట్టుకురా… తింటూ చూడొచ్చు”

“ముందు స్నానం చేయనీ… మా బాస్ గురించి తెలియదు. రాజ్… శోభరాజ్… అంటూ అతడిని యిమిటేట్ చేస్తూ బాత్రూమ్లోకి వెళ్లింది అనిమిష

***