కావలెను – Part 1 278

“బాస్ ఏడ్చాడు” అంది భావన నవ్వి. అనిమిష మేడమ్ని రమ్మంటే సరి” అర్ముగం నవ్వి అన్నాడు. ఆ ‘ఏమిటి సంగతి?” గుసగుసలా ఆ ఆఫీసులో అలా ఓ రౌండేశాయి. ”

ఈలోగా అనిమిష వచ్చింది. వస్తూనే ఆఫీసులో దిష్టిలా వున్న పెద్ద గోడ గడియారం వంక చూసింది. అందులో అంకెలులేవు. అంకెల స్థానంలో శోభరాజ్ తల భాగాలు అతికించబడి ఉన్నాయి.

టైం చూసినప్పుడల్లా తనే గుర్తుకు రావాలని శోభరాజ్ చేసిన ఏర్పాటు అది.

“టెన్ థర్టీ ఫైవ్…” అనిమిష గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ఈలోగా అర్ముగం వచ్చాడు.

“అర్ముగం… రిజిష్టర్ వెళ్లిపోయిందా?”

వెంటనే అర్ముగం కుడి చేతి చూపుడు వేలిని నోటి మీద పెట్టుకొని బాస్ క్యాబిన్వైపు తల తిప్పాడు.

అనిమిష బాస్ క్యాబిన్ వైపు నడిచింది. అనిమిష బాస్ క్యాబిన్లోకి అడుగుపెట్టగానే భావన గుసగుసగా నిఖితతో అంది.

“శోభరాజ్ సమర్పించు… 2006 ఎ లవ్ స్టోరీ” వెంటనే అర్ముగం ఆ ఇద్దరి మధ్యకు వచ్చి “ప్రొడ్యూస్ట్ బై అర్ముగం” అన్నాడు.

****

“సారీ సర్… గుడ్మాణింగ్ సర్” అంది అనిమిష శోభరాజ్ అనిమిష వంక చూస్తూ “మొదటిది అపాలజీ… రెండవది విష్ కదూ”

“యస్సార్… ముందు తప్పు ఒప్పుకోవడం మర్యాద” టేకిటీజీ మిస్ అనిమిష… ఈ నెలలో ఇది మరి ముప్ఫయ్యవ లేట్ కదూ” అడిగాడు

శోభరాజ్.

“అవును సర్… ఈ నెలలో వున్నవి ముఫ్పై రోజులే” చెప్పింది అనిమిష.

“లేట్ రీజన్ సేమ్ టు సేమ్ కదూ”

“అవును సర్… ట్రాఫిక్ జామ్… బస్సులు దొరక్కపోవడం” “చేపా చేపా ఎందుకు ఎండలేదు కథ తెలుసా?” అడిగాడు శోభరాజ్.

“చిన్నప్పుడు విన్నాను సర్… అయినా నాకు ఫిష్ అంటే ఎలర్జీ. చికెన్, మటన్. ఫిష్ తినను… దాని మీద పెద్దగా ఆసక్తిలేదు”