నేను బాకీ వుంది ఆయనకే 1 191

అలా గడిచిపొతునా మన అర్జున్ జీవితములో అనుకొని ట్విస్ట్ వచ్చి పడింది, అదెనండి మన వాడు ఎలాగొలా అందరిని తన తెలివితేటలతో ఒప్పించాడు, కాని పెళ్ళి కొడుకు చైతన్య (అదె మన వాడు ప్రెమించిన అమ్మయితొ పెళ్ళి చెసుకొబొయెవాడు) వాడు ఆ ఊరి నాయుడి గారి అమ్మయిని ప్రెమించాడు… కాని పెద్దల ఇష్టం మేరకు ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడు, మా ఇద్దరికి పెళ్ళి ఫిక్స్ అయ్యింది, దానితొ చైతన్య ఇక నాయుడి కూతురితో పెళ్ళి కాదు అని సూసైడ్ చెసుకొబొతుంటె నేను చైతు బాధ చుడలెక ,నా పెళ్ళితో పాటు నీ పెళ్ళి చెస్తాను అని మంగమ్మ శబదం చేసి నాయుడి కూతురిని కిడ్నాప్ చెయడానికి ప్లాన్ వెస్తున్నా, ఇంతలొ నా కథ ఇంకొ మలుపు తిరిగింది, మా ఫ్రెండ్ నాయుడు కొడుకు పెళ్ళి చెసుకొబొయె అమ్మయిని ప్రెమించాడు, వాడి బాద చుడలెక ఆ అమ్మయిని కూడ తెస్తాను అని బయలదెరాను….. నా మనుసులొ నేనే తిట్టుకుంటున్నా..చీ! దీనమ్మ జీవితం నా మానాన నా పెళ్ళి చేసుకొకుండా నాకేందుకు ఈ అతిక పెత్తనాలు ,నువ్వు బతుకుతున్నావ్ బురుదలొ పంది బతుకు తుంది ఎందుకురా ఈ జీవితం అనుకుంటు బయలదెరాను….. ఎలాగొలా ఇద్దరి అమ్మయిలని ఎవ్వరికి తెలియకుండా తీసుకువదాము అని అనుకునె లోపు వాళ్ళకి పట్టుబడ్డాను…..కొంత మంది ఉంటె నా బలముతొనె వాళ్ళను కొట్టి అమ్మయిలద్దరిని మా ఫ్రెండ్స్ దగ్గరికి చెర్చాను ….ఇంతకి కిడ్నాప్ ప్లాన్ ఏంటి అనుకుంటునారా సినిమాలు చుట్లెదేంటి(చుడడం లేదు ఎంటీ)మనం అన్ని సినిమాలు రీమిక్స్ చెసి ఒక ప్లాన్ డిసైడ్ అయ్యాను, మొత్తనికి వర్క్ ఔట్ అయ్యింది,మొత్తానికి వాళ్ళ నలుగురిని కలిపాను కాని నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి చేరుకొలెకపొయాను,నాయుడు మనుషుకను నా వైపు డైవర్త్ చేసి ,మా వాళ్ళందరిని మా ఊరికి పంపించాను,ఇక ఎలాగొలా రైల్వె స్టెషన్ చెరుకొని ఆ తరువాత జరిగింది మీకు తెలుసు …………
ఇక ఆ స్టెషన్ మాష్టరని మా ఊరికి ట్రైన్ ఎప్పుడు ఉండి అని అడిగాను ఇక్కడ నుండి చెన్నై వెళితె అక్కడ నుండి నీకు చాల దొరుకుతాయి అని చెప్పాడు, అక్కడ ఒక వారం అంతా సర్దుమణిగిన తరువాత బయలదేరాను,ఇక నేను వారం తరువాత బయట సుర్యొదయం చుసాను…..ఇక ఆలస్యం చెయకుండా అక్కడ నుండీ బయలదేరి చెన్నై వెళ్ళాను నా గర్ల్ ఫ్రెండ్ కలుదాము అని వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నేను అక్కడికి చేరుకునెసరికి నాకు ఒక భయంకరమైన నీజం తెలిసింది, ఆ నాయుడు మనుషులు నా గర్ల్ ఫ్రెండ్ ఎత్తుకొని వెళ్ళి తన కొడుక్కి పెళ్ళి చేసి అమేకు నరకం చుపిస్తున్నారు……… అది విన్న వెంటనె కొపముతో ఊగిపొయిన నేను నాయుడు ఇంటి వెళ్ళి గొడవకు దిగాను, ముందు నుంచి ఎంత అమంది వచ్చినా ఎదిరించి పొరాడసాగాను ,కాని ఎవడొ నా వెనక నుండి తలపై గట్టిగా కొట్టాడు,దానితొ నేను స్పృహ కొల్పొయాను, నన్ను కొట్టి ఎదొ బస్సులొ వేశారు,నన్ను ఒక అర్.ఎం.పి డాక్టర్ కాపాడి నా వైద్యం చెపించాడు,కొన్ని రొజులకు కొలుకున్నాను, అప్పుడు తెలిసింది నాకు గతం పొయింది అని ,దానితో నా పాత గుర్తులు కూడ తుడుచుపెట్టుకు పొయాయి…….ఇల అక్కడ అక్కడ పని చెసుకుంటు ఒక ఊరికి చికటి పడె సమయానికి వెళ్ళాను ,ఇంతకి ఆ ఊరి పేరు చెప్పలేదు కదా …………..

నా ఎంట్రి శృంగారపురంలో

అది కార్తీకమాసం అనుకుంటా-

ఆకాశంలో చందమామ దొర్లుతున్న మల్లెచెండులా వుంది. సన్నటి చలి ఒంటికి మంచుతెరను కప్పుతోంది. గాలి ఎక్కడో ముసుగుతన్ని పడుకున్నట్లు ఆకులు కూడా రెపరెపలాడటం లేదు.శృంగారపురం నిద్ర కుపక్రమిస్తోంది. ఊరికి తూర్పున వున్న కొండ వెన్నెల్లో వెండి కొండలా మెరిసి పోతోంది. దాని పైభాగాన వున్నా పెద్ద భవనం శిథిలమై కాలం కొమ్మకు వేలాడుతున్న ఎండుటాకులా వుంది. దాని పక్కనే వున్న దేవాలయం రాగిచెంబు మీదున్న కలశంలా వుంది.

శృంగారపురంలో మొత్తం వేయికి పైగా ఇళ్ళున్నాయి. వాటిలో ఎక్కువ భాగం పెంకుటిళ్ళే. అక్కడక్కడా పావురాళ్ళు వాలినట్లు మట్టి మిద్దెలున్నాయి.
ఆ వెన్నెల్లో పెంకుటిళ్ళు దేవుడి వూరేగింపు కోసం వేసిన ఎర్రమట్టి గీతాల్లా వున్నాయి. ఇళ్ళ మధ్య నున్న చెట్లు ముగ్గుల కోసం పెట్టిన చుక్కలా వున్నాయి.

రాత్రి తొమ్మిది కావడంతో అందరూ పడుకోవడానికి పడకలు సర్దుకుంటున్నారు. కిరోసిన్ దీపాలు చీకటిని నాకుతున్న వింత పురుగుల్లా కనిపిస్తున్నాయి.

అలాంటి సమయంలో ఓ వ్యక్తి పెద్ద స్టీలు క్యారియర్ లో విందు భోజనం తీసుకుని నడుస్తున్నాడు.
ఆ వ్యక్తి పేరు అర్జున్. అతనికి పాతికేళ్ళ వయసుంటుంది. అతని తల్లిదండ్రులెవరో తెలియదు. ఎప్పుడో ఏ చీకట్లో తయారై, ఓ రాత్రి ముళ్ళపొదల వెనక భూమ్మీదపడి, ఫ్లాట్ ఫారమ్ ఊయలలో ఊగి, టీ అంగళ్ళల్లో అన్నప్రాసన చేసి, వీధుల్లో పెరిగి అంతటి వాడయ్యాడు. ఈ మధ్యే శృంగారపురం వచ్చాడు.

దానికి ముందు ఎమి జరిగింది అంటె

టౌన్ అంటే అసహ్యమేసి, పని వెదుక్కుంటూ ఇలా గ్రామాల మీద పడ్డాడు. ఎక్కడా పని దొరకలేదు. చివరికి శృంగారపురం చేరుకునే సరికి కాళ్ళు ఇక కదలనని మొరాయించాయి. అప్పటికి తిండి తిని మూడురోజులైంది. ప్రతి ఇల్లూ తిరిగి పని అడుక్కునే శక్తి చాలక పెద్ద భవంతిలాగా కనపడే కొండమీదున్న ఇల్లుకు చేరుకున్నాడు.

“అయ్యా అమ్మా!” అని అరుస్తూ ద్వారం దగ్గర పడిపోయాడు.

లోపలినుంచి జవాబు రాలేదు.