నేను బాకీ వుంది ఆయనకే 1 196

భయం అతన్ని ఒక్కసారి కొండ చిలువలా చుట్టేసింది.ట్రైన్ ఇంజన్ అప్పటికే ఫ్లాట్ ఫారమ్మీదకు అడుగుపెట్టింది.
లాభం లేదు…. తను తప్పించుకోవాలి…. మనుషుల మధ్య నుంచి కంపార్ట్ మెంట్ డోర్ వేపు పరుగుతీసాడు.ట్రైన్ వేగం బాగా తగ్గిపోయింది. కంపార్టుమెంట్లో కలకలం మొదలైంది.వెనక డోర్ దగ్గరకొచ్చి అర్జున్…బయటకు చూసాడు. ఫ్లాట్ ఫారమ్మీద-
దూరంగా ఒకే ఒక వ్యక్తి నుంచున్నాడు. అంతే…. నెమ్మదిగా ఐరన్ రాడ్ పట్టుకుని కిందకు దిగాడు.పట్టాలు దాటుకుని అంచు పట్టుకొని, ఫ్లాట్ ఫారమ్మీదకెక్కి, చీకట్లో ముందుకు పరుగెత్తడం ప్రారంభించాడు.
అదే సమయంలో-
జనరల్ కంపార్టుమెంటులోకి దూసుకొచ్చిన శ్రీరాములు నాయుడు అనుచరుల్లో ఒకడికి-ఫ్లాట్ ఫారమ్మీదకు ఎక్కుతున్న అర్జున్ కన్పించాడు.”వాడే…. వాడే పరిపోతున్నాడు…. పట్టుకొ….పట్టుకొ” లెఫ్ట్ డోర్ లోంచి పట్టాల మీదకు దూకి, ఫ్లాట్ ఫారమ్మీదకెక్కాడు అరుచుకుంటూ.బలాన్నంతా కూడదీసుకుని పరుగెడుతున్నాడు అర్జున్ అటూ, ఇటూ చూసాడు…. ఎక్కడా బయటికెళ్ళడానికి దారిలేదు. ఆ చివర నుంచి ఈ చివరవరకూ సిమెంటు స్తంభాలు….ఐరన్ ఫెన్సింగ్ ఇంజన్ వేపు పరుగు, పరుగున వస్తున్న స్టేషన్ మాస్టర్ని చూసాడు అర్జున్ .తను వాళ్ళ చేతులకి దొరికిపోవడం ఖాయం.తనని వాళ్ళు చంపడం ఖాయం.
పైన వర్షం… కింద బురద…. .. స్టేషన్ మాస్టర్ కి ఎదురుగా వెళ్ళాడు.
“ఆ అబ్బయ్యనాయుడు గూండాలేనా ట్రైన్ ని ఆపింది” భయంగా అడిగాడు – స్టేషన్ మాస్టర్ని భుజం దగ్గరున్న నేమ్ ప్లేట్ ని చూస్తూ.
అప్పుడు తెల్సింది స్టేషన్ మాస్టర్ కి. తానెవరితో తలపడ్డాడో!
అబ్బయ్య నాయుడు!! ది అరక్ కింగ్ ఆఫ్ ఆంద్రప్రదేశ్.
ఆ పేరు వినగానే వెన్నులో చలి మొదలైంది. భయం నిండిన కళ్ళతో చూసాడు అర్జున్ ని.”మీ… మీ… మీరెవరు”

“సార్! న నేనెవరొ తరువాత ముందు నన్ను కాపడండి – నన్ను వాళ్ళు చంపేస్తారు- ప్లీజ్- ప్లీజ్ సేవ్ మీ సర్ ప్లీజ్.” ఎందుకో ఆ సమయంలో అర్జున్ గొంతులో ప్రాణభయం. స్టేషన్ లో ఒక్కసారి హడావుడి. ట్రైన్ అక్కడ ఎందుకాగిందో తెలీని ప్రయాణీకులు కంపార్టుమెంట్లలోంచి దిగుతున్నారు. అర్జున్ వేపు ఎగాదిగా చూసాడు స్టేషన్ మాస్టర్!
“బ్రిడ్జి ఎక్కి స్టేషన్ బయటకు వెళ్ళండి. అక్కడ రెండు క్వార్టర్సు కన్పిస్తాయి. మొదటి క్వార్టర్ నాది. ఇదిగో తాళాలు తీసుకోండి నేను వస్తాను మీరెళ్ళండి” ఫాంటు జేబులోంచి తాళాల గుత్తి తీసిచ్చి ఎవరికీ అనుమానం రాకుండా ముందుకెళ్ళిపోయాడు స్టేషన్ మాస్టర్.
కుడిచేతిలో తాళాలు పట్టుకొని దూరంగా కన్పిస్తున్న వంతెనవేపు పరుగెడుతున్నాడు అర్జున్.
రెండు…. మూడు… అయిదు క్షణాలు.శక్తినంతా కూడదీసుకుని పరుగెడుతున్నాడు.బ్రిడ్జి పైకెళ్ళి కిందకు చూసాడు.
శ్రీరాములునాయుడు అటూ, ఇటూ పరుగెడుతున్నాడు. అంతలోనే అతనికి, అతని అనుచరులు పరుగు పరుగున వచ్చి ఏదో చెపుతున్నారు.ఆగిన ట్రైన్… ప్రయాణీకుల హడావుడి…. శ్రీరాములునాయుడు మనుషుల హడావుడి…. వర్షం హోరు….అప్పుడప్పుడు మెరిసే మెరుపులు.
కాలం కేన్వాస్ మీద కరెన్సీ గీసిన ఒక బీభత్స దృశ్యం.
వంతెన రెండోవేపుకి దిగి గోడదాటి ముందుకు పరుగెత్తాడు.దూరంగా రెండు పసుపు పచ్చని ఇళ్ళు.ఏమాత్రం ఆలస్యం చెయ్యలేదు అర్జున్.
తలుపు తెరుచుకొని, ఇంటి లోపలి గదిలోకెళ్ళి కూలబడిపోయాడు అర్జున్ తను ఇటువేపు రావడం ఎవరూ చూడలేదు!
గుడ్ గాడ్!అంతటి ప్రమాద పరిస్థితుల్లో కూడా స్టేషన్ మాస్టర్ చేసిన సహాయం గుర్తుకొచ్చిన అర్జున్ కళ్ళల్లో కన్నీళ్ళు చిప్పిల్లాయి.
గుండె ఎండిపోతోంది గొంతు పిడచకట్టుకుపోతోంది.దాహం- దాహం- బయట వర్షం.బాగా అలసిపోయాడు అర్జున్. కాళ్ళూ, చేతులూ కదలడంలేదు.స్టేషన్లో, ట్రైన్ కూతవేసి, బయలుదేరుతున్న చప్పుడు.ధడేల్మని తలుపు చప్పుడుకి, తలెత్తి ద్వారబంధం వైపు చూసాడు అర్జున్…