నేను బాకీ వుంది ఆయనకే 1 196

“ఎప్పుడు జాయిన్ కావాలి సార్?”

“వారం రోజులు టైమిచ్చారమ్మా.”

“థాంక్యూ సార్” అని ఆమె లేచింది.

“బెస్టాఫ్ లక్! వెరీ ఇంట్రెస్టింగ్ విలేజ్ శృంగారపురం. బస్సు దిగి ఒక కిలోమీటరు నడిచి ఊర్లోకి వెళితే అన్నీ విచిత్రాలే. నిజానికి ఆ ఊరే ఒక వింత. ఆ ఊరిలో వుండే ఓ ఆచారం వింతల్లోకి వింత. మహా వింత….” చెప్పడం మధ్యలో ఆపి నవ్వుతున్నాడు హెడ్ మాస్టర్.

ఇంక ఇక్కడ అర్జున్ అడిగిన ప్రశ్నకు గోపాలకృష్ణ సమాధానం చెబుతున్నాడు…..”చెప్పాను కదా. ఈ ఊరిలో ఓ ఆచారం వుందని. అదేమిటంటే, మా వంశానికి చెందిన పురుషుడితో ఏ స్త్రీ అయినా ఓ రాత్రి గడిపితే ఆమెకూ, ఆమె కుటుంబానికి ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలూ కలుగుతాయని గ్రామస్థుల నమ్మకం. నాన్న యాక్సిడెంట్ లో చనిపోయాక ఆ వంశంలో మిగిలింది నేనొక్కడ్నే. దాంతో తల్లిదండ్రులను పోగొట్టుకున్న నన్ను గ్రామస్థులే పెంచి పెద్ద చేశారు. నాకు ఏ లోటూ రాకుండా చూశారు. చదువు చెప్పించారు. విద్యాబుద్ధులు నేర్పించారు. నేను నవ్వితే గ్రామమంతా నవ్వింది. నేను ఏడిస్తే గ్రామమూ ఏడ్చింది. అలానే పెరుగుతుండగా మా దివాను పనిమానేశారు. మా పొలాలన్నింటినీ ఎవరెవరో ఆక్రమించుకున్నారు.”

“నువ్వు ఇప్పుడు మళ్ళీ ఆ ఆచారాన్ని కొనసాగిస్తున్నావా?” అర్జున్ కి ఆ పాయింట్ చాలా కొత్తగా వింతగా వుంది. అందుకే ఆ ప్రశ్న వేశాడు.

“అక్షరాలా. అది ఆచారం కదా. కేవలం దానివల్లే జనం నన్ను పెంచి పెద్ద చేశారు. మా వంశంలో మిగిలిన పురుషుడ్ని నేనొక్కడ్నే కదా. అందుకే దాన్ని పాటిస్తున్నాను, పధ్నాలుగవ ఏటనుంచే ఆ ఆచారం ప్రారంభమైంది.”