నేను బాకీ వుంది ఆయనకే 1 196

“ట్రైన్ మధ్యలో ఆగుతుందా…నెల్లూరులోనే ఆగుతుందా…” ప్రక్కనే తన వేపు చూస్తున్న ఓ నడివయసు వ్యక్తిని అడిగాడు అర్జున్.
అసలే వర్షం…పట్టాలు బాగుంటే నెల్లూరులో ఆగుతుంది. లేకపోతే ఇక్కడే ఆగిపోతుంది…అసలు ….వర్షంలో ప్రయాణాలు చెయ్యకూడదు.” స్టేట్ మెంట్ ఇచ్చి-
“సాయంత్రం రేడియోలో వార్తలు విన్నారా మీరు…” అడిగాడా వ్యక్తి.
“ఏం?”
“ఆకాశం పొడి, పొడిగా ఉంటుందని, మనకసలు వర్షాలు పడవని చెప్పారు. చెప్పిన పావుగంతకే ఉరుముల్తో వర్షం ప్రారంభమైంది….” నవ్వాడా వ్యక్తి.
మరో సమయంలో అయితే అర్జున్ కూడా ఆ నవ్వుతో శృతి కలిపేవాడు. ప్రస్తుతం అర్జున్ ఆ మూడ్ లో లేడు.
నెల్లూరు స్టేషన్ నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తున్నాడతను…
వాళ్ళు తనను వెంటాడుతుంటారా? అంకుంటు తన పాత గుర్థులు నెమెరెసుకుంటూ , ఒక్కొక్క సంఘటన గుర్తుకొస్తుంటే అతనికి చాలా థ్రిల్లింగ్ గా ఉంది ఒకప్రక్క.ఎక్సయిటింగ్ గా వుంది మరోప్రక్క. సిక్త్ సెన్స్ చేస్తున్న మృత్యు హెచ్చరిక-కళ్ళు తుడుచుకుంటూ విండోలోంచి బయటకు చూసాడు.చిక్కటి మృత్యువు లాంటి చీకటి…

* * * * *
తనవైపు వస్తున్న భారీ ఆకారంవైపు ఆశ్చర్యంగా చూసాడు స్టేషన్ మాస్టర్. ఠీవిగా నడుచుకుంటూ వెళ్ళి అతని ఎదురుగా నిలబడ్డాడు శ్రీరాములు నాయుడు.
“నువ్వేనా స్టేషన్ మాస్టర్ వి?”
ఆ ఏకవచన ప్రయోగానికి కోపం వచ్చింది స్టేషన్ మాస్టర్ కి.
“నేనే….” అయిష్టంగా జవాబిచ్చాడాయన.
“చార్మినార్ ఎక్స్ ప్రెస్ ఇక్కడ ఆగుతుందా…”
“ఆగదు…” టక్కున జవాబిచ్చాడు అతను.
నాలుగువైపులా చూసాడు శ్రీరాములునాయుడు. త్రిబుల్ ఫైవ్ సిగరెట్ ప్యాకెట్ లోంచి సిగరెట్ తీసి గోల్డెన్ లైటర్ తో వెలిగించుకుంటూ-
“ఇక్కడ చార్మినార్ ఎక్స్ ప్రెస్ ఆగాలంటే…” కరుగ్గా, పొగరుగా ఉందా గొంతు.
“గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి” కోపంగా అన్నాడు స్టేషన్ మాస్టర్.
“అయితే… నేను…. పర్మిషన్ ఇస్తున్నాను….చార్మినార్ ఎక్స్ ప్రెస్ ను ఇక్కడ ఆపు చెయ్యి.”
పరుగు, పరుగున వచ్చి శ్రీరాములునాయుడు వెనక నుంచున్న నలుగురు వ్యక్తులవైపు చూసాడు స్టేషన్ మాస్టర్.
“ఎవర్నువవు” మరింత కోపంగా అడిగాడు స్టేషన్ మాస్టర్.
“చెప్తే జడుసుకుని జ్వరం తెచ్చుకుమ్తావ్…. చార్మినార్ ఎక్స్ ప్రెస్ ను ఇక్కడ ఆపు౮….ఓన్ లీ టెన్ మినిట్స్… మా పని మేం చేసుకుని వెళ్ళిపోతాం నీకెంత కావాలో చెప్పు….”
స్థంభం దగ్గర కూర్చున్న అటెండర్ దగ్గరకు రాబోయి శ్రీరాములు నాయుడ్ని చూసి దడుసుకుని వెనకడుగు వేసాడు.
“ఎవరు మీరు? మీకేం కావాలి?” మళ్ళీ అయోమయంగా అడిగాడు స్టేషన్ మాస్టర్.దూరంగా రైలు కూసిన కూత విన్పించింది.
“క్విక్- టైమ్ లేదు…. ట్రైనొచ్చేస్తోంది. లోపల రెడ్ లైటు, ఫ్లాగూ ఉంటాయ్ అందుకోండి” కంగారుగా అరిచాడు శ్రీరాములు నాయుడు.