నేను బాకీ వుంది ఆయనకే 1 196

మా అత్తా మావయ్యలు, తోటికోడళ్ళం, మగవాళ్ళూ- అందరం హాల్లో పడుకున్నాం.

ఒకవేళకు మా మరిది తన భార్య దగ్గిరికి జరిగాడు. చాలారోజుల తరువాత ఇంటికొచ్చాడు. కాబట్టి మంచి ఆకాలిమీదున్నాడు కాబోలు పడుకున్న అరగంటకే మీద పడిపోయాడు.

చిత్ర చాలా తెలివిగా తన భర్త కనపడకుండా దుప్పటిని కప్పింది. నిశ్శబ్దంగా అతను తన దాహం తీర్చుకుంటున్నాడు. కానీ కొంతసేపటికి నిశ్శబ్దం పాటించటం అతనివల్ల కాలేదు. ఉచ్చ్వాస నిశ్వాసాలు ఎక్కువయ్యాయి. రొప్పడం కూడా ఎక్కువైంది. ఇలాంటివి ఇళ్ళల్లో మామూలే గనుక మేము పక్కకు తిరిగి పడుకుని నిద్రపోతున్నట్లు నటిస్తున్నాం.

“ఈ శబ్దాలకు మా అత్తమ్మ లేచింది. “ఛీఛీ! వెధవ ఎలుకలు. కన్నారా నిద్రపోనివ్వవు కదా” అని తిట్ల దండకం ఎత్తుకుంది.

చప్పుళ్ళు ఆగిపోయాయి. చిత్ర తన భర్తను విసుక్కోవడం వినిపిస్తూనే వుంది.

మా అత్త మొత్తం ఎలుకల వంశం అంతా నాశనం కావాలని శపిస్తూ నిద్రకు పక్రమించింది.

మరో అయిదు నిముషాలకు చప్పుళ్ళు తిరిగి ప్రారంభమయ్యాయి.

ఈసారి లేచింది మా అత్తకాదు. మా మావయ్య.

“ఈ పందికొక్కులతో పడలేక ఛస్తున్నాం. ఎండ్రిస్ పెట్టి చంపేసినా పాపం రాదు” అని తన కోపాన్నంతా ప్రకటించాడు.

ఈ మాటలకు మా అత్తమ్మ లేచి అవి పందికొక్కులు కాదనీ, ఎలుకలనీ అంటుంది. మా మామయ్యా అవి పందికొక్కులేనంటూ ఘర్షణకు దిగారు.

ఎంతసేపటికీ వాళ్ళ వాగ్వివాదం ఆగలేదు. దాంతో మా మరో తోటికోడలు పద్మకు చిర్రెత్తుకొచ్చింది. సర్రున లేచి “అవి ఎలుకలు కావు, పందికొక్కులు అసలే కావు. మీ చిన్నకొడుకు చేస్తున్న శబ్దాలు. ఇక డీటైల్స్ అడక్కుండా పడుకోండి” అని చిరాకుపడిపోయింది.

పాపం! మా మరిది పెళ్ళాం మీద నుంచి దిగి మోకాళ్ళమీద పాక్కుంటూ వెళ్ళడం కనిపించింది.”

గోపాలకృష్ణ ఒకటే నవ్వుతున్నాడు. ఆమె కూడా అతనితో శ్రుతి కలిపింది.

* * *

“నిజమే! ఇలాంటి ఇబ్బందులున్నాయి. బెడ్ రూమ్ వుండీ బెడ్ టైమ్ టాక్ గురించి తెలియని వాళ్ళ గురించి నేను చెప్పేది” కొంతసేపయ్యాక అన్నాడు అతను.

“అలాంటివాళ్ళూ చాలామందే వున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా కజిన్ సుధాకర్” అని చెబుతోంది ఆమె.

“మా పుట్టిల్లు మాధవీమాల. మా ఇంటి పక్కనే మా చిన్నాన్న కొడుకు సుధాకర్ వుంటున్నాడు. అప్పు చేయడం అంటే మహాభయం వాడికి. అప్పుల వాడు ఇంటికి రాకూడదన్నది వాడి ప్రిన్సిపుల్. అలాంటివాడు పక్కనున్న చిన్న టౌన్ లో వుంటున్న శెట్టి దగ్గర పెళ్ళికి ఇరవైవేల రూపాయలు అప్పు చేయాల్సి వచ్చింది. కట్నం డబ్బుల్లో దాన్ని తీర్చుదామనుకున్నాడు గానీ వీలైంది కాదు.

వాడి పెళ్ళాం కళావతి కాపురానికి వచ్చింది. కొత్త పెళ్ళాం, కొత్త సంసారం కన్నా వాడికి అప్పే మరీ మరీ గుర్తుకొచ్చేది. అందుకే బెడ్ రూమ్ లో కూడా పెళ్ళాంతో ముచ్చట్లు ఆడడానికి బదులు అప్పు గురించీ, దాన్ని తీర్చడానికి తను ఎలా ప్లాన్ చేస్తుందీ చెప్పేవాడు.

ఇది ఏ ఒకరోజు అయితే ఫరవాలేదు. రోజూ ఇదే తంతు కావడంతో కళావతి బెడ్ రూమ్ అంటేనే హడలిపోయేది.

ఓరోజు ఆమె నా దగ్గరికి వచ్చి ‘వేలు, లక్షలు అప్పులున్న వాళ్ళని చూశానుగానీ, మీ తమ్ముడులాంటి వాడ్ని ప్రపంచంలో చూళ్ళేదు. జడలో పూలు పెడుతున్నా, చివరికి లంగా బొందు లాగుతున్నా అప్పు గొడవే ఛీ ఛీ! పుట్టింటికి వెళ్ళి ఆ ఇరవై వేలూ తీసుకొచ్చి ముఖాన కొడదామంటే అక్కడి పరిస్థితి బాగోలేదు’ అని తన బాధనంతా వెళ్ళగక్కుకుంది.

“మరి ఏమిటి మార్గం?”

“అదే ఆలోచిస్తున్నాను” అని సీరియస్ గా వెళ్ళిపోయింది.

రెండో రోజే తను పుట్టింటికి వెళుతున్నానని, వారంరోజుల్లో తిరిగి వస్తానని భర్తతో చెప్పి బయల్దేరింది. అప్పు తీర్చే నిర్ణయంతోటే ఆమె వెళుతుందని నాకు అర్థమైంది.

ఖచ్చితంగా వారం రోజుల తర్వాత మధ్యాహ్నంపూట నేను సుధాకర్ ఇంట్లో వుండగా ఓ వ్యక్తి వచ్చాడు. అప్పుడు నేను మావాడి కోసం వంట చేస్తున్నాను.

ఆయన్ను చూడగానే సుధాకర్ వణికిపోయి తెగ మర్యాద చేశాడు. వరండా తిన్నెమీద తువ్వాలుతో తుడిచి కూర్చోమన్నాడు

నేను తలుపు దగ్గర చూస్తూ వుంటే వాడు నా దగ్గరికి వచ్చి “ఆయనే శెట్టి. నేను బాకీ వుంది ఆయనకే” అని చెప్పాడు.

అంతలో శెట్టి పిలిచాడు. మావాడు వెళ్ళి ఆయనకెదురుగ్గా వినయంగా నిలుచున్నాడు.

శెట్టి మావాడ్ని అప్పు తీర్చనందుకు దులిపేస్తాడనుకున్నాను, కానీ అలాంటిది ఏమీ లేదు. పైపెచ్చు ప్రసన్నంగా వున్నాడు.