నేను బాకీ వుంది ఆయనకే 1 192

అప్పుడు గుర్తొచ్చింది శోభనం గురించి. లాటరీ టిక్కెట్లను జేబులో కుక్కుకుని ఆమె మీదకు ఒరిగాడు.

ఈ హఠాత్ పరిణామానికి ఆమె ఖంగుతిన్నా, మరుక్షణంలో సర్దుకుంది. అన్నిరోజులూ హృదయం గదిలో బంధించిన కోర్కెలన్నీ బిలబిలా పావురాళ్లా పైకెగిరాయి. ఇక నిగ్రహించుకోలేక అతని వీపు చుట్టూ చేతులు బిగించి గట్టిగా అదుముకుంది. ఆ వత్తిడికి స్తనాలు మధురంగా మూలిగాయి.

“అంత గట్టిగా అదమకు. లాటరీ టిక్కెట్లు నలిగిపోతాయి” ఆమె మీదున్న అతను ఇబ్బందిగా కదిలాడు.

అంతే- ఆమె షాక్ తిన్నట్లు చేతులు తీసేసింది. కోర్కెతో మండి అనుభవంతో చల్లబడాలనుకున్న శరీరం తిరగబడి గట్టిగా బిగుసుకుపోయింది.

ఇదేమీ గమనించని అతను హడావుడిగా పేపరులో నెంబర్లు వెదికినట్లు ఆ కార్యక్రమాన్ని ముగించి కిందకు దిగాడు. జేబులో వున్న సిగరెట్ ను కుతికుతిగా లాగి పక్కకు వచ్చి పడుకున్నాడు.

ఇకనయినా హాయిగా మాట్లాడుదామని పక్కకు తిరిగి చూసిన ఆమెకు అతను నిద్రపోతూ కనిపించాడు.

ఇకనయినా హాయిగా మాట్లాడుదామని పక్కకు తిరిగి చూసిన ఆమెకు అతను నిద్రపోతూ కనిపించాడు.

తొలిరేయి అనుభవాన్ని గురించి సినిమాల్లోనూ, పుస్తకాల్లోనూ వర్ణించేదంతా అబద్ధమని తేల్చుకుంది.

అదంతా కళ్ళముందు కదిలి అప్పటికి ఇప్పటికీ వున్న తేడాను తలచుకుంటూ వుంటే నవ్వొచ్చింది ఆమెకు.

* * *

గోపాలకృష్ణ ఆమె కళ్ళల్లోకి చూస్తూ “ఏమిటి నవ్వుతున్నావ్?” అని అడిగాడు.

“ఏంలేదు” అంది ఆమె అదంతా చెప్పడానికి ఇష్టం లేనట్లు.

“నువ్వేదో దాస్తున్నావ్. ఈ కొండ ఎక్కినప్పట్నుంచీ దిగేవరకు ఏదీ దాచకూడదు. పైపెచ్చు ఇంతకాలం ఎవరికీ చెప్పని సంగతులన్నీ చెప్పాలి. లేకుండా అదిగో ఆ శృంగార దేవుడికి కోపం వస్తుంది.”

ఇక చెప్పక తప్పదని తన తొలిరేయి అనుభవాన్ని గురించి చెప్పింది.

అంతా విన్నాక అతను “నీ భర్తేకాదు- చాలామందికి పడకటింట్లో ఎలాంటి విషయాలు మాట్లాడాలో తెలియదు. భర్త భార్య జాకెట్ హుక్ లు తప్పిస్తూ ఉదయం బజార్లో తను ఎంత తెలివిగా కేజీమీద పావలా తగ్గిస్తూ వంకాయలు బేరమాడిందీ చెబుతాడు.

ఆమెకూడా అతనికంటే ఏమీ తీసిపోదు. అతని ఛాతీమీద వెంట్రుకలను స్పృశిస్తూ తను మధ్యాహ్నం చేసిన వేరుశనగపప్పుల పచ్చడిని అమ్మలక్కలు ఎంతగా మెచ్చుకున్నారో చెబుతుంది. ఇలా నడుస్తాయి మన బెడ్ రూమ్ ల సంభాషణలు. అందుకే భార్యాభర్తలకు తక్కువకాలంలో సెక్స్ రొటీన్ అయిపోతుంది. బెడ్ టైమ్ టాక్ అంటే మనసుని కదిలించేటట్లు, శరీరాన్ని రగిలించేటట్లు వుండాలి. రతికళలో బెడ్ టైమ్ టాక్ కూడా ఒక భాగం” అన్నాడు.

“చాలా ఇళ్ళల్లో బెడ్ రూమే వుండదు. ఇది బెడ్ టైమ్ టాక్ ఎక్కడిది? పల్లెటూళ్ళల్లో అయితే మరీ ఘోరం. ఒకే ఇంట్లో మొత్తం సంసారం అంతా వుంటుంది. అందరూ ఒకే దగ్గర పడుకుంటారు.

ఏ అపరాత్రో మూడ్ వచ్చినప్పుడు భర్త అందర్నీ తప్పించుకుని భార్య పక్కన చేరి, పిల్లిపాలు తాగినట్లు నిశ్శబ్దంగా తన ఆరాటాన్ని తీర్చుకుంటాడు. ఇక మాట్లాడటానికి వీలు ఎక్కడిది? మాటలు వినిపిస్తే ఎవరైనా లేస్తారేమోనన్న భయం. అందుకే ముందు నమస్కారాల బాణాలు లేకుండానే యుద్ధం మొదలవుతుంది. ఇందుకు ఉదాహరణగా ఈ మధ్య మా ఇంట్లో జరిగిన ఓ సంఘటన చెబుతాను” అంటూ ప్రారంభించింది.

* * *

“మా ఇంట్లో పేరుకు మూడు గదులున్నా అవెప్పుడూ ఖాళీగా వుండగా. ధాన్యమో, నువ్వులో ఏదో ఒకటి వుంటుంది. అందువల్ల మేమంతా హాల్లోనే పడుకునేవాళ్ళం.

ఈ మధ్య మా మరిది ఊరెళ్ళి వచ్చాడు. రాత్రి ఎనిమిది గంటలకు రాగానే బాత్రూమ్ లో దూరి చకచకా స్నానం ముగించి భోజనం ముందు కూర్చున్నాడు. అతని హడావుడి అంతా ఎందుకో మాకు తెలుస్తూనే వుంది.

భోజనాలు ముగించాక హాల్లో అందరం పడుకున్నాం.

‘ఈరోజు కూడా హాల్లోనేనా పడక?’ చిన్నగా తన భార్య చిత్రను అతను అడిగినా మాకు వినిపించింది.

“ఆఁ అన్ని గదులూ ఫిలావ్ అయిపోయాయి. అందరం హాల్లోనే పడుకోవాలి” చిత్ర తన నిస్సహాయతను వెలిబుచ్చింది.