నేను బాకీ వుంది ఆయనకే 4 130

బస్సు వచ్చి ఆగింది.

జయంత్ ని చేయి పట్టుకుని బలవంతంగా ఎక్కించాను. బస్సు కదులుతూ వుంది.

“ఇక నిన్ను చూడడం నీ పెళ్ళిలోనే” గట్టిగా అరిచాను.

నా చెంపలమీద జారుతున్న కన్నీళ్ళను చూడలేక తల తిప్పుకున్నాడు జయంత్.

బస్సు రేపిన దుమ్ము నన్ను పూర్తిగా కప్పేసింది.

* * *

తిలోత్తమ చెప్పడం పూర్తి చేసింది. ఆనంద విశాదాల్ మిశ్రమంలా కళ్లల్లో నీళ్ళు ఊరాయి. పైటతో కళ్ళు అద్దుకుని బలవంతంగా నవ్వడానికి ప్రయత్నించింది.

గోపాలకృష్ణ పరిస్థితి కూడా అదే. అతను ఆమె చెప్పినదానికి బాగా కదిలిపోయాడు.

“తిలోత్తమా! మీ ముగ్గురికి చేతులెత్తి నమస్కరించాలనిపిస్తోంది. ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిన మిమ్మల్ని తలుచుకుంటుంటే మానవజాతి మీదే గొప్ప ప్రేమ కలుగుతోంది. ఈ భావనల్ని ఇలాగే గుండెలో అణిచేసి, వాటి ఒత్తిడికి చిప్పిల్లే అనుభూతినంతా ఒంటరిగా అనుభవించాలనుంది” అన్నాడు.

“ఇక్కడికి వచ్చింది నాతో ఇంతకాలం నిక్షిప్తమైన ఆ అనుభవాన్ని చెప్పడానికే గోపాలకృష్ణా! నీతో గడిపి సిరిసంపదలను పొందాలన్న ఉద్దేశ్యం నాకు లేదు. మనుషుల మీద గొప్ప నమ్మకం, ప్రేమ వుండడంకంటే వేరే సిరిసంపదలున్నాయా! అవి పుష్కలంగా వున్న నాకు ఇక మీ అక్కరలేదు. నేను వస్తాను గోపాలకృష్ణా!”

ఇద్దరూ లేచి బయటికొచ్చారు.

వర్షం ఇంకా ఆగలేదు. చినుకులు జోరుగానే పడుతున్నాయి.

తెల్లవారుతోంది. నల్లటి ఆకాశం సిమెంట్ రంగులోకి మారుతోంది.

“వర్షం బాగానే పడుతోంది. నేను వచ్చి ఇంటి దగ్గర దిగబెట్టనా?”

“వద్దు”

“పోనీ గొడుగైనా తీసుకెళ్ళు”

1 Comment

  1. There is no new stories to post since 8th onwards.

Comments are closed.