నేను బాకీ వుంది ఆయనకే 3 76

ఇక్కడో, అక్కడో ఓ చోట కుదురుగా వుండు. గ్రహణం అప్పుడు బయటికి రాకూడదు.”

“అలానే.”

నేను సరస్వతి అవ్వ ఇల్లు చేరుకున్నాను. ఆమెకు ఎనభై ఏళ్ళు పైగానే వుంటాయి. నడుం పూర్తిగా వంగిపోయింది. కళ్ళు మసగ్గా కనిపిస్తాయి. అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి పడుకుంటూ వుంటాను గనుక అమ్మ కూడా ఎలాంటి సందేహం లేకుండా పంపింది.

నేను వెళ్ళేసరికి ఓమూల పడుకుని వుంది ఆమె.

లికిడి కాగానే “ఎవరూ?” అంది.

“నేనే”

గొంతుపట్టి కనిపెట్టింది. మళ్ళీ ముసుగుదన్ని పడుకుంది.

అది పెద్ద అడ్డాపిల్లు. ఓవార తడిక కట్టి వుంటుంది. దాంట్లో అవ్వ బట్టలు, ఓ పెద్ద చెక్కపెట్టె వుంటాయి. ఇవతల ఓ పెద్ద నులకమంచం వుంటుంది. దానిమీద పరుపు, రెండు దిండ్లూ వుంటాయి.

పరుపుమీద పడుకుని కాలక్షేపం కోసం తెచ్చుకున్న వీక్లీ తెరిచాను.

మరో పదినిముషాలకు సుధీర్ వచ్చాడు.

యధాప్రకారం అవ్వ “ఎవరూ?” అంది.

“సుధీర్ ని”

అవ్వ తిరిగి కళ్ళు మూసుకుంది.

ఆమెకు సరిగా కనిపించదని, సక్రమంగా వినిపించదనీ తెలుసు కాబట్టి సుధీర్ రాగానే నా పక్కన మంచంమీద కూర్చున్నాడు.

ఇంకా గ్రహణం ప్రారంభం కాలేదు కాబట్టి అటు ఎవరయినా వచ్చే ప్రమాదం వుందని ఠక్కున లేచి మంచానికి దగ్గరగా వున్న స్టూలుమీద కూర్చున్నాను.

ఇద్దరం ఏవేవో స్వీట్ నాన్సెన్స్ అంతా మాట్లాడుకుంటున్నాం.

మూడయ్యింది.