నేను బాకీ వుంది ఆయనకే 4 115

పెళ్ళి అయిన తొలిరోజుల్లో నా భర్త చాలా అందగాడని అనుకునే దాన్ని. కొంచెం పాతపడ్డాక ఆ భ్రమలన్నీ తొలగిపోయాయి. నీకు నేనైనా అంతే. ఇప్పుడు రంభలా అనిపించినదాన్ని రేపు రంగమ్మలా అనిపిస్తాను”
అతను నా మాటలకు అడ్డు తగిలాడు. “ఇవన్నీ సహజమైన విషయాలు. వీటిని అసహజంగా అనుకొని నిట్టూర్చడమే మనమంతా కామన్ గా చేసే తప్పు.”

“పోనీ అవన్నీ వదిలేద్దాం. రేపు నా భర్తకు ఇదంతా తెలిస్తే నువ్వు నన్ను ఏలుకుంటావా? నాకు నమ్మకంలేదు. అందుకు కారణం నువ్వు చెడ్డవాడివని కాదు, నీ పరిస్థితు.

బంగారంలాంటి భవిష్యత్తు వదులుకోలేవు. మాటలకేం వుంది? ఎన్నయినా చెప్పగలం. తీరా చేతలకొచ్చాక వెనకడుగు వేస్తాం. అంతెందుకు- నీకు చాలా ఇష్టమయిన జుట్టుని నాకోసం వదులుకుని బోడిగుండు చేసుకోగలవా? చేసుకోలేవు. ఎందుకంటే నీ జుట్టు నీకు చాలా అందం ఇస్తుంది కాబట్టి. అందువల్ల నన్ను ఇక మరచిపో, ఎప్పుడూ కలుసుకోవాలని ప్రయత్నించకు. నా మాట మన్నిస్తానని నమ్మకం” ఎంతో సీరియస్ గా చెప్పాను.

అతను ఏదో మాట్లాడాలన్న ప్రయత్నాన్ని అడ్డుకున్నాను. నా మాటల ఎఫెక్టు అలా కొనసాగాలంటే ఇక సంభాషణను పొడిగించకూడదు. అందుకే అక్కడ నిలబడి వున్న రిక్షాను రమ్మనమని సైగ చేశాను.

రిక్షావాడు పరుగు పరుగున వచ్చాడు.

అందులో ఎక్కి కూర్చుని ‘గుడ్ బై’ అని ముఖం తిప్పేసుకున్నాను. అతను బాగా షాక్ తినేశాడేమో శిలాప్రతిమలా చూస్తూ నిలబడిపోయాడు. నాకు కావాల్సింది కూడా అదే.

రిక్షా కదిలింది.

అతను ఇక రాడన్నది సుస్పష్టం. అంతగా నిలదీసి బెదిరిస్తే జంకని మగవాడు అరుదు. అందుకే భవిష్యత్తు గురించి భయంకరంగా చెప్పి హడల గొట్టేశాను. కానీ ఈ శూన్యాన్ని నేను భరించగలనా అన్న కొత్త అనుమానం కలిగింది. అయితే ఆ అనుమానం నిజం కాకుండా నేను చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంది.

నేనూ వూహించినట్టుగానే జయంత్ రాలేదు. ఈపాటికి అతనూ నన్ను భయంకరంగా తిట్టుకుని మరిచిపోయి వుంటాడనుకున్నాను.

రెండు రోజులు గడిచిపోయాయి.

మూడోరోజు మధ్యాహ్నం తిరిగి పిల్లల్ని స్కూలుకి పంపాక రెస్టు తీసుకుందామని అనుకున్నాను. మగతగా నిద్ర పట్టేసింది.

1 Comment

  1. There is no new stories to post since 8th onwards.

Comments are closed.