నేను బాకీ వుంది ఆయనకే 4 116

ఈ హఠాత్ పరిణామాన్ని ఊహించని ఆమె కళ్ళు మూసుకోక పోవడం వల్ల వసంతం కళ్లల్లో పడి మండింది. అయితే మంట కళ్ళల్లోనో, గుండెల్లోనో ఆమె తెలుసుకోలేకపోయింది.

పంతులమ్మమీద గోపాలకృష్ణ అలా వసంతాలు పోయడంతో జనం మొదట నిశ్చేష్టులై, ఆ తరువాత తేరుకుని చప్పట్లు చరిచారు.

ఈ శబ్దాలకు ధాన్య కళ్ళు తెరిచింది. తనమీద వసంతం పోయాలేదని గ్రహింపుకొచ్చి చుట్టూ చూసింది.

పచ్చగా, పసుపు కొమ్ములా మెరిసిపోతున్న వర్షను చూడగానే జరిగింది ఆమెకు తెలిసిపోయింది.

చుట్టూ చేరి చప్పట్లు చరుస్తున్న జనాన్నంతా ఓసారి చూసి వర్ష పైటకొంగును నోటికి అడ్డం పెట్టుకుని అక్కడనుంచి పరుగెత్తింది.

జీవితంలో మొదటిసారి ఆమె తన ప్రవృత్తికి విరుద్ధంగా అక్కడి నుంచి పారిపోయింది.

తను వసంతం పోయడంతో సిగ్గు ముంచుకొచ్చి ఆమె వెళ్ళి పోయిందనుకుని జీవితంలో మొదటిసారిగా అతనూ తప్పు చేశాడు. మరి ఈ పరిణామాల పర్యవసానం ఏమిటో కాలమే నిర్ణయించాలి.

అమ్మాయిలు ఒక్కొక్కరే వచ్చి గోపాలకృష్ణ మీద వసంతాలు పోస్తున్నారు నరుడు ఉత్సాహంగా గురువుగారికి జరుగుతున్న వసంతా భిషేకాన్ని చూస్తున్నాడు.

అంతలో గోపాలకృష్ణకు ఓ కొంటె ఆలోచన వచ్చింది. దాన్ని తలుచుకుంటుంటే తెలియని ఉత్సాహం రక్తాన్ని ఊపేస్తోంది.

అనాది ప్రేమికులంతా అతన్ని ముందుకు నెడుతున్నారు. అజ్ఞాత శక్తులు అతన్ని ప్రేరేపిస్తున్నాయి. ధైర్యం, అంతకంటే మించిన తెగువ మున్ముందుకు తోస్తున్నాయి. ఏదో ఉద్రేకం విచక్షణాజ్ఞానాన్ని మింగేసింది.

అంతే….. తనమీద వసంతం పోసి ఎదురుగా నిల్చుని నవ్వుతున్న అమ్మాయి చేతిలోని వెండి చెంబును లాక్కున్నాడు.

అలా నిలబడి బుద్ధిగా వసంతాలు పోసుకోవడమే తప్ప, ఎన్నడూ వసంతాలు ఎవరిమీదా పోయాని గోపాలకృష్ణ మొదటిసారి చెంబు చేతుల్లోకి తీసుకోవడంలో జనం ఉత్కంఠతో నిలుచుండిపోయారు. ఆ తరువాత అతను ఏం చేయబోతాడోనని రెప్పలు వాల్చకుండా చూస్తున్నారు.

గోపాలకృష్ణ నెమ్మదిగా నడిచి చెంబు ముంచాడు. ఎర్రటి వసంతం చెంబు నుంచి జారుతుండగా పైకి లాగాడు.

తల పైకెత్తాడు తనమీద పోయడానికే వసంతం నింపుకున్నాడని అంతకు ముందు అతని మీద వసంతాలు పోసిన స్త్రీలంతా ఎవరికి వారే అనుకుంటూ టెన్షన్ గా నిలబడి చూస్తున్నారు.

అయితే గోపాలకృష్ణ చూపులు ధాన్యవైపు ప్రసరించగానే జనం కీ ఇచ్చిన బొమ్మల్లాగా అటువైపు తలలు తిప్పారు.

ధాన్య అయితే చిన్నపిల్లలా కేరింతలు కొడుతోంది.

అతను నెమ్మదిగా అడుగులేస్తున్నాడు. ధాన్య మరికొంత ముందుకు వచ్చి నిలబడాలని అనుకుంది గానీ కాళ్ళు కదలడం లేదు.

అతను మరింత దగ్గరయ్యాడు.

వసంతం పోసుకోవడానికి ప్రిపేర్ అయిపోయిన ఆమె కళ్ళు మూసుకుంది. జనం బిర్రబిగుసుపోయి చూస్తున్నారు.

గోపాలకృష్ణ దాన్యను సమీపించి, పక్కకు ఓ అడుగువేసి చెంబు ఎత్తి వర్శపై కుమ్మరించాడు.

ఈ హఠాత్ పరిణామాన్ని ఊహించని ఆమె కళ్ళు మూసుకోక పోవడం వల్ల వసంతం కళ్లల్లో పడి మండింది. అయితే మంట కళ్ళల్లోనో, గుండెల్లోనో ఆమె తెలుసుకోలేకపోయింది.

పంతులమ్మమీద గోపాలకృష్ణ అలా వసంతాలు పోయడంతో జనం మొదట నిశ్చేష్టులై, ఆ తరువాత తేరుకుని చప్పట్లు చరిచారు.

ఈ శబ్దాలకు ధాన్య కళ్ళు తెరిచింది. తనమీద వసంతం పోయాలేదని గ్రహింపుకొచ్చి చుట్టూ చూసింది.

పచ్చగా, పసుపు కొమ్ములా మెరిసిపోతున్న వర్షను చూడగానే జరిగింది ఆమెకు తెలిసిపోయింది.

చుట్టూ చేరి చప్పట్లు చరుస్తున్న జనాన్నంతా ఓసారి చూసి వర్ష పైటకొంగును నోటికి అడ్డం పెట్టుకుని అక్కడనుంచి పరుగెత్తింది.

జీవితంలో మొదటిసారి ఆమె తన ప్రవృత్తికి విరుద్ధంగా అక్కడి నుంచి పారిపోయింది.

తను వసంతం పోయడంతో సిగ్గు ముంచుకొచ్చి ఆమె వెళ్ళి పోయిందనుకుని జీవితంలో మొదటిసారిగా అతనూ తప్పు చేశాడు. మరి ఈ పరిణామాల పర్యవసానం ఏమిటో కాలమే నిర్ణయించాలి.

గోపాలకృష్ణ నుంచి పిలుపు రావడంతో ధాన్యకన్నా ఆమె తండ్రి సంబర పడిపోయాడు. ఇక తనింట్లో ధనధాన్యాలకు లోటుండదని ఉప్పొంగి పోయాడు. కాలంతోపాటు జారిపోయిన సిరిసంపదలను తిరిగి పొందుతామన్న ఆనందం ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఇక ధాన్య అయితే ఒక్క క్షణం నింపాదిగా వుండలేకపోయింది. ఏ పని ముందు చేయాలో, ఏది వెనక చేయాలో తెలియనంత కన్ ప్యూజన్ లో పడిపోయింది. ఎప్పుడు రాత్రవుతుందా, గోపాలకృష్ణ కౌగిలిలో తన ఇరవై రెండేళ్ళ యవ్వనాన్ని ఆరపెడదామా అన్న ఆతృత ఆమెలో.

1 Comment

  1. There is no new stories to post since 8th onwards.

Comments are closed.