నేను బాకీ వుంది ఆయనకే 4 116

రామ చిలక గొరువనక బొమ్మ గీసి తెలుపనా
రాధ క్రిష్నుల వంక చెయ్యి చూపి తెలుపనా
చిరునవ్వుతొ తెలుపనా కొన చూపుతొ తెలుపనా
నీలునవిలి తెలుపన గొల్లు కొరికి తెలుపన తెలుపకనె తెలుపనా

కాలివెల్లు నెలమీద రాసి చూపన
నా చీర కొంగు తొతి వెలు చుత్తి చెప్పన
కూనలమ్మ పాతలొ రయబారమంపన
గాలికైన తెలియకుంద మాత చెవిని వెయన నాలొ ప్రానం నీవని..

ఇది తెలియని మన్ అర్జున్ ఎప్పటిలానె ఉన్నాడు……….
“ఏం గురుడా! ఎప్పుడూ ఏదో మూడ్ లో వుంటున్నావు? కొంపదీసి వర్షమ్మను ప్రేమిస్తున్నావా ఏమిటి? అనడిగాడు ఓ రోజు అర్జున్ .

దానికి అతని నవ్వే సమాధానమయింది. అతను చెప్పకపోయినా అర్జున్ కి తన గురుడి అవస్థంతా అర్థమయింది. గురువుగారి అవస్థను చూసి అతను ముసిముసిగా నవ్వుకుంటున్నాడు.

ప్రేమ అంతే “ఇదీ” అని చెప్పగలిగిన వాళ్ళెవరూ లేరు. ఎవరైనా వున్నారూ అంతే వాళ్ళు నిజమైన ప్రేమికులు కారు. నిర్వచనంలోకి ఇమడనిది ప్రేమ. ఇది ఏమిటో తెలియదు కాబట్టే ప్రేమికుల చేష్టలు పిచ్చివాళ్ళ పనుల్లా అనిపిస్తాయి. లేకుంటే వీధిలో నడవడానికే జంకుగా ఫీలయ్యే గోపాలకృష్ణ రోజూ సాయంకాలం వర్ష కనిపిస్తుందేమోనని వీధుల్లో పచార్లు ప్రారంభించాడు. ఎప్పుడయినా ఆమె కనిపించినప్పుడు రూపాన్ని కళ్ళల్లో ప్రతిష్టించుకునేవాడు.

ఆరోజు కూడా యధాప్రకారం నిద్రలేచి, ఓ స్థంభానికి జారిగిలబడి వర్ష రూపానికి అరమోడ్పు కన్నులతో ఫ్రేము కడుతున్నాడు. రక్తంలోని ఆమె అనుభూతులకు రంగులద్దుతున్నాడు. గుండెల్లోని ఆమెకు గుడి కడుతున్నాడు. మొత్తం శరీరమంతా పరుచుకున్న ఆమె ఊహలకు వూపిరి పోస్తున్నాడు.
ఊర్లోకి వెళ్ళిన నరుడు హడావుడిగా అక్కడికి వచ్చాడు.

“గురుడా! ఏమిటింకా స్నానం చెయ్యలేదా? అక్కడ ఊరి జనమంతా నీకోసం వెయిట్ చేస్తున్నారు. ఈరోజు దేవుడి ఊరేగింపు అన్నది గుర్తులేదా?” అని నాన్ స్టాప్ గా మాట్లాడాడు.

అప్పుడు గుర్తొచ్చింది గోపాలకృష్ణకు. ఆరోజు దేవుడి వూరేగింపు విషయం. తను వెళ్ళి మొదట దేవుడికి హారతి ఇవ్వందే వూరేగింపు పనులు ప్రారంభం కావు. అందుకే అక్కడినుంచి లేచి తయారవడం మొదలు పెట్టాడు.

మరో అరగంటకు ఇద్దరూ వూరిలోకి బయలుదేరారు.

వీళ్ళు వచ్చేసరికి రథం దగ్గర చాలామంది వున్నారు. గోపాలకృష్ణను చూడగానే జనంలో కలకలం మొదలయింది.

పంతులు ఎదురెళ్ళి ఆహ్వానించాడు.

“రండి, మీకోసమే చూస్తున్నాం. ఈరోజు సాయంకాలం వూరేగింపు. మదనకామరాజు వంశానికి చెందిన మీరు మొదట పూజాకార్యక్రమాలు నిర్వహిస్తే పనులు ప్రారంభమవుతాయి” అతి వినయంతో అంటూ అతన్ని రథం దగ్గిరికి తీసుకొచ్చాడు.

వీధి మొదట్లో వున్న రథం రకరకాల చిలుకలు వాలిన చెట్టులా వుంది. మొత్తం రథమంతా కడిగి శుభ్రం చేయడంవల్ల అది నీరెండలో ఇంద్రధనుస్సు చిట్లి ఆ రూపం ఎత్తినట్లుంది.

గోపాలకృష్ణను అక్కడ నిలబెట్టి పంతులు మంత్రాలు చదివి, ఓ పళ్ళెంలో కర్పూరం వెలిగించి, దాన్ని అతనికిచ్చాడు. హారతి అయిపోగానే తిరిగి పళ్ళాన్ని పంతులకిచ్చాడు. ఈ సమయం కోసం చూస్తున్న మంగళ వాయిద్యాలు ఒక్కసారిగా మోగాయి. పంతులు రథం ఎక్కాడు. దేవుడికి అలంకరణలు ప్రారంభించాడు.

ఊరేగింపు సాయంకాలం ప్రారంభమవుతుంది. అప్పటివరకు ఊరేగింపు ఏర్పాట్లు జరుగుతుంటాయి.

హారతి అయిపోగానే గోపాలకృష్ణ అక్కడినుంచి బయల్దేరాడు. వర్ష కనిపిస్తుందేమోనన్న ఆశ అతన్ని ముందుకు నడిపిస్తోంది ఆ వీధిలో పోకుండా మలుపు తిరిగితే తన ఇంటికి త్వరగా చేరుకోవచ్చు. కాస్త ఆలస్యమైన శివరామయ్య ఇంటిగుండా వెళదామని నిర్ణయించుకుని అటు అడుగులు వేశాడు.

1 Comment

  1. There is no new stories to post since 8th onwards.

Comments are closed.