నేను బాకీ వుంది ఆయనకే 4 116

వాడి వివరాలడుగుతూ మా వీధిలోకి వచ్చాం. మరో పదడుగుల దూరంలో మా ఇల్లు వుందనగా వాడిని ఆపి “అదిగో ఆ ఎల్లో పెయింట్ వేసిన అపార్టుమెంటులోనే మా ఇల్లు నెంబర్ ఫైవ్. ఫస్ట్ ఫ్లోర్ రైట్ లో వేసిన అపార్టుమెంటులోనే మా ఇల్లు నెంబర్ ఫైవ్. ఫస్ట్ ఫ్లోర్ రైట్ లో ఉంటుంది. నేను వెళ్ళిన పావుగంటకు వచ్చేయి. నీకోసం తలుపులు తెరిచే వుంచుతాను” అని చెప్పాను.

నా ప్లాట్ ను చేరుకొని వాడు వచ్చేలోపు చేయాల్సిన కొన్ని పనులు పూర్తి చేశాను. స్నానం చేసి బట్టలు మార్చుకుని హాల్లోని సోఫాలో కూర్చున్నాను.

ఖచ్చితంగా పావుగంట తరువాత వచ్చాడు.

లోపలంతా చీకటిగా వుండడంతో వాడు తాత్కాలికంగా అంధుడై పోయాడు.

“బాబూ” స్వీట్ గా పిలిచాను.

“ఇదేమిటి ఏమీ కనిపించడం లేదు. కరెంట్ లేదా?”

“ఆఁ మా ప్లాట్ లోనే కరెంట్ పోయినట్లుంది. మరేం ఫర్వాలేదు గానీ నేను చెప్పినట్లు అడుగులు వెయ్ నేరుగా హాల్లోకి వచ్చేస్తావు.”

వాడు ద్వారం దగ్గరే కదులుతున్నట్లు మసగ్గా కనిపిస్తున్నాడు.

“అలానే ఒకడుగు ముందుకు వెయ్- ద్వారం దాటేస్తావు. ఆఁ అట్లాగే ముందుకు వెరీ నైస్ బాయ్. ఆఁ ఆగు- పక్కకి తిరిగి జస్ట్ టూ స్టెప్స్.”

వాడు నేను చెప్పినట్లే అడుగులు వేశాడు.

“అక్కడ చేత్తో తడుము కుర్చీ తగుల్తుంది. సిక్తుసెన్స్ ఉందన్నావు కదా నువ్వు ఈజీగానే ప్రొసీడ్ కాగలవు.”

వాడు గుడ్డివాడిలా చేతులతో తడిమి కుర్చీలో కూర్చున్నాడు.

“ఇక్కడెందుకు మళ్ళీ? నువ్వెక్కడున్నావో చెబితే అక్కడికే వచ్చేస్తాను” అసహనంగా అన్నాడు.

మళ్ళీ వర్షం మొదలయినట్లు చప్పుడు. ప్రపంచమే పెద్ద కాటుక దబ్బీలా వుంది.

“అంత తొందరయితే ఎలా? శృంగారంలో స్పీడ్ పనికిరాదు. బొత్తిగా అనుభవం లేనివాడే తొందరపడేది. నువ్వు చాలా ఎక్స్ పీరియన్స్ వున్నవాడివి కదా. అందునా నువ్వు ఆడపిల్లను దూరం నుంచి చూసే ఫ్యామిలీ గర్లో, బిచ్చో చెప్పగలిగిన ప్రతిభావంతుడివి. నువ్వు నా మాట వినకుండా ముందుకు వచ్చావంటే అంతే సంగతులు. కిందంతా గాజు ముక్కలున్నాయి. అవి గుచ్చుకుంటే అంతా రసాభాసవుతుంది.”

“గాజుముక్కలా?”

“ఆఁ ప్లవర్ వేజ్ ఇప్పుడే పగిలిపోయింది. భూదేవి అద్దాల చీర కట్టుకున్నట్లు అవి పరుచుకున్నాయి.”

“పెద్ద చిక్కే.”

“అవును. అందుకే నేను లేవమన్నప్పుడు లేచి వచ్చేయి.”

వాడు ఏమీ మాట్లాడలేదు. అదోరకమైన యిబ్బందివల్లే వాడికి నోట మాట రావడం లేదని తెలుసు.
“మరి స్టార్ట్ చేద్దామా?”

ఆ మాటకు ఠక్కున లేచాడు వాడు. శబ్దాలనుబట్టి వాడు లేవడాన్ని గుర్తించాను.

“లేవకు చెప్పానుగదా. నువ్వు లేచి అడుగులు వేస్తే గాజుముక్కలు శత్రువుల్లా నీ పాదాల్ని చీరేస్తాయని.”

అతను అయిష్టంగానే తిరిగి కూర్చున్నాడు. నేను ఎందుకలా ప్రవర్తిస్తున్నానన్న పజిల్ వాడి ముఖాన్ని వికారంగా ఉబ్బిస్తోందని నాకు తెలుసు.

“నువ్వక్కడే- నేను ఇక్కడే- నువ్వు నేను చెప్పింది వినాలి తప్ప మరేం చేయకూడదు. రామా ఈజ్ ఏ గుడ్ బోయ్ అన్నట్లు నువ్వు కూర్చోవాలి. మరి స్టార్టు చేయనా?”

అతను వూపిరి బిగపట్టాడు.

1 Comment

  1. There is no new stories to post since 8th onwards.

Comments are closed.