నేను బాకీ వుంది ఆయనకే 4 116

ఆ పౌర్ణమిరోజున శివరామయ్య ఇంట్లో జరుగుతున్న హడావుడినంతా వర్ష ఆశ్చర్యంతో గమనిస్తోంది.

కేవలం ఓ మూఢనమ్మకంతో తమకు సిరిసంపదలు కలిసొస్తాయని పెళ్ళికాని తన కూతుర్ని పరపురుషుడితో రాత్రి గడపమని పంపిస్తున్న శివ రామయ్యను చూస్తుంటే ఆమెకు జాలి కలిగింది. ఈ దురాచారాన్ని ఎలా రూపుమాపాలో తెలియడంలేదు. ఏదో పెద్ద ఉద్యమమో, దీర్ఘకాలిక ప్రణాళికో, లేక ఏదో జరగరానిది జరిగితేనో తప్ప దీనికి పుల్ స్టాప్ పెట్టడం కుదరదని కూడా ఆమెకు అర్థమైంది.

అప్పటికీ ఉండబట్టలేక శివరామయ్యను పిలిచి ఇదంతా మూఢాచారం తప్ప మరేమీ కాడని చెప్పబోయింది. ఆమె నోరు తెరిచి చెప్ప బోయేంతలో ఆయన అడ్డు తగిలి- “నువ్వేమీ చెప్పకమ్మా! ఈరోజు వినే మూడ్ లేదు. రేపటినుంచి ఈ ఇంట్లో శ్రీలక్ష్మి కాలిగజ్జెల రవళి వినిపించబోతోంది. సిరిసంపదలు పొంది మమ్మల్ని ముంచెత్తబోతున్నాయి” అంటూ ట్రాన్స్ లో వున్నట్టు మాట్లాడాడు.

ఇక తనేమీ చేయలేననిపించి స్కూలు కెళ్ళింది.

సాయంకాలం తిరిగొచ్చేసరికి ధాన్య పెళ్ళికూతురిలా ముస్తాబై వుంది.

ఆకుపచ్చ రంగు పట్టుపావడా, ఓణీలో ఆమె అచ్చు పంటచెలులూ పచ్చ పచ్చగా వుంది. తలమీద పెట్టుకున్న సూర్యవంక, చంద్రవంక ఆభరణాలు ఆ చేలమీద వాలిన బంగారు గువ్వల్లా వున్నాయి. జడ కుచ్చులున్న జడ నీటికాలువలా అద్భుతంగా వుంది. నడుముకున్న వడ్డాణం బంగారు తీగలతో పంటచేల చుట్టూ వేసిన కంచెలా వుంది. పాపిట మీద నుంచి సాగి ముఖంమీదకి జారిన పాపిటబిళ్ళ, బావినుంచి నీళ్ళు తోడడానికి వేసిన బంగారు ఏతాంలా వుంది. కాళ్ళకున్న వెండిగజ్జెలు చేస్తున్న శబ్దాలు, పొలాల్లో అలసటను మరిచిపోవడానికి కూలీలు పాడుతున్న జానపద గీతాల్లా విన్పిస్తున్నాయి.

వర్షను చూస్తూనే ఆమె “వర్షా! రా!” అంటూ ఆహ్వానించింది.

ఏమీ మాట్లాడకుండా తన గదిలోని వచ్చింది వర్ష. అచ్చు పెళ్ళి కూతురిలా తయారైన దాన్యను చోడగానే ఏదో బాధ మనసును పిండు తూంటే అలానే తన బెడ్ మీద వాలిపోయింది. అమ్మవారికి బలి ఇవ్వడానికి మేకను అలంకరించిన దృశ్యం కళ్ళముందు కదలాడింది. మేకకు, ధాన్యకు ఏమీ బేధం కనబడడం లేదు. ఒకటి ప్రాణం పోగొట్టుకుంటే, ఇంకొకటి మానం కోల్పోతుంది తేడా అంతే.

చీకట్లు చిక్కబ్దే కొద్దీ చంద్రుడు అదే నిష్పత్తిలో వెలుగులు విరజిమ్ము తున్నాడు. లోకమంతా మల్లెపూలను పరిచినట్టుంది వెన్నెల.

భోజనం చేశాక, కాసేపు రెస్ట్ తీసుకుని బయల్దేరింది ధాన్య.

కొండ దగ్గరికి వచ్చేసరికి కాళ్ళు తడబడ్డాయి. గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది.

కొండ ఎక్కడం ప్రారంభించింది. రెండు అడుగులు వేసిందో లేదో తన ఓణీ దేనికో తగిలి వెనక్కి లాగినట్లు అనిపించడంతో ఠక్కున ఆగింది.

వెనక్కి తిరిగి చూస్తే ఎదురుగ్గా గోపాలకృష్ణ.

చప్పున సిగ్గు ముంచుకొచ్చి తల వాల్చిందిగానీ, కళ్ళు మాత్రం కిందకు చూడడం లేదు. వెన్నెల్లో మెరిసిపోతున్న అతన్ని చూడాలన్న తహతహ కళ్ళను వాలనివ్వడంలేదు.

“దండకం గొప్పతనం ఏమిటో తెలుస్తోంది. దేవత ప్రత్యక్షమవగానే భక్తుడు దండకం ప్రారంభిస్తాడు. ఆ పదాలు చక్కటి సమాసాలు- అందులోని లయ- ఆ ఒడుపు చాలా వుంటాయి. భావోద్వేగాన్ని ప్రకటించేందుకు దండకం మంచి ప్రక్రియ. అందుకే నాకిప్పుడు దండకం చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే అచ్చు దేవతలా కనిపిస్తున్నావు కాబట్టి” అతను ఆమె చుబుకాన్ని పైకి లేపి చెప్పాడు.

ఆ చిన్న పొగడ్త ఆమెలో పెద్ద సంచలనాన్నే కలిగిస్తోంది. అంతే కాకుండా అతని స్పర్శ ఆమె యవ్వనాన్ని మొదటిసారిగా నిద్ర లేపింది. ఏవో ప్రకంపనలు అలల్లా రక్తంలో కదులుతున్న భావన.

ఆమె అలంకరణను కింద నుంచి పైవరకు ఓసారి పరిశీలించాక “ఈ అలంకరణలో నువ్వు దేవతలా వున్నా- ఇంత అలంకరణ ముందు ముందు ఇబ్బంది పెడుతుంది. శృంగారంలో మనమీద ఎంత తక్కువ బట్టలుంటే అంత ఎక్కువ సుఖం లభిస్తుంది” అని చిన్నగా నవ్వాడు.

ఆమె ఏమీ మాట్లాడలేదు.

“వస్తనంటే పడి ఛస్తాను కాళ్ళకాడ- అని ఆత్రేయ నీలాంటి పిల్లను చూసే రాసుంటాడని నాకనిపిస్తోంది”

1 Comment

  1. There is no new stories to post since 8th onwards.

Comments are closed.