నేను బాకీ వుంది ఆయనకే 4 116

నాలోని మార్పులను అతను గమనించినట్టు లేడు. “ఏ ఊరు?” అతనే మళ్ళీ అడిగాడు.

నేను అతనివైపు పరిశీలించి చూశాను. దాదాపు ఇరవై అయిదేళ్ళ వయసుంటుంది. తెల్లటి ఫ్యాంటుమీద గళ్ళ షర్టు టక్ చేసుకున్నాడు. లేత ముఖంలో ఏదో క్రూరత్వం తోడేలుపిల్ల పచ్చగడ్డిలో కదలాడుతున్నట్టు కనిపిస్తోంది.

నేను సమాధానం చెప్పలేదు.

నా చేతిలోని నవలను చూసి “అయ్యయ్యో! పుస్తకం తడిసిపోతోంది. ఇంతకీ ఏం నవల?” అంటూ నా ముఖం మీదకి వంగాడు.

వ్యవహారం శ్రుతిమించుతూ వుందని నాకు అర్థమైంది.

“నవల పేరు చెప్పకపోతే పోనీలెండి- ఇంతకీ రేటెంత?” అని ప్రశ్నించాడు.

“పాతిక” అన్నాను అతన్నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ.

“పుస్తకం రేటు కాదు నీ రేటు?”

ఒక్కసారిగా అతనిమీద పడి గొంతు కొరికేద్దామన్న ఆవేశం వచ్చింది. ఎలానో తమాయించుకున్నాను.

“నువ్వు ఎంత పాతివ్రత్యం నటించినా అసలు విషయం నాకు తెలిసిపోయింది. నువ్వు రేతున్న మనిషివని నా సిక్తుసెన్స్ చెప్పింది.”

కోపంతో నేనెక్కడ పగిలిపోతానేమో ననిపించింది. ఆ సిక్తుసెన్స్ అనేపదం అంతే నాకు ఎలర్జీ. ఈ మధ్య చాలా నవలల్లో ఈ పదం దొర్లుతుండడం దానికి కారణం. వాడు అలాంటి చీప్ నవలలు చదివే ఆ పదం నేర్చుకుని వుంటాడని నా నమ్మకం.

“ఎంతయినా ఫరవాలేదు. రాత్రికి అయిదు వందలయినా సిద్ధమే” అన్నాడు గొంతు తగ్గించి.

వాడు జీవితంలో స్త్రీవైపు చూడకుండా గట్టిగా బుద్ధి చెప్పాలనుకున్నాను.

“నేనలా అనిపిస్తున్నానా?” అని అడిగాను నవ్వును ముఖంలో పులుముకుంటూ.

“ఖచ్చితంగా అలా కాదుగానీ ఫ్యామిలీ టైప్ అనుకున్నాను.”

“భలే కరెక్టుగా చెప్పారే.”

“అదే మరి ఈ చిట్టిబాబు స్పెషాలిటీ. అర కిలోమీటరు దూరం నుంచి చూసైనా ఏ పిల్ల ఎలాంటిదో చెప్పగలను” కాలర్ ఎగరేశాడు.

“మీ రేటుకు ఓ.కే. కానీ చిన్న రిక్వెస్టు. హోటల్ కు గానీ, మరెక్కడికిగానీ వద్దు. మా ప్లాట్ సేఫెస్ట్ ఫ్లేస్ ఓకేగదా” అన్నాడు.

“అలానే”

“అయితే అదిగోండి బస్సు” అంటూ కిందకు ఉరికాను.

నా వెనకే వాడు చొంగకార్చుకుంటూ కుక్కలా వెనకపడ్డాడు.

బస్సులో నాపక్కనే కూర్చోబోతే “వద్దు ఎవరైనా చూస్తే బాగోదు. అటెళ్ళి కూర్చో” అన్నాను.

వాడు ఇబ్బందిగానే పక్క సీటు దగ్గరికి కదిలాడు.

మా కాలనీ రాగానే ఇద్దరం దిగాం.

1 Comment

  1. There is no new stories to post since 8th onwards.

Comments are closed.