నేను బాకీ వుంది ఆయనకే 4 116

అతడు ఆమె లేవకుండా తన మీదకు లాక్కుని రెండు చేతులతోనూ పొదివి పట్టుకుని “ఎప్పుడైనా ఓపెనింగ్ సెలబ్రేషన్ చూశావా?” అని అడిగాడు.

అప్పుడు ఆ ప్రశ్న వినడం దేనికో నాందిలా అనిపించి- “ఆఁ స్కూలు బిల్డింగ్ కోసం కట్టిన కొత్త గదిని ప్రారంభించారు చూశాను” అంది.

“ఏం చేశారక్కడ?”

“చేయడానికేముంది గది ముందు కట్టిన రిబ్బన్ ను డి.ఇ. ఓ. కత్తిరించాడు. చుట్టూ చేరిన వాళ్ళంతా చప్పట్లు చరిచారు- దట్సాల్.”

“అంటే ప్రతి ప్రారంభోత్సవానికీ రిబ్బన్ లాంటి అడ్డు వుంటుంది కదా.”

“ఎందుకిదంతా ఇప్పుడు?” ఆమె అడిగింది.

“ఊరకనే” అని మరింత దగ్గరికి లాక్కున్నాడు.

ఆ ప్రశ్న అడగడానికి అదెలా సమయమూ, సందర్భమూ అయిందో ఆమెకు అర్థం కాలేదు.

మొదటగా అతను ఆమె కళ్ళను ముద్దు పెట్టుకున్నాడు. వెన్నెలను మబ్బు మూసినట్టు ఓ క్షణం ఆమెకి ఏమీ కనబడలేదు. తరువాత చూస్తే వెన్నెల్లో తను దేదీప్యమానంగా వెలిగిపోతున్నట్టనిపించింది.

అతను అలానే కిందకు దిగుతున్నాడు. అదేదో దేవాలయంలో రాతిని మీటితే సప్తస్వరాలూ వినిపించినట్టు ఒక్కో అవయవం మీద ముద్దు పెడుతూంటే ఒక్కో రకమైన పులకరింత రక్తాన్ని గిలకొడుతోంది.

ఆమె తన అస్తిత్వాన్ని అతనిలో వెదుక్కుంటున్నట్టు గట్టిగా హత్తుకుంది.

అతను ఆమెను పూర్తిగా ఆక్రమించుకున్నాడు.

ఆమెకు ఎక్కడో అనీజీగా వుంది. గుర్రం ముందుకు వెళ్ళకుండా మొరాయిస్తుంటే జాకీలో కలిగే అనీజీ అది.

“ఇప్పుడు నీకు ఇష్టమైన పదం ఏదైనా ఒకటి చెప్పు” అడిగాడు అతను సడెన్ గా.

ఆమె ఒక్కక్షణం ఉలిక్కిపడి అతను ఏం అడిగాడో మననం చేసుకుని “వెన్నెల” అంది.

అదే నన్నడిగితే ఏం చెప్పేవాడినో తెలుసా? సెక్స్”

ఆమెకు ఒక్కసారిగా రక్తమంతా గిలకొట్టినట్లనిపించింది.

ఈ ప్రశ్నకు అది సందర్భం ఎలా అయిందో ఆమెకు తెలియలేదు. అదే అడిగింది.

“పిల్లలకు ఇంజక్షన్ చేసేటప్పుడు నొప్పి తెలియకుండా వాళ్ళ మైండ్ ని డైవర్ట్ చేయడానికి “ఇదిగో చాక్ లెట్” అన్నట్లు నిన్నూ డైవర్ట్ చెయ్యడానికి ఆ ప్రశ్న అడిగాను” అన్నాడు.

ఆమెకి అప్పటికీ అర్థం కాలేదు.

సరిగ్గా ఆ సమయంలోనే అతను తనకు కావాల్సింది సాధించుకున్నాడు.

“నీకు హేమటో ఫోబియా లేదు కదా?” అని అడిగాడు.

“అంటే?”

“రక్తాన్ని చూసి భయపడడం.”

“ఉహూఁ” తల అడ్డంగా వూపింది.

ఉన్నట్లుండి ఆ ప్రశ్న ఎందుకు వేశాడో తెలియలేదామెకు. కానీ మరుసటి రోజు ఉదయం స్నానం చెయ్యడానికి బాత్రూమ్ లో బట్టలు విప్పుతున్నప్పుడు తెలిసింది తనకు హెమటో ఫోబియా వుందో లేదోనని అతను ఎందుకడిగాడో

అమావాస్య-

చుట్టూ చీకటి గట్టకట్టినట్లుంది. ఆకాశం మసి పేలికలా వికారంగా వుంది. గాలి శవాలు మంకువాసనను మోసుకెళుతున్నట్లు అదో విధమైన వాసన పరచుకుని వుంది. చలి ముసుగు దొంగలా మధ్య మధ్య శరీరాన్ని తాకుతోంది.

1 Comment

  1. There is no new stories to post since 8th onwards.

Comments are closed.