నేను బాకీ వుంది ఆయనకే 4 116

“ఇంత తెల్లవారిపూట వర్షంలో తడిసి చాలా రోజులైంది” అని అడుగు ముందుకు వేసింది.

ఎంతో ఆరాధనతో ఆమెవైపు చూస్తూండిపోయాడు అతను.

‘కళ్ళు మూసినా నీవాయె, కళ్ళు తెరిచినా నీవాయె’ అన్నట్లుంది గోపాలకృష్ణ పరిస్థితి. ఒకప్పుడయితే అలాంటి పాటలను వింటూ నవ్వుకునే వాడు. సినిమా పాటల్లో ప్రేయసిని ప్రియుడు, ప్రియుడ్ని ప్రేయసి పొగుడుకోవడం తప్ప ఏమీ లేదనుకునేవాడు. అవి అసహజంగా కూడా వున్నాయని భావించేవాడు. కానీ ఇప్పుడు తన అభిప్రాయం తప్పు అని తెలుసుకున్నాడు.

ప్రేమించనంతవరకు మన పరిధి విశాలంగా వుంటుంది. ఎవరినైనా ప్రేమిస్తే మన పరిధి చాలా కుంచించుకుపోతుంది. ప్రేమించిన వ్యక్తే ప్రపంచమైపోతుంది. ప్రపంచమే ప్రేమించిన వ్యక్తిగా దర్శనమిస్తుంది. ఈ కారణంవల్లనే ప్రేమికులు మిగిలిన ప్రపంచానికి అంధులైపోతారు.

చిన్నగాలి తన శరీరానికి తాకినా అది ప్రియురాలి స్పర్శలా అనిపిస్తుంది. కనిపించే పచ్చటి కొండలే తన ప్రేయసి కట్టుకున్న చీర అంచు మీద డిజైన్ లా అనిపిస్తుంది. ఎక్కడో దూరంగా వినిపించే పాట తన అవస్థను చూసి గంధర్వుడు చేసే ఆలాపనలా అనిపిస్తుంది. ఒక్కో రకమైన పువ్వు అ ప్రేయసి ఒక్కో అవయవానికి ప్రతీకలా అనిపిస్తుంది.

ప్రేమికుడు అనుభవించే అద్వైత స్థితి ఇది.
గోపాలకృష్ణ వీటికి అతీతుడేం కాదు. పైపెచ్చు భావుకుడు కనుక ఈ స్థితిలో మరింత మమైక్యత పొందుతున్నాడు.

తన కనురెప్పల మీదే వర్ష కాపురం పెట్టేసినట్టుంది అతడికి. అందుకే కనురెప్ప మూస్తే ఆమె తన కళ్ళలోని రెటీనా మీద ప్రతిబింబిస్తున్నట్లు భ్రమపడుతున్నాడు. తను పీల్చే గాలిలో ఆమె అస్థిత్వపు పరిమళం కలిసిపోవడం వల్ల తన ఊపిరితిత్తుల్లో అంత అలజడి కలుగుతూ వుందని భావిస్తున్నాడు.

“వర్ష” అనే రెండు అక్షరాలు తప్ప మరో అక్షరాన్ని తనకు అయ్యవారు నేర్పించలేదేమోనని అనుమానం పడుతున్నాడు.

ఉదయం కలల దుప్పటిని తొలగించగానే అతనికి ఆమె వెచ్చ వెచ్చగా గుర్తుకొస్తుంది. పెరట్లో చెట్టుచేమల్ని నిద్రలేపుతున్న నీరెండలో ఆమె పచ్చపచ్చగా గుర్తుకొస్తుంది. ఇంటిముందు కొప్పంతా పూలు తురుముతున్న తురాయి చెట్టును చూస్తుంటే ఆమె ఎర్రెర్రగా గుర్తుకొస్తుంది. భగవంతుడు కాలు మోపడానికి అక్కడక్కడా తివాచీలను పరచినట్లుండే పంట చేలను చూస్తుంటే ఆమె వెర్రి వెర్రిగా గుర్తుకొస్తుంది. కన్ను చేస్తున్న ఇంద్రజాలంలా అనిపించే ఆకాశంవెపుఇ సారించినప్పుడు ఆమె పిచ్చిపిచ్చిగా గుర్తుకొస్తుంది.

ఏ అర్థరాత్రో ఒంటరిగా కూర్చుని వున్నప్పుడు సన్నజాజుల పరిమళాన్ని గాలి నెత్తిమీద కుమ్మరిస్తున్నా పట్టించుకోకుండా ఆమెకు తన రక్తంతో ఉత్తరం రాయాలనీ, ఆమె నడిచే దారివెంట పాదాలు కంది పోకుండా నందివర్ధనం పూలు పరవాలనీ, ఆమె కనుపాపల్లో దృశ్యంగా ఇమిడిపోవాలనీ, ఆమె పెదవులమీద ఎప్పటికి వాడిపోని చిరునవ్వుల దండలా వేలాడాలనీ ఇలా ఏవేవో ఆలోచిస్తున్నాడు అతను.

ఇక్కడ మనకు తెలియని విషయం ఎంటి అంటె వర్ష మన అర్జున్ ఇష్టపడుతుంది…..అర్జున్ మన చంటి సినిమాలొ వెంకి లా అందరికి సహాయపడుతు జీవితం గడిపెవాడు….ఆఖరికి మన వర్షకు కూడ టౌనులొ ఎమి కావలి అన్నా తెచ్చి ఇచ్చెవాడు…మన గొపాలక్రిష్నా కారియర్ కూడా తీసుకొని పొయెవాడు…….ఇలా అందరి ఆదరాభిమానాలు అతి తక్కువ కాలములొనె చురగొనాడు మన వర్ష తో కలిపి ,ఇప్పటి వరకు అమె వెంటె అందరు పడ్డారు కాని మొదటి సారి ఒక మగవాడు తనను ఇబ్బంది పెడుతున్నాడు……..కాని అది ఎలా చెప్పాలొ తెలియని పరిస్థితి…….తన మనస్సులొ ఈ పాట మొదలైంది……………

ఎల ఎల ఎల ఎల
ఎలా తెలుపను యెదలొని ప్రెమను మ్రుదువైన మాతను
గాలిలొన వెలితొతి రాసి
చూపన నెల మీద సిగ్గుముగ్గు వెసి చూపన
వాలు జదల కాగితాన
విరజాజుల అక్షరాలు పెర్చి కూర్చి చూపనా

1 Comment

  1. There is no new stories to post since 8th onwards.

Comments are closed.