నేను బాకీ వుంది ఆయనకే 4 116

ఇల్లు దగ్గరవుతుంటే రక్తప్రసరణ హెచ్చింది. గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది.

మెల్లగా అడుగులేస్తూ ఇంటివైపు చూశాడు.

కిటికీ పక్కన కూర్చున్న ఆమెను చూడగానే ఓ క్షణంలో వెయ్యోవంతు ఆగిపోయాడు.

ఎవరో గొప్ప చిత్రకారుడు ఆమె చిత్రం గీసి రంగులు ఆరడానికి కిటికీకి వేలాడదీసినట్లుంది.

నీలం ఆకాశం ముక్కను కత్తిరించి కిటికీగా చేసి. మధ్యలో చందమామ అతికించినట్లనిపించింది.

సముద్రపు నీళ్ళమీద పడ్డ సూర్యకాంతి అల్లా ఫ్రీజ్ అయినట్లని పించింది.

ఆమె రూపం కళ్ళల్లో రంగుల వలయాలను సృష్టిస్తుంటే మెల్లగా అక్కడి నుంచి కదిలాడు.

తను కనుపించగానే అతనిలో కలుగుతున్న మార్పులను ఆమె గమనించింది. అయితే అతని గురించి ఓ క్షణం సేపైనా ఆలోచించడం ఇష్టం లేని ఆమె తిరిగి పుస్తక పఠనంలో మునిగిపోయింది.

అతను ఇంటికి చేరుకున్నాడు.

నరుడు మాత్రం రథం దగ్గరే ఆగిపోయాడు. జనంలో కోలాహలాన్ని వదలి ఒంటరిగా అడవిలో తపస్సు చేసుకుంటున్న ఋషిలా వుండే తన గురువుగారి ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు.

పిల్లలంతా తలస్నానాలు చేసి, చక్కగా ముస్తాబై వీధుల్లో పడ్డారు. స్త్రీలు ఇళ్ళంతా అలికి, శుభ్రం చేస్తున్నారు. మగవాళ్ళు రథం దగ్గరికి, ఇంటి దగ్గరికి తిరుగుతూ హడావుడిగా వున్నారు.

ఊరిలోని యువకుల్లో కొందరు వీధికి ఇరువైపులా గుంజలు నాటుతున్నారు. మరికొందరు వాటికి రంగు కాగితాల తోరణాలు కడుతున్నారు. మల్లాం నుంచి వచ్చిన గ్రామ్ ఫోన్ గొంతు సవరించుకుంటూ వుంది.

పూజారి ఆదేశాలిస్తుంటే కొందరు రథాన్ని పూలమాలలతో అలంకరిస్తున్నారు.
ఇలా మన అర్జున్ కూడ పనులలొ బిజి ఐపొయాడు ఆకలి కూడ మరిచిపొయి,,,,,,,చెమట తడిచిపొయిన చొక్కా విప్పి అలా బనియన్ తొ పని చెస్తుంటె అక్కడ వాళ్ళు గుడ్లు అప్పగించి కండలు తిరిగినా మన అర్జున్ బాడీని చుస్తు చొంగా కార్స్తునారు ఇది గమనించినా వర్ష….తనకు ఒక టవల్ కప్పింది…ఎంటి ఇలా అందరి ముందరా షర్ట్ విప్పి ఎక్స్పొసింగ్ అంది,,,ఎవరైనా చుస్తె దిష్టి తగుల్తుంది అంటుంది వర్ష,,,,మన వొంటి దిష్టి గిష్టీ ఎమి తగలదు అంటాడు అర్జున్………ఇలా మాటల్లొ అతని వంక చుస్తు ఈ లోకాని మర్చిపొయింది….మన అర్జున్ చిటికెసి పిలిచెంతవరకు ఈ లోకం లోకి రాలేదు …….ఇలా అతనిని ఇంటికి బలవంతముగా పిలుకొని వెళ్ళీ వొడ్డిచింది……….

సాయంకాలం నాలుగు గంటలకే వాతావరణం మారిపోయింది. ప్రతి ఇంటిముందూ నీళ్ళు చల్లి ముగ్గులు పెట్టారు. నీటి చెమ్మమీద తేలుతున్న ముగ్గులు ముత్యాలను ఆరబెట్టినట్లున్నాయి. ఎర్రమట్టి గీతలతో అలరారుతున్న ఇళ్ళు అందమైన పావురాళ్ళు పెట్టుకున్న గూళ్ళలా వున్నాయి.

వీధి మధ్యలో వేలాడుతున్న మామిడాకుల తోరణాలు ఆకాశం మెడలోని పచ్చల హరాల్లా మెరిసిపోతున్నాయి గ్రామ్ ఫోన్ రికార్డు లోంచి వినిపిస్తున్న భక్తకన్నప్పలోని సినిమా పాట గ్రామం చేత నృత్యం చేయిస్తున్నట్లుంది.

సాయంకాలం అయిదు గంటలకి ఊరేగింపులోని మొదటి భాగం వసంతోత్సవం ప్రారంభమవుతుంది. రథం ముందు అటూ ఇటూ రెండు పెద్ద బిందెల్లో వసంతం కలుపుతారు.

వసంతం అంతే నీళ్ళల్లో పసుపు, సున్నం కలిపితే వచ్చేదే. గ్రామస్తులు ఆ నీటిని చెంబుల్లోకి తీసుకుని తమకు ఇష్టమైన వాళ్ళమీద చల్లడమే వసంతాలు పోసుకోవడం. ఈ ఘట్టం ప్రారంభం అయిన తరువాత ఊరేగింపు జరుగుతుంది. ఎదుటి వ్యక్తి మీదున్న ఇష్టాన్ని ఇలా వసంతాలు పోయడం ద్వారా గ్రామస్తులు వ్యక్తపరుస్తారు. చాలా ఉత్సాహంగా, అంతకంటే ఉద్రేకంగా జరుగుతుంది ఇది. తమకు ఇష్టమైన వ్యక్తి ఎక్కడున్నా వెదికి పట్టుకుని వసంతం పోస్తారు. అప్పటికే చాలామంది యువకులు చెంబులు తీసుకుని రథం దగ్గర తయారైపోయారు.

1 Comment

  1. There is no new stories to post since 8th onwards.

Comments are closed.