నేను బాకీ వుంది ఆయనకే 4 116

వెంకట్రామయ్యా, పులిరాజు శ్మశానం నుంచి వస్తున్నారు.

“ఒక్కక్షణం ఆలస్యాన్ని కూడా భరించలేను. ఎంత తొందరగా గోపాలకృష్ణ పతనానికి ముహూర్తం పెట్టేస్తే అంత మంచిది” పులిరాజు కసిగా చెప్పాడు.

“అలానే కానీ దానికి సమయమూ సందర్భమూ వుండాలి. సన్నడిగితే దానికి మంచి ముహూర్తం ముందుంది. అదెప్పుడో నేను చెబుతాను. మన పథకం సజావుగా సాగి వాడు వీధుల్లో పడాలంటే మనం అన్నీ పకడ్బందీగా అమలు చేయగలగాలి. ఊరికి వాడిమీదున్న విశ్వాసం అంత తొందరగా పోదు. వాళ్ళ విశ్వాసాన్ని దెబ్బ తీయాలంటే మనం గట్టిదెబ్బ కొట్టగలిగాలి.”

“అది నిజమే. దేవుడిలా పూజించేవాడిని దెయ్యంగా చెప్పాలి. ఊరు ఊరంతా వాడ్ని రాళ్ళతో కొట్టి తరమాలి.”

“అందుకే గదా మనం ఇంత ఆలోచించేది. మనం ఏ మాత్రం లీక్ అయినా జనం మన భరతం పడతారు. అందుకే ఆచీ తూచీ అడుగు వేయాలి. ఎంత ఆలోచించినా మన పథకంలో లొసుగులు కనబడడం లేదు. దీనికి మనం సూత్రధారులమైతే, ఇక పాత్రధారులు మనకు కావాలి. ఇందులో సహాయపడేందుకు మూడో వ్యక్తి అవసరం” ఆగాడు వెంకట్రామయ్య.

“ఆ వ్యక్తి ఎవరు? మన పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేయగల వ్యక్తి ఎవరు?”

“ఉంది……”

ఆ వ్యక్తి ఎవరో వినడానికి పులిరాజు చెవులను రిక్కించాడు.

“మోహన….” కొంతసేపు ఆగి తిరిగి చెప్పాడు వెంకట్రామయ్య.

“అవును. ఆమే సరైన వ్యక్తి. మనమీద అభిమానమూ, గోపాలకృష్ణ మీద అసహ్యమూ వున్న వ్యక్తే దానికి ఒప్పుకుంటుంది. గోపాలకృష్ణ మీద ఆమెకు ఎలాంటి ద్వేషం లేకపోయినా మనమీద అభిమానం వుంది చాలు. డబ్బు ఎర చూపించి ఆమెను బుట్టలో వేసుకోగలగాలి.”

“దీనికి ఆమె ఒప్పుకుంటుందా?” పులిరాజు అనుమానంగా అడిగాడు.

“ఒప్పించాలి.”

ఇద్దరూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళుంటూ నడుస్తున్నారు.

“మనకు విజయం కలిగించమని క్షుద్రదేవతలను పూజించాం కదా. ఇక గోపాలకృష్ణ పతనం అట్టే దూరంలో లేదు. మోహన మనం వెళ్ళేసరికి ఇంటికి వచ్చి వుంటుంది. ఆమెను ఒప్పిస్తే ఇక మనం చేయాల్సిన పని ఏమీ వుండదు. అన్నీ వాటంతటవే జరిగిపోతాయి” వెంకట్రామయ్య నిశ్శబ్దాన్ని చీలుస్తూ అన్నాడు.

“ఇదంతా త్వరగా జరగాలి. మొన్న వసంతాల రోజు అమ్మాయిలు చివరికి పునర్వసు కూడా వాడిమీదే వసంతాలు కుమ్మరించింది, అది తలుచుకున్నప్పుడంతా ఒళ్ళు భగ్గున మండిపోతోంది”

“అవును. ఊరులో ఏ ఫంక్షన్ జరిగినా వాడి చేయి మొదట పడాలి. రథం కదలాలంటే కూడా వాడు వచ్చి మొదటి హారతి ఇవ్వాలి. చివరికి కీలెరిగి వాత పెట్టాలి. ఇకనుంచీ ఈ ఊరికి నేనే రాజు కావాలి. పూటకు గతిలేనివాడు వంశాన్ని అడ్డం పెట్టుకుని రాజభోగాలు అనుభవిస్తాడా! అందుకే మనం ఆ పథకం వేసింది.”

“అవునూ! వాడేమిటి- చివరలో రెచ్చిపోయి టీచరమ్మమీద వసంతాలు పోశాడు” పులిరాజు సడన్ గా అడిగాడు.

“అదే నాకూ అర్థం కావడంలేదు. వాడు ఆ పిల్లమీద మనసుపడి వుండాలి. లేకుంటే ఊరి జనం అంతా చూస్తూ వుండగా అంత డేర్ గా వసంతాలు పోయడు. బహుశా ప్రేమిస్తున్నాడేమో….”

“నాకూ అదేననిపించింది. కానీ వాడు ప్రేమించేదేమిటి! ఒకరోజు వాడుకుని వదిలేస్తాడు.”

“అంతే….. అంతే…..”

ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు.

అమావాస్య-

చుట్టూ చీకటి గట్టకట్టినట్లుంది. ఆకాశం మసి పేలికలా వికారంగా వుంది. గాలి శవాలు మంకువాసనను మోసుకెళుతున్నట్లు అదో విధమైన వాసన పరచుకుని వుంది. చలి ముసుగు దొంగలా మధ్య మధ్య శరీరాన్ని తాకుతోంది.

వెంకట్రామయ్యా, పులిరాజు శ్మశానం నుంచి వస్తున్నారు.

“ఒక్కక్షణం ఆలస్యాన్ని కూడా భరించలేను. ఎంత తొందరగా గోపాలకృష్ణ పతనానికి ముహూర్తం పెట్టేస్తే అంత మంచిది” పులిరాజు కసిగా చెప్పాడు.

“అలానే కానీ దానికి సమయమూ సందర్భమూ వుండాలి. సన్నడిగితే దానికి మంచి ముహూర్తం ముందుంది. అదెప్పుడో నేను చెబుతాను. మన పథకం సజావుగా సాగి వాడు వీధుల్లో పడాలంటే మనం అన్నీ పకడ్బందీగా అమలు చేయగలగాలి. ఊరికి వాడిమీదున్న విశ్వాసం అంత తొందరగా పోదు. వాళ్ళ విశ్వాసాన్ని దెబ్బ తీయాలంటే మనం గట్టిదెబ్బ కొట్టగలిగాలి.”

“అది నిజమే. దేవుడిలా పూజించేవాడిని దెయ్యంగా చెప్పాలి. ఊరు ఊరంతా వాడ్ని రాళ్ళతో కొట్టి తరమాలి.”

1 Comment

  1. There is no new stories to post since 8th onwards.

Comments are closed.