నేను బాకీ వుంది ఆయనకే 3 76

గ్రహణం ప్రారంభమైంది. అయితే అందరూ చెప్పింట్లు చీకట్లు కమ్ము కోలేదు. ఎండ తీక్షణత బాగా తగ్గింది. అంతేగాక ఎండలో ఏదో మార్పు వచ్చింది. కొలిమిలో బంగారును కరగబెడుతున్నట్లు ఎండ బంగారు రంగులోకి మారిపోయింది.
ద్వారం దగ్గరికి వచ్చి చూశాను.
వీధిలోగానీ, ఇళ్ళ బయటగానీ ఒక్కరూ కనిపించలేదు. అందరూ తలుపులు బిడాయించుకుని లోపల వుండిపోయారు.

నేనూ లోపలికి వచ్చి తలుపు కొద్దిగా మూసాను.

ఇక భయంలేదని సుధీర్ పక్కన కూర్చున్నాను.

అవ్వ తలుపువైపు తిరిగి పడుకోవడం వల్ల ఆమె వీపు మాకు కనిపిస్తోంది.

నేను తగులుతుండడంతో సుధీర్ ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. మనసు మరేదో కోరుకుంటున్నట్లు ఏదో సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నాయి.

“ఏమిటీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావ్?” అని అతని అవస్థ చూసి కిలకిలా నవ్వాను.

“నీలాంటి అందమైన అమ్మాయిని పక్కన వుంచుకుని ఊరకనే వుంటే పిచ్చి పట్టకుండా వుంటుందా?”

“ఏం కావాలి?”

అతను నావైపు తిరిగాడు. కళ్ళు కోరికతో ఎర్రగా చెర్రీస్ పళ్ళలా తయారయ్యాయి. శ్వాస బరువుగా వదలడంవల్ల ఛాతీ ఎగిరెగిరి పడుతోంది.

“ప్లీజ్! ఒకసారి ముద్దు పెట్టుకుంటాను” అభ్యర్థిస్తున్నట్లు అడిగాడు.

సుధీర్ చాలా సెన్సిటివ్ గనుక అలా ప్రతిదానికీ పర్మిషన్ అడుగుతాడు. నిజానికి అలాంటప్పుడు ఆడపిల్లను పర్మిషన్ అడగకూడదు. మరీ అబ్జెక్షన్ చెప్పేవరకు తనపని తాను చేసుకుపోవడం ఉత్తమం.

నేను మౌనంగానే వుండిపోయాను.

నా ముఖం ప్రసన్నంగా వుండటంతో మౌనం అంగీకారమణి గ్రహించి నా తలను పూర్తిగా రెండుచేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు.

మొత్తం నా శరీరం మధురంగా కంపించింది.