నేను బాకీ వుంది ఆయనకే 3 76

పడుకున్నాను గానీ నిద్ర పట్టడంలేదు. ఏవేవో ఆలోచనలు ఇలా అతనితో కంటిన్యూ చేస్తే ఏమౌతుందో తెలుస్తూనే వుంది. ఈ కలుసు కోవడాలూ, మాట్లాడుకోవడాలూ, ఉత్తరాలు, ఫోన్ సంభాషణలూ ఇంత వరకే నాకు కావాలి. ఆ తరువాత ఇష్టంలేదు. కానీ ఇవన్నీ ఒక మగవాడి దగ్గర నుంచి రావాలంటే అతను కోరుకున్నది అతని ఇచ్చెయ్యాలి.

మరి రోజంతా థ్రిల్లింగ్ ఇచ్చే ఇత్తరాలు, ఫోన్ సంభాషణల కోసం నన్ను అతనికి అర్పించుకోవాలా? లేక అర్పించుకోవడం ఇష్టంలేక ఇవన్నీ వదులుకోవాలా? అన్న సంఘర్షణ ప్రారంభమైంది నాలో. నాలుగు గంటల తర్వాత కూడా ఏమీ నిర్ణయించుకోలేకపొయాను.

నెక్ట్సుడే కరెక్టుగా చెప్పిన టైమ్ కి వచ్చాడు. ఆయన ఆఫీసుకు వెళ్ళారు. పిల్లలు స్కూలుకి వెళ్ళిపోయారు. వరండాలో కాకుండా హాల్లో కూర్చున్నాం.

కాఫీలయ్యాక మా బెడ్ రూమ్ వైపు చూస్తూ ‘మీ శృంగార సామ్రాజ్యం అదేనా?’ అని అడిగాడు నావైపు నవ్వుతూ చూస్తూ.

చాలారోజులు అలా నన్ను చూస్తూ దూరంగా కూర్చోడని నాకు తెలిసిపోతోంది. ఏదో జంకు, భయం, కాస్తంత సంస్కారం- ఎగిసే అతని అవయవాలకు కళ్ళెం వేస్తోందే తప్ప మనసు మాత్రం వాంఛతో కాలిపోతున్న విషయం అర్థమౌతూ వుంది.

వరండాలోంచి హాల్లోకి వచ్చిన అతను బెడ్ రూమ్ లోకి దూకడానికి అట్టేకాలం పట్టాడని బోధపడింది.

అతని వయసు అలాంటిది. ఆకలితో వున్నవాడు అతను. ఆకలి తీరినదాన్ని నేను. ఆ డిఫరెన్స్ మా చేష్టల్లోనే బయటపడుతోంది. ఆ ఒక్క విషయాన్నీ అవాయిడ్ చేయాలనుకుంటున్నాను. అలా నేను ప్రవర్తిస్తే ఈ థ్రిల్ అంతా ఎక్కడ అదృశ్యమౌతుందో నన్న భయం నాలో.

‘రోజూ దానిమీద మీరెన్ని సుఖాలు అనుభవిస్తున్నారో కదా’ నా మీద పిచ్చి మొదలైందని అతని మాటలే చెబుతున్నాయి.

‘అలాంటి మాటలు నిషిద్ధం. నేను పెళ్ళయినదాన్ని; అన్నాను ముక్తసరిగా.

వెన్నెల్లో నన్ను చూడాలని అంత రాత్రిపూట దాదాపు ఏడెనిమిది కిలోమీటర్లు నడిచి వచ్చిన అతని తో నిర్దయంగా ప్రవర్తించానేమోనన్న గిల్టీనెస్ నిద్రను దూరం చేసింది. ఇక ఎంతోకాలం ఈ టెన్షన్ ను భరించ లేననిపించింది. అతనితో సంబంధం కొనసాగించాలో, పుల్ స్టాప్ పెట్టెయ్యాలో నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. కానీ ఎంత టైమ్ అయినా ఓ నిర్ణయానికి రాలేకపోయాను.

* * *

మరో రెండు రోజులు కూడా చంద్రగిరికి వెళ్ళలేదు. అతనూ రాలేదు. అతన్ని మరిచిపోవాలని వేరే పనుల్లో ఎంగేజ్ అయ్యాను.

మూడోరోజు పిల్లలు మామయ్యని చూడాలని పోరుపెట్టారు. సరేనని అన్నాను. నాకూ వెళ్లాలని వుందా?

మేం వెళ్ళేసరికి జయంత్ లేడు. మిగిలిన మిత్రులు మాత్రం వున్నారు. అతను లేకపోవడం వెలితిగా అనిపించింది. కానీ అదీ ఒకందుకు మంచిదేనని సర్దిచెప్పుకున్నాను.

కాసేపు అన్యమనస్కంగానే గడిపి ఏడున్నర ప్రాంతానికి బయల్దేరాము. పిల్లలు రైలుకి పోదామని మారాం పెట్టారు. వాళ్ళను తీసుకుని రైల్వేస్టేషన్ కి నడిచాను.

రైల్వేస్టేషన్ లో కరెంట్ లేదు. సిగ్నల్ లైట్లు కొరివిదెయ్యాల్లా కనిపిస్తున్నాయి. మసక వెలుతురులో స్టేషన్ గత శతాబ్దపు వాకిట వున్న ఇనుపగేటులా వుంది.

పిల్లల్ని చేతులతో పట్టుకుని వెయిట్ చేస్తున్నాను జయంత్ ఎందుకు రాలేదో తెలియడం లేదు. బహుశా ఫ్రెండ్స్ తో ముందులా కలవడం లేదేమో.