నేను బాకీ వుంది ఆయనకే 3 76

“మీతో మాట్లాడాలి” నా వెనకే పరుగెత్తుతూ చెప్పాడు.

“ఏం మాట్లాడాలి?”

“చాలా”

“చాలా కుదరదు. ఎందుకు నన్నిలా విసిగిస్తావ్? ఎవరయినా చూశారంటే నా పరువు గోవిందా. నా భర్తకు తెలిస్తే నన్ను ఇంట్లోంచి తరిమేస్తాడు. ఆ తరువాత నా గతేం కాను?”

“ఈ జీవితానికి నేను బాధ్యత వహిస్తాను. అంత జరిగితే మిమ్మల్ని నేను పెళ్ళి చేసుకుంటాను” నిశ్చయంగా చెప్పాడు.

నేను ఠక్కున ఆగాను. ఇక దీనికి ఇంతటితో పుల్ స్టాప్ పెట్టకపోతే చాలా దూరం పోతుందని గ్రహించాను.

“ఇప్పుడు అలానే అంటావ్. కానీ రేపు మన సంబంధాలు బయట పడితే నువ్వు సులభంగా తప్పించుకుంటావ్. ఇదెక్కడి పీకులాట అని తేలుకుట్టిన దొంగలా నోరు మెదపవ్.

నువ్వు ఇంకా పెళ్ళికాని వాడివి. నాకు పెళ్ళయింది. ఇద్దరు పిల్లలు కూడా వున్నారు. నువ్వు సంఘానికి వెరవకుండా నన్ను పెళ్ళి చేసుకోగలవా? నీ జీవితాన్ని త్యాగం చేయగలవా? నీవల్లకాదు. పది రాత్రులయ్యాక నేనంటే నీకు మోహం మొత్తుతుంది. పశ్చాత్తాపం ప్రారంభమవుతుంది