నేను బాకీ వుంది ఆయనకే 3 76

“జాకెట్ వరకు ఫరవాలేదు. మరో పదినిముషాలకు ఆరిపోతుంది. చీరతోనే ఇబ్బంది. నీ లుంగీ ఇవ్వు. దాన్ని కట్టుకుని చీరను ఆరేస్తాను.”

“లుంగీ, జాకెట్ కాంబినేషన్ బావుండదు. లుంగీ, జుబ్బా తొడుక్కో. కాకపొతే ఒక్కటే చిక్కు” అని కొంటెగా చూస్తూ ఆగాడు.

“చిక్కేమిటి?”

“జుబ్బా వేసుకుంటే నీ నడుం మడతలు కనబడవు. గొప్ప చిక్కే గదా!”

“అల్లరి మాని లుంగీ జుబ్బా ఇవ్వు.”

అతను నవ్వాపుకుంటూ తన లుంగీ, జుబ్బా ఇచ్చాడు. ఆమె అటు తిరిగి చీర, జాకెట్ విప్పి లుంగీ, జుబ్బా వేసుకుంది.

ఆ డ్రస్ లోనూ ఆమె అదిరిపోతోంది. నడుం మడతలు తరువాత ఆమెలో గొప్ప అందమైన భాగం ముక్కు. మన్మధదేవుని విల్లులా వుంటుంది.

బట్టలు మార్చుకోవడంతో శరీరం వేడెక్కింది. గోపాలకృష్ణ మంచంమీద కూర్చుని కిటికీ వంక చూశాడు. వర్షం చప్పుడు, చీకటిని భయపెట్టడానికి ఎవరో డప్పుల మీద కొడుతున్నట్టుంది.

తిలోత్తమ అతనికెదురుగా పద్మాసనం వేసుకుని కూర్చుంది.

“కొండమీద ఊరికి దూరంగా పద్మాసనం వేసుకుని కూర్చుంది.

“కొండమీద ఊరికి దూరంగా ఇలా ఇల్లు కట్టుకోవాలనుకున్న ఆలోచన వచ్చిన మీ తాత- ముత్తాతలను అభినందించాల్సిందే” అంది కిటికీకి తన చూపులను వేలాడదీస్తూ.

“నిజమే. మా ఇల్లు మరో ప్రపంచంలో వున్నట్లుంటుంది. రాత్రి పూట అలా వరండాలో కూర్చుంటే పైన అక్షత్రాలు, కింద వూర్లోని దీపాలు కనిపిస్తూ మనం రెండు చుక్కల ప్రపంచాల మధ్య వున్న అనుభూతి కలుగుతుంది.”

“మీ శిష్యుడి గురక రాత్రిపూట పహారా కాస్తున్నట్లు వినిపిస్తూ వుందే” అంది నవ్వుతూ, అతనూ నవ్వాడు.

“ఎవరు కన్నబిడ్డో, ఇంతకాలం ఎక్కడెక్కడో తిరిగి ఇక్కడ సెటిల్ అయిపోయాడు” అన్నాడు వేదాంతంగా.

“జీవితం అంటే అదే. ఎప్పుడు ఏ విధంగా అది మలుపు తిరుగుతుందో చెప్పలేం. టౌనులో మా ఇంటి పక్కన ఓ అమ్మాయి వుండేది.

న్యూలీ మేరీడ్. తన స్నేహితురాల్ని మొగుడు వదిలేశాడని, మరో స్నేహితురాలు ప్రేమ ఫెయిల్ కావడంతో పెళ్లి మానేసిందని, తను ఒక్కతే అదృష్టవంతురాలనీ, చక్కటి భర్త దొరికాడని చెప్పింది. నాతో చెప్పిన మరుసటిరోజే ఆమె భర్త ఆఫీసు నుంచి వస్తూ స్కూటర్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఇరవై నాలుగు గంటల్లో ఆమె ‘ది మోస్ట్ ఎఫెక్ట్ డ్ విక్టిమ్’ అయిపోయింది. తన స్నేహితురాళ్ళందరిలోకి దురదృష్టవంతురాలై పోయింది. జీవితం అంటేనే ఓ ముసుగు దొంగ. అది ఎప్పుడూ మనల్ని దెబ్బతీయాలనే పోంచుకుని వుంటుంది” ఆమె డీప్ గా కలిదిపోతూ చెప్పింది.