నేను బాకీ వుంది ఆయనకే 3 77

వాళ్ళు వచ్చేసారనిపించి వర్ష తలదించింది.

ఆ క్షణంలో ఆమెను చూసిన అర్జున్ ఒక్కక్షణం అలా నిలుచుండి పోయాడు.

ఆమెలోని ఏదో తెలియని ఆకర్షణకు మంత్రముగ్ధుడై కళ్ళు ఆర్పాలన్న సంగతి కూడా మరిచిపోయాడు. ఏ స్త్రీని చూసినా కలగని అదో రకమైన రసస్పందన మొదటిసారిగా కలిగింది అతనిలో. కొత్త అలజడికి లోనయ్యాడు.

అంతవరకు ఏ స్త్రీతో పరిచయంలేని అబ్బాయి మనసుపడ్డ అమ్మాయిని తొలిసారిగా క్లోజప్ లో చూసినట్టు అతను చూస్తున్నాడు.

దీన్ని గమనించిన ధాన్య “గోపాలకృష్ణా! ఆమె వర్ష. మన స్కూల్లో టీచర్” అని పరిచయం చేసింది.

అతను ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి పడ్డట్టు అటూ ఇటూ కదిలి నమస్కారం పెట్టాడు. ఆమె కూడా రెండు చేతులూ జోడించింది.

“ఇతను గోపాలకృష్ణ. మా ఊరి హీరో ఇతనే. మదనకామరాజు వంశానికి చెందిన ఏకైక పురుషుడు” ధాన్య వర్షవైపు తిరిగి చెప్పింది.

అతను ఎవరో తెలియడంతో కమ్మిటపురుగు మీదపడ్డట్టు ఆమెలో జుగుప్సలాంటి భావమేదో కలిగింది. అయితే దానిని ఎక్స్ ప్రెస్ చేయకుండా భావరహితంగా చూస్తున్నట్టు వుండిపోయింది.

ధాన్య గోపాలకృష్ణతో అవీ ఇవీ మాట్లాడి చివరగా “మరిక సెలవిప్పించండి మహాశయా! అవతల నా మిత్రురాలు వెళదామన్నట్లు కళ్ళలో అర్థిస్తోంది. ఇంతకీ కృష్ణుడి దయ ఈ గోపిక మీద ఎప్పుడో” అంటూ చిలిపిగా కన్ను గీటింది.

అతను నవ్వుతూ కనుమరుగయ్యే వరకు అతను అక్కడనించి కదలలేక పోయాడు.

అటు తరువాత ఇద్దరూ ముందుకు సాగారు.

తన గురువుగారు ఏదో ఆలోచనలో వున్నారని గ్రహించిన నరుడు మౌనంగా వెంట నడుస్తున్నాడు.

కొంతసేపటికి సడన్ గా గోపాలకృష్ణ “నరుడా! నువ్వు ఇంతకు ముందు ఓ ప్రశ్న వేశావ్ డానికి ఇప్పుడు సమాధానం చెబుతున్నాను. ప్రేమకీ, దేవుడికీ సామీప్యత ఏమిటని కదూ నువ్వు అడిగావ్.”

“అవును గురుడా!”