నేను బాకీ వుంది ఆయనకే 2 88

అప్పటికి పాలు పితకటం పూర్తిచేసి ఆమె ద్వారం దగ్గర నిలబడి వీధిలోకి చూస్తోంది.

ఆమె అక్కడ వుండడం దూరం నుంచే కనిపెట్టాడు పులిరాజు. తిరిగి గుండె వేగంగా కొట్టుకుంటోంది. శరీరంలో ఇలా అసంకల్పిత మార్పులు గోచరించడమేనా ప్రేమంటే అనుకున్నాడు.

ఖచ్చితంగా ఇంటిముందు ఆగి ఆమెవైపు చూశాడు. నిజానికి ఆ సమయంలో తన ముఖంలో ప్రస్పుటమవుతున్న ఫీలింగ్స్ ఏమిటో తెలియడం లేదు. అయితే తను ఆమెను చూసి నవ్వుతున్నట్టు మాత్రం తెలిసింది.

ఆమెలో ఏదో అర్థంకాని కన్ ప్యూజన్. రోజులాగే అర్థం కానట్లు మొహం పెట్టి ఏమైనా చెబుతాడేమోనన్నట్టు చూసింది.

అతను అక్కడ నుంచి కదలలేదు.

“మీ నాన్న వున్నాడా?” అని అడిగాడు. ఎప్పుడూ లేనిది తన గొంతు వణకడం తెలుస్తూనే వుంది/

అన్ని రోజులూ తను కనిపిస్తూనే గుడ్లప్పగించి చూస్తూండే అతను అప్పుడు మాట్లాడటంతో ఆమె తడబడింది. ఆమె అవస్థ అంతా గుర్తించిన అతను మరోసారి అడిగాడు.

“లేడు. పొలం వైపు వెళ్లాడు.”

“మీ అమ్మ?”

“అమ్మ కూడా పొలం వెళ్ళింది”

ఇక ప్రశ్నించాల్సిందీ ఏమీ లేనట్లు అతను ఇంట్లోకి నడిచాడు. బసపుటెద్దు ఆవులున్న దొడ్లోకి వచ్చేస్తుంటే తరమడానికి ధైర్యం చాలని చిన్నపిల్లలా చూస్తుండిపోయింది.

“ఏం కావాలి?” తన దగ్గరికి దూసుకొచ్చిన అతనివైపు భయంగా చూస్తూ అడిగింది.

అతని రిహార్సల్స్ లో అటువంటి ప్రశ్న లేదు. అందుకే సమాధానం తట్టలేదు.

“అదీ… అదీ” అంటూ అక్షరాలు చూస్తూ నమిలాడు.

ఆమె ఏమీ మాట్లాడకుండా చూస్తూ నిలబడింది.

అతని కళ్ళలో ఏదో అభ్యర్థన లీలగా కదుల్తోంది. పెదవులు ఏదో జపింఛడానికన్నట్లు గుటకలు వేస్తోంది. ఇన్నిరోజులూ తనలో దాచుకున్న భావనలను బయటకు వెల్లడించేందుకు గుండె పిచ్చిదానిలా కొట్టుకొంటోంది.

“నువ్వు కావాలి” కళ్ళు కూడా ఆర్పకుండా చెప్పాడు. ఒక్కసారి ప్రకృతి అంతా ఫిట్స్ వచ్చి పడిపోయినట్టు స్తంభించిపోయింది ఇద్దరికీ.

అతను ఏం అడిగాడో చప్పున అర్థంకాలేదామెకు. అర్థమయ్యాక తన మనసేమిటో అర్థం కాలేదు. లోపలంతా తనను తరచి చూసినట్టు ఆమె కళ్ళను వాల్చింది. తిరిగి తల పైకెత్తింది. ఇక తప్పదన్నట్టు అతను కళ్ళు ఆర్చుతున్నాడు గానీ లేకపోతే చూపును అలా నిలబెట్టేవాడు.

“నేను నిన్ను ప్రేమిస్తున్నాను.”

మొదట చెప్పింది ఆమెకు బోధపడిందో లేదో నన్న అనుమానంతో మళ్ళీ మాటలను మార్చి చెప్పాడు.

ఒక ప్రేమికుడు లోనయ్యే భ్రమలకు అతను లోనవుతున్నాడు. అందువల్ల తిరిగి మాటలను మార్చి చెప్పాడు.

ఒక ప్రేమికుడు లోనయ్యే భ్రమలకు అతను లోనవుతున్నాడు. అందువల్ల తిరిగి మాటలను మార్చి చెప్పాడు.

ఒక ప్రేమికుడు లోనయ్యే భ్రమలకు అతను లోనవుతున్నాడు. అందువల్ల తిరిగి మాటలను మార్చి చెప్పాడు.

ఆమె అప్పటికే సర్దుకుంది.

1 Comment

  1. మంచి కధగా చాలా బాగా వ్రాసారు.
    Keep it up sir.

Comments are closed.