నేను బాకీ వుంది ఆయనకే 2 87

అంతలో తొలిభక్తురాలిగా ఓ ముదుసలి వచ్చింది. ఆమెకి డెభ్బై ఏళ్ళ పైమాటే. వస్త్తోనే పైటను బొడ్లో దోపుకుని గర్భగుడి ముందు నిలబడి రెండు చేతులూ జోడించింది. పంతులు ఆమెను చూశాడు.

ఆమె ఎద అంతా ఎండిపోయి, ఒకప్పుడు వయసుతో మిడిసిపడ్డ ఆ చోటు ఇప్పుడు కాలం మీద పోరాడి అలిసిపోయి డస్సిపోయినట్లు కనిపించాయి.

యవ్వనవంతులైన స్త్రీలు వస్తే ఒక బాధ. వయసుపైబద్ద వాళ్ళు వస్తే మరో బాధ. ఆమె ఎదను చూడగానే పంతులుకి జీవితం మీద మమకారం సగం చచ్చిపోయింది.

అట్లా మెరిసి మాయమయ్యే ఈ శరీరం మీద ఎందుకంత మమకారం అనిపిస్తుంది. తుచ్చమైన కోర్కెలను తీర్చుకోవడానికి మనిషిపడే తపనంతా అజ్ఞానమన్న వేదాంతం పట్టుకొస్తుంది. స్త్రీ పురుషుల మధ్య నున్న ఆకర్షణ, సంబంధాలు- ఇవన్నీ నీచమైనవిగా తోస్తాయి. ఎప్పుడో ఒకప్పుడు గాలిలో కలిసిపోయే ప్రాణం మీద తీపి, శుద్ధదండగన్న ఫిలాసఫీ మనసుకి వార్థక్యాన్ని ప్రసాదిస్తుంది. ఇలాంటి భావనలతో కుదేలైపోయాడతను.

దేవుడికి హారతి ఇచ్చి దానిని ఆమె ముందు వుంచాడు. ఆమె కళ్ళతో హారతిని అద్దుకుంది. తీర్థప్రసాదాలు ఇవ్వగానే వెళ్ళిపోయింది.

మరో అరగంటకు ఓ అవివాహిత యువతి వచ్చింది. ఆమె దేవాలయంలో లోపలికి రాగానే పైట తీసే సన్నివేశాన్ని పంతులు కళ్ళు పెద్దవి చేసి చూశాడు. అంతకు ముందు వృద్ధురాలు వచ్చినప్పుడు కలిగిన వేదాంతం అంతా ఆమె పైట అందాల ముందు వృద్ధురాలు వచ్చినప్పుడు ఎగిరిపోయింది.

ప్రపంచాన్ని ధిక్కరించి ముందుకు దూసుకువచ్చినట్టున్న ఆమె యవ్వన సిరులు అతని మనసులో తుఫానులు రేపుతున్నాయి. ఆ గుండ్రనితనం మనసుని ముద్దలా చేసి ఎక్కడో కోర్కెల సుడిగుండంలో గిరవాటేస్తోంది. ఆ ఎత్తులు శరీరాన్ని సుతిమెత్తగా కోస్తున్నాయి.

‘రా దమ్ముంటే అనుభవించు! అర్థం లేని సంశయాలు వద్దు’ అని అవి పిలుస్తున్నట్టు వున్నాయి. ‘రేపు స్వర్గ నరకాలు వున్నాయో లేవో ఎవరికి తెలుసు. వయసున్నప్పుడే అందాలను నీ స్వంతం చేసుకో” అని అవి బోధిస్తున్నట్లే అనిపిస్తోంది.

ఇలా రెండు రకాలయిన వేదాంతాల మధ్య పాపం అతను ఎప్పుడూ నలిగిపోతుంటాడు. అందుకే ఏనుగులా వుండేవాడు పీనుగులా అయిపోయాడు.

ఆ అమ్మాయికి తీర్థప్రసాదాలిచ్చి పంపించి వేశాడు. మోహన పనులన్నిటినీ ముగించుకుని వెళ్ళిపోయింది.

భక్తులు వస్తే వాళ్ళకి తీర్థప్రసాదాలు ఇవ్వడం, భక్తులు లేని సమయంలో అక్కడే ఓ స్తంభానికి జారిగిలబడి కూర్చోవడం నిత్యకృత్యం.

అలా మధ్యాహ్నం అయింది.

బావి దగ్గరికి వెళ్ళి అన్నం ఉడకబెట్టుకున్నాడు. సాంబారు తయారయ్యాక భోజనం చేశాడు.

బాగా అలిసిపోవడం వల్ల శరీరం విశ్రాంతి కోరుకుంటోంది. దేవాలయంలోకి వచ్చి తలకింద ఉత్తరీయాన్ని వుంచుకుని పడుకున్నాడు. నిద్ర కనురెప్పల్ని మూస్తూ వుండగా ద్వారం దగ్గర అలికిడైంది. కళ్ళు విప్పి చూశాడు.

మోహన అతన్ని చూస్తూ “ఏమిటి పంతులు! నిద్రా? భోజనం అయిందా?” అంటూ లోపలికి వచ్చింది. పైట తీసిబొడ్లో దోపుకుని అతని దగ్గరగా నిలబడింది. ఎవరో తన నరాలను కసికొద్దీ లాగి వదిలనట్టు అతను ఓసారి కుదుపిచ్చాడు. ఆమె ఎద కాంక్షలను రేపుతున్న తేనెతుట్టెలా వుంది.

అతనికి నిద్ర రావటం లేదు. కోరిక శరీరాన్ని మండిస్తోంది. కానీ ఆచార వ్యవహారాలు అంతకంటే అతన్ని ముందుకు సాగనివ్వవు. “ఈ సమయంలో ఎందుకు వచ్చావిక్కడికి?” తడబడుతూ ప్రశ్నించాడతను.

ఆమె మరో స్తంభం దగ్గరికి వెళ్ళి శుభ్రం చేసుకుని పడుకుంది. తలకింద పైటను వుండలా పెట్టుకుంది.

“ఏం చేయను పంతులూ! ఆ ఇంట్లో వేడి, ఉక్క, హాయిగా బట్టలిప్పేసి నీళ్ళల్లో తొంగోవాలనిపిస్తూ వుందనుకో. కానీ గాలి అయినా ఆడుతుందని పైటతీస్తే చచ్చినోడు- అదే నా మొగుడు పైనబడి పోతాడు.

1 Comment

  1. మంచి కధగా చాలా బాగా వ్రాసారు.
    Keep it up sir.

Comments are closed.