నేను బాకీ వుంది ఆయనకే 2 88

అతను ఆమెను గాఢంగా హత్తుకుని, శరీరంమీద పెదవులతో ముద్రలు వేస్తున్నాడు.

నుదుటున పెట్టుకున్న ముద్దు పచ్చ గన్నేరై, కళ్ళమీద పెట్టుకున్న ముద్దు కనకాంబరమై, పెదవుల మీద పెట్టుకున్న ముద్దు ముద్దమందారమై, వక్షం మీద పెట్టుకున్న ముద్దు బొండుమల్లెలై మొత్తం తన శరీరమే కదంబ పూలదండైనట్లు ఆమె పులకించిపోయింది.

అతనిలో కలిసిపోవాలన్న కోరికతో అంగుళం మేర మొత్తం శరీరాన్నంతా పైకి లేపి తనలోకి అదుముకుంది అతన్ని.

వాళ్ళిద్దరి సమాగమానికి కాలం కాపలాగా నిలిచింది.

మరో గంటకు ఆమె ఇంటికి బయల్దేరింది.

ఆ పౌర్ణమి వెళ్ళిన సరిగ్గా పదిహేను రోజులకి ఆమె భర్తకి లాటరీలో పాతికవేల రూపాయలు వచ్చాయి. పరంధామయ్య నడుం నొప్పి తగ్గింది. అనసూయమ్మ పంటినొప్పి పటాపంచలైంది!

ఇలా ఇంట్లోని వాళ్ళందరికీ ఏదో ఒక లాభం చేకూరింది.

ఆ రాత్రి చలపతి లహరి పక్కన చేరాడు. గోడవైపు తిరిగి పడుకున్న ఆమెను తనవైపు తిప్పుకుని “నువ్వు గోపాలకృష్ణతో గడిపాక ఇంట్లోని అందరికీ మేలు జరిగింది. మరి అసలు కథానాయిక అయిన నీకు ఏమొచ్చింది?” అని అడిగాడు.

ఆమె మళ్ళీ యథాప్రకారం గోడవైపు తిరుగుతూ చెప్పింది-

“కడుపు.

ఇలా ఉండగా….

ఉదయం అయిదు గంటలైంది. ఇంకా తూర్పు తలుపు తెరుచుకోనట్లు చీకట్లు అంతర్థానం కాలేదు. పక్షులు అప్పుడే నిద్రలేచి ఒకదాని కొకటి శుభోదయం చెప్పుకుంటున్నట్లు మెల్లగా అరుస్తున్నాయి. గాలి మార్నింగ్ వాక్ కి బయల్దేరినట్లు చిన్నగా వీస్తోంది.

పంతులు దేవాలయం ఆవరణలో వున్న బావి దగ్గిరికి చేరుకున్నాడు.

అతను మన్మథ దేవాలయం అర్చకుడు. వయసు ముప్ఫై అయిదు దాకా వుంటుంది. తన ఇరవై ఎనిమిదవ ఏట అర్చకత్వాన్ని స్వీకరించాడు. ఆలయంలోని అర్చకుడు విధిగా బ్రహ్మచర్యం పాటించాలి.

అట్లా మెరిసి మాయమయ్యే ఈ శరీరం మీద ఎందుకంత మమకారం అనిపిస్తుంది. తుచ్చమైన కోర్కెలను తీర్చుకోవడానికి మనిషిపడే తపనంతా అజ్ఞానమన్న వేదాంతం పట్టుకొస్తుంది. స్త్రీ పురుషుల మధ్య నున్న ఆకర్షణ, సంబంధాలు- ఇవన్నీ నీచమైనవిగా తోస్తాయి. ఎప్పుడో ఒకప్పుడు గాలిలో కలిసిపోయే ప్రాణం మీద తీపి, శుద్ధదండగన్న ఫిలాసఫీ మనసుకి వార్థక్యాన్ని ప్రసాదిస్తుంది. ఇలాంటి భావనలతో కుదేలైపోయాడతను.

దేవుడికి హారతి ఇచ్చి దానిని ఆమె ముందు వుంచాడు. ఆమె కళ్ళతో హారతిని అద్దుకుంది. తీర్థప్రసాదాలు ఇవ్వగానే వెళ్ళిపోయింది.

మరో అరగంటకు ఓ అవివాహిత యువతి వచ్చింది. ఆమె దేవాలయంలో లోపలికి రాగానే పైట తీసే సన్నివేశాన్ని పంతులు కళ్ళు పెద్దవి చేసి చూశాడు. అంతకు ముందు వృద్ధురాలు వచ్చినప్పుడు కలిగిన వేదాంతం అంతా ఆమె పైట అందాల ముందు వృద్ధురాలు వచ్చినప్పుడు ఎగిరిపోయింది.

1 Comment

  1. మంచి కధగా చాలా బాగా వ్రాసారు.
    Keep it up sir.

Comments are closed.