నేను బాకీ వుంది ఆయనకే 2 87

అది గత మూడేళ్ళలో మొదటిసారి పెట్టించుకున్న ముద్దులా అనిపించడం ఆమె భర్త చేసుకున్న దురదృష్టం.

తిరిగి ఇద్దరూ నడక సాగించారు. కొండపైకి చేరుకున్నాక, భవనానికీ, దేవాలయానికీ మధ్యలో పడక ఆరెంజ్ చేశాడు నరుడు. అతను భవనం లోపల నిద్రపోతున్నాడు.

“ఇదే మన పడక”

అతను పరుపు మీద కూర్చుని ఆమె చేయి పట్టుకొని కిందకు గుంజాడు.

ఆమె తూలి అతడి మీద పడింది. అతను ఎంత లాఘవంతో లాగాడంటే ఆమె స్థనాలు ఖచ్చితంగా అతని ఛాతీకి హత్తుకున్నాయి. వెన్నెల్లోని లాలిత్యాన్ని చంద్రశిలల్లోని కాఠిన్యాన్ని రంగరించినట్లు అతనికి రెండు రకాల భావనలు ఏకకాలంలో కలగడం ఆమె ఎద చేసిన ఇంద్రజాలం.

అతను ఆమెను మరింత దగ్గరగా లాక్కుని ముక్కుమీద వేలితో రాస్తూ “రోమాన్ శిల్పకళను గుర్తుకు తెస్తోంది” అని పెదవులపై పెదవులు ఆన్చి “ఫ్రాస్ ద్రాక్షతోటలు” అని ప్రశంసించి, కంఠం పొడవునా నాలుకతో రాస్తూ “ఇండియన్ టెంపుల్ గోపురం” అని పొగిడి ఆ కాస్తంత అలానే కిందకు దిగి వక్షస్థలంలో తలను గుచ్చి “ఈజిప్ట్స్ పిరమిడ్స్” అన్నాడు.

తన అందంలో ప్రపంచాన్ని చూస్తున్న అతనికి మరింతగా తన అందాలను చూపించాలన్న ఆకాంక్షతో అనాలోచితంగా చేసినట్లు నడుముకు అతుక్కుపోయిన చీరపొరను తొలగించింది.

“అమెరికన్ అమ్మాయిలు తమ శరీరాన్ని అబ్బాయిలు జాగ్రఫీతో పోల్చడం ఇష్టపడతారట. ‘నీ నడుము థేమ్స్ నదిలా వుంది’, ‘నీ నవ్వు నయాగారా జలపాతంళా వుంది’ ఇలా అన్నమాట. అదే ఫ్రెంచ్ అమ్మాయిలకయితే తమ అవయవాలను తినుబండారాలతో పోలిస్తే సంతోషిస్తారట. ఇక ఇండియన్ గాళ్స్ తమను పువ్వుల పోలికలతో వర్ణిస్తే ఆనందిస్తారట” అన్నాడు గోపాల కృష్ణ.

“అందుకే కాబోలు ప్రబంధాల్లో అలాంటి వర్ణనలు దంచేశారు”

“మరి నీకెలాంటి వర్ణనలంటే ఇష్టం?”

“నాకు నువ్వు ఏం చెప్పినా బావుంటుంది” అంది అతని ఒళ్ళో చేతులు వేసి. ఆమె పొడవాటి వేళ్ళు అతన్ని ఆకర్షించాయి. వాటిని నిమిరాడు

గోళ్ళను చూసి స్త్రీ మనస్తత్వం ఏమిటో చెప్పవచ్చునంటాడు గోణికా పుత్రుడు అనే మన పూర్వికుడు.”

ఆమెలో ఇంట్రస్టింగ్ పెరిగింది. “నా గోళ్ళు చూసి నేను ఎలాంటిదాన్నో చెప్పండి” అని చేతులు ముందుకు చాచింది.

“నీవి పొడుగాటి గోళ్ళు. ఇలాంటి గోళ్ళున్నవారు కళాపిపాసులై వుంటారు. లలితకళల పట్ల ఆసక్తి. కవిత్వం పట్ల అనురక్తి కలిగి వుంటారట.”

ఆమె పొంగిపోయింది.

“మరి వెడల్పాటి గోళ్ళుంటే?”

“అలాంటివారికి స్వార్థం ఎక్కువ వుంటుందని గోణికాపుత్రుడు సెలవిచ్చాడు. పురుషుడ్ని ప్రేమించలేరు. అతనివల్ల కలిగే లాభాలమీదే ధ్యాస వుంటుంది, ప్రతిదాన్నీ అనుమానంగా చూస్తారు.”

1 Comment

  1. మంచి కధగా చాలా బాగా వ్రాసారు.
    Keep it up sir.

Comments are closed.