నేను బాకీ వుంది ఆయనకే 2 87

అతను తన మీదకు వంగుతుండగా ఆ అనుభూతినంతా అనుభవించడానికి కళ్ళు మూసుకుంది.

ఎంతసేపటికీ అతని పెదవులు తనను స్పృశించకపోయేసరికి కళ్ళు విప్పింది. ఎందుకు ఆగిపోయావన్నట్లు చూసింది.

“నేను ఎక్కడ ముద్దు పెట్టుకోవాలో నువ్వు చెప్పాలి. ఆ పదంలో ఎన్ని అక్షరాలు వుంటాయో అన్నిసార్లు అక్కడ ముద్దుపెట్టుకుంటాను” అన్నాడు.

అయితే పైనుంచి మొదలుపెట్టాలని నిర్ణయించుకుంది. అక్షరానికి ఓ ముద్దు అన్నాడు గనుక ఎక్కువ అక్షరాలున్న పదాలు చెప్పాలి. మొదట నుదురు మీద ముద్దు పెట్టుకొమ్మని అడగాలనుకుంది. నుదురు అనే పదంలో మూడు అక్షరాలే వున్నాయి గనుక ఆ భాగానికి ప్రత్యామ్నాయ పదాల గురించి ఆలోచించింది ‘ఫాలభాగం’ అన్న పదం తట్టింది. ఇందులో సున్నాతో కలిసి మొత్తం అయిదు అక్షరాలు వున్నాయి గనుక ఫాలభాగం అంది.

అంత పొడుగు పదం ఎందుకు చెప్పిందో బోధపడి అతను నవ్వుతూ అక్కడ పెదవులు ఆన్చాడు. మొత్తం అయిదు ముద్దులు పెట్టాడు.

“నయనాలు”

కళ్ళమీద పెదవులతో అద్దాడు.

“నాసిక”

ఇంకో మూడు ముద్దులు.

“పెదవులు” ఆమె కంఠంలో మార్పు వచ్చింది. ఏదో తీయని మత్తు గొంతుని పట్టేస్తోంది.

ఆమె చెబుతుంటే అతను కిందకు దిగుతున్నాడు.

బొడ్డు దగ్గరికి వచ్చేటప్పటికి ఆమెకు ప్రత్నామ్నాయ పదం దొరకలేదు. అలా ఆలోచిస్తుంటే నాభి అన్న పదం గుర్తుకొచ్చింది. కొత్తపదం తట్టిందన్న ఆనందంతో చెప్పబోయి అందులోనూ రెండు అక్షరాలే వున్నాయన్న విషయం స్ఫురించి ఆగిపోయింది.
ఇక లాభం లేదని మెల్లగా “బొడ్డు” అని, “వత్తులుంటే కన్సొలేషన్ ముద్దులు పెట్టుకోవచ్చు కదా” అంది.

అతను నవ్వుతూ “అలా కుదరదు” అని రెండుసార్లే పెదవులతో అద్దాదు.

“నెక్ట్సు” అన్నాడు తల పైకెత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తూ.

“నెక్ట్సు ఏమీలేదు” సిగ్గువల్ల ఆమె కంఠం సన్నగా పలికింది.

అతను దానికి ఒప్పుకోనట్లు తల అడ్డంగా తిప్పాడు.

ఆపై కొనసాగించడానికి ఇష్టంలేదు. కానీ అతను మరీ బలవంతం చేయడంతో ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలో తెలియక స్వగతంగా అనుకుంటున్నట్లు “అయ్యో! భగవంతుడా” అంది.

“అంటే మూడు అక్షరాలన్నమాట” అని కిందికి వంగాడు.

తను చెప్పిన భగవంతుడికీ, అతను అన్న మూడు అక్షరాలకి సంబంధం ఏమిటో ఆమెకు అర్థం కాలేదు. అర్థమయ్యేలోపు మూడు ముద్దులూ పెట్టి లేచాడు.

1 Comment

  1. మంచి కధగా చాలా బాగా వ్రాసారు.
    Keep it up sir.

Comments are closed.