నేను బాకీ వుంది ఆయనకే 2 88

“మా ఆయన అందరం కలిసి దాక్కునే ఆట ఆడదామంటున్నాడు” సుగుణ చెప్పింది.

“అందరం కలిస్తే ఏదో ఒకటీ ఆడవచ్చులే. ఒకే ఆట ఆడినా బోర్ కొడుతుంది. కొంతసేపు దొంగాట, కోంతసేపు తొక్కుడు బిళ్ళ ఆట, మరికొంతసేపూ దాయాలాటా ఆడదాం. సినిమా రష్ గా వుంటుందని మా ఆయన ఇంటి దగ్గరున్నాడు. అందరం కలిస్తే కాలక్షేపం అవుతుంది. ఇంతకీ చలపతీ అన్నయ్య ఎక్కడ? భజనకి వెళ్ళాడా?”

“ఆఁ! గురువు వెళ్ళకపోతే. ఎలా? అదిగో అప్పుడే తబలాను శృతి చేస్తున్నట్టున్నారు. అందరం ఒక దగ్గర చేరదాం. ఇల్లు తాళం వేసి వస్తాను” అని లోపలికెళ్ళాను.

వంశీ ఎక్కడికెళ్ళాడా అని ఆలోచిస్తూ వంటిల్లంతా సర్ది ఇంటికి తాళం వేశాను
బయటికి వచ్చానో లేదో వంశీ ఎదురుపడ్డాడు.
“ఎక్కడికెళ్ళావు? ఇంతసేపూ నీ కోసమే చూస్తున్నాను.”

“ఎక్కడికి వెళ్ళలేదు. ఏవో చిన్న చిన్న పనులు చూసుకొని వచ్చేటప్పటికి ఈ వేళయింది.”

“శివరాత్రి కదా. సినిమాకి చెక్కేశావనుకున్నాను.”

“మిత్రులు రమ్మన్నారుగానీ వెళ్ళలేదు.”

“రాత్రి జాగరణ వుంటున్నావా?”

“ఆఁ”

“మరి కాలక్షేపం ఏమిటి? సుగుణావాళ్ళు ఆటలు ఆడటానికి రమ్మంటే బయల్దేరాను. నువ్వూ మాతో జాయినవ్వు. సరదాగా వుంటుంది.”

“అలానే”

ఇద్దరం సుగుణ ఇంటికి వెళ్ళేసరికి అందరూ నాకోసమే వెయిట్ చేస్తున్నారు. వంశీ కూడా రావడంతో వాళ్ళు చాలా ఆనందించారు.

దాక్కునే ఆట మొదలైంది. అందరూ రౌండుగా జేరి తప్పట్లు వేశాము. మొదట సుగుణ భర్త దొంగయ్యాడు. దొంగ అయిన వ్యక్తికి కళ్ళు మూసి అందరూ దాక్కొన్నాక కళ్ళు తెరిచే బాధ్యతను సుగుణ అత్తయ్యకు ఇచ్చాం. ఆమెకు దాదాపు డభ్బై ఏళ్ళుంటాయి.

1 Comment

  1. మంచి కధగా చాలా బాగా వ్రాసారు.
    Keep it up sir.

Comments are closed.