నేను బాకీ వుంది ఆయనకే 2 88

వంశీ మెల్లగా పైకిలేచి, నన్ను లేపడానికి చేయి అందించాడు.

ఇద్దరం డాబా మెట్లు దిగుతుండగా గేటు దగ్గర శబ్దమైంది. ఎవరో వస్తున్నట్లనిపించి నేను స్పీడుగా రెండు అడుగులు వేశాను.

గేటు లోపలికి వచ్చి అలానే నిలబడిపోయాడు నా భర్త.

అతనికేసి చూడడానికి ధైర్యం చాలక తలదించుకున్నాను. ఏదో తెలియని భయం శరీరాన్ని లొంగదీసుకుంటున్నాట్లు తూలిపడబోయి బలవంతంగా నిగ్రహించుకున్నాను.

పాపం! ఏమీ దిక్కుతోచని వంశీ అలానే నా వెనక నిలబడి పోయాడు.

మొదట తేరుకున్నది ఆయనే. మెల్లగా నడిచి వరండాలోకి వచ్చి నిలబడ్డాడు.

నేను కొంత ధైర్యం చిక్కబట్టుకున్నాను. మరీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడలేదు గనుక ఏదో అబద్ధం చెబుదామనుకున్నాను.

వెళ్ళిపొమ్మన్నట్లు వంశీవైపు తిరిగి చేతితో సైగ చేశాను.

క్షణంసేపు అలానే నా కళ్ళల్లోకి చూసి, ఆ తరువాత నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు.

నేను వరండాలోకి వచ్చి తాళం తీశాను.

ఆయన ఇంట్లోకి నడిచి, హాల్లో నిలబడిపోయాడు. లైట్ వేయలేదు. మసక వెలుతురు చీకట్లో ఈదులాడుతున్న చేపపిల్ల చర్మంలా వుంది.

“లహరీ” అని పిలిచాడు ఆయన.

ఏమిటన్నట్లు ఎదురుగ్గా వెళ్ళి నిలుచున్నాను.

“నువ్వు నాకో ప్రామిస్ చేయాలి” అంటూ చేయి చాచాటు.

ఆ ప్రామిస్ ఏమై వుంటుందోనని ఆ క్షణంలో వున్న విధాలుగా వూహించాను.

కానీ నాఊహలన్నీ తప్పు.

“ఆ ప్రామిస్ ఏమిటో తెలుసా? నువ్వు ఎప్పటికీ వంశీని వదలకూడదు.”

1 Comment

  1. మంచి కధగా చాలా బాగా వ్రాసారు.
    Keep it up sir.

Comments are closed.