నేను బాకీ వుంది ఆయనకే 2 88

“మా వారిలాంటి వాళ్ళకి అంత తీరిక ఎక్కడిది? డీలక్స్ బస్ లో ప్రయాణిస్తుంటే అర్థరాత్రి సడన్ గా దోపిడీ దొంగలు అటకాయించి, వేసుకున్నవన్నీ ఒలుచుకుపోయినట్లు వుంటుంది మా వారి ప్రవర్తన. అంత కంగారు పెట్టేస్తేడన్న మాట ఏ అపరాత్రో పక్కనజేరి. ఇప్పుడయితే అదీ లేదనుకో.”

“కరెక్టే సెక్స్ ను భార్యాభర్తలు ఓ గొప్ప సరదాకింద ట్రీట్ చేయాలి. ఎప్పుడంటే అప్పుడు, నువ్వు చెప్పినట్లు దోపిడీ దొంగల్లా అదరగొట్టేయ కూడదు. దీనికి ప్రత్యేకించి నైట్ డైరీ లాంటిది భార్యాభర్తలు ఇద్దరూ కలిసి రాసుకోవాలి. ఈ డైరీలో ఎప్పుడు సెక్స్ లో పాల్గొనాలో, ఆరోజు ఎలాంటి డ్రస్ వేసుకోవాలో ఏ రీతిలో, ఎంతసేపు పాల్గొనాలో చిన్న చిన్న విషయాలు కూడా రాసుకోవాలి. ఇలా నైట్ డైరీ మెయిన్ టైన్ చేయడంవల్ల తాము నిర్ణయించుకున్న రాత్రి కోసం ఎదురుచూడడం, ఆరోజు వేసుకోవాలనుకున్న డ్రస్ లను భద్రపరచుకోవడం ఇలాంటివన్నీ బావుంటాయి.”

“ఈ నైట్ డైరీ ఐడియా బావుంది. ఆ రోజు అలంకరణ గురించి ఈరోజునుంచే ఊహించుకోవడం, ఆ రాత్రి కోసం కలలు కనడం, ఆ రాత్రి భంగిమ పదే పదే కళ్ళలో మెదలడం, తీరా ఆ రోజు వచ్చాక తొట్రుపడడం థ్రిల్లింగ్ గా వుంటుంది.”

వెన్నెల వాళ్ళిద్దరి మీద కురిసి నిశ్శబ్దంగా కిందకు జారుతోంది.

“నువ్వు ఇంతవరకూ ఎవరికీ చెప్పని సంఘటన ఏమైనా వుందా?” కాసేపు మౌనంగా తరువాత అడిగాడు.

“ఇదీ ఆచారంలో ఒక భాగమే. ఇది చెప్పేస్తే ఆ తరువాత మనం…..” ఆపై వివరించలేదు అతను.

* * *

గుండెల్లో విరబోసినట్లు నిశ్శబ్దంగా కోరికను రెచ్చగొడుతున్న వెన్నెల.

పక్కపక్కనే రహస్యాలు మాట్లాడుకుంటున్నట్లు రాసుకుంటున్న శరీరాలు….. ఇవన్నీ అతన్ని తొందర చేస్తున్నాయణి గ్రహించింది. ఆమెకూ అలానే వుంది.

“ఊఁ!”

ఆమె చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నట్లు గొంతు సవరించుకుంది.

అతను ఆమెవైపు తిరిగి కళ్ళలోకి చూస్తూ వింటున్నాడు.

“నాకు అప్పుడు ఇరవయ్యేళ్ళు. పెద్దదానయ్యి అప్పటికి ఏడేళ్ళు అవుతోంది. యవ్వనం ప్రతి అవయవంలోనూ చేరి అల్లరి పెడుతోంది.

పగలు ఏదో పనులతో గడిచిపోయేదిగానీ రాత్రే ఇబ్బందిగా తయారైంది. ఒంటరితనంతో సతమతయ్యే నేనంటే పరిహాసం పడుతున్నట్లు. పట్టిమంచం తన కాఠిన్యాన్నంతా ప్రదర్శించేది. కాలేజీ ఆకతాయి కుర్రాడిలా గాలి నన్ను సైతం స్పృశించి వెకిలిగా నవ్వేది. అప్పుడప్పుడూ కిటికీ పక్కన చేరిన చంద్రుడు కుర్రాడిలా గిలిగింతలు పెడుతున్నట్లు చూసేవాడు. గూర్ఖావాడి నల్లటి టోపీలా వుండే చీకటి నామీద పడి నన్ను మరింత తాపానికి గురిచేసేది.

ఇలా అవస్థపడుతుండగా ఓరోజు మా అమ్మ నన్ను డాబామీదకి పిలిచింది.

“ఏమిటే అమ్మా? అలా హడావిడిగా పిలిచావ్?”

“ఇక అంతా హడావుడే! నువ్వు ఊఁ అంటే, నీకు పెళ్ళి చేయాలని అనుకుంటున్నాం. పదో తరగతి చదువుకున్నావ్. ఏదో దేవుడి దయవల్ల దేనికీ లోటులేదు. మగపిల్లాడైనా, ఆడపిల్లయినా నువ్వు ఒక్కదానివే మాకు. అందుకే నీ ముద్దూ ముచ్చటా చూడాలని ఉబలాటపడుతున్నాం. అందునా నీకు ఇరవై ఏళ్ళు వచ్చేశాయి కూడా. ఇంతకీ నీ మావయ్య చలపతి మీద నీ అభిప్రాయం ఏమిటో చెప్పు.

1 Comment

  1. మంచి కధగా చాలా బాగా వ్రాసారు.
    Keep it up sir.

Comments are closed.